Harish Shankar: స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం సిసిల మీడియాలో యాక్టివ్ గా ఉండే హరీష్ శంకర్ ఏది ఉన్నా ముఖం మీద చెప్పేస్తాడు. తనను ఎవరిపైన కించపర్చేలా మాట్లాడినా.. తన సినిమాలను ట్రోల్ చేసినా.. వారికి తగ్గ కౌంటర్లు ఇస్తూ ఉంటాడు. అందుకే అంత సామాన్యంగా ఎవరు హరీష్ ను కదిలించరు.
మొన్నా మధ్య సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు తో వివాదం అప్పుడు కూడా వార్నింగ్ ఇస్తూ ఒక పెద్ద లెటర్ నే రిలీజ్ చేశాడు. ఆ తరువాత వారిద్దరూ కలిసిపోయారు. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. అయితే అది ఎవరికి అనేది తెలియడం లేదు. అందుతున్న సమాచారం ప్రకారం ఒక జర్నలిస్ట్ కే ఈ వార్నింగ్ అని టాక్ నడుస్తోంది.
” రిలీజ్ దగ్గర పడుతుంది కదా.. ఏం పోస్ట్ చేసిన భయపడి తగ్గుతాడు అని..ఒక ముసలి నక్క మళ్ళీ మొదలు పెడుతోంది.. దయచేసి అలాంటి అపోహలు పెట్టుకోవద్దని మనవి.. నా జోలికొస్తే రేపు రిలీజ్ అయినా వదలను!!!” అంటూ రాసుకొచ్చాడు.
హరీష్ శంకర్ చెప్పిన ముసలి నక్క ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అసలు ఎందుకు హరీష్ ఇంత ఫైర్ అయ్యాడు అనేది కూడా మిస్టరీగా మారింది. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్ బచ్చన్.
మిరపకాయ్ లాంటి హిట్ సినిమా తరువాత రవితేజ- హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
రిలీజ్ దగ్గర పడుతుంది కదా …
ఏం పోస్ట్ చేసిన భయపడి తగ్గుతాడు
అని…ఒక ముసలి నక్క మళ్ళీ మొదలు పెడుతోంది ….
దయ చేసి అలాంటి అపోహలు పెట్టుకోవద్దని మనవి.. నా జోలికొస్తే రేపు రిలీజ్ అయినా వదలను!!!
— Harish Shankar .S (@harish2you) July 9, 2024