BigTV English

Bigg Boss 9 : బిగ్ బాస్ నుండి అదిరిపోయే అప్డేట్.. దివ్వెల మాధురి కన్ఫామ్.. మరి దువ్వాడ?

Bigg Boss 9 : బిగ్ బాస్ నుండి అదిరిపోయే అప్డేట్.. దివ్వెల మాధురి కన్ఫామ్.. మరి దువ్వాడ?

Bigg Boss 9 : గత కొంతకాలంగా ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమం గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా పేరు సొంతం చేసుకున్న ఈ షో ఇప్పుడు తెలుగులో 9వ సీజన్ కోసం సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా పెద్ద ఎత్తున అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కామన్ మ్యాన్ కేటగిరీలో భాగంగా అగ్నిపరీక్ష అనే ఒక కొత్త కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టి.. 100 మందిలో 40 మందిని తీసి.. ఆ 40 మందిలో 15 మందికి ఇప్పుడు అగ్నిపరీక్షలో పలు టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇక ఈ 15 మందిలో ఐదుగురికి అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం. మరొకవైపు ఈ అగ్నిపరీక్ష కార్యక్రమానికి బిందు మాధవి, నవదీప్, అభిజిత్ లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.


బిగ్ బాస్ లోకి దివ్వెల మాధురి కన్ఫామ్..

ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ సీజన్ 9 కోసం దివ్వెల మాధురి (Divvela madhuri) తో పాటు దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) జంట కూడా ఈ సీజన్లో పాల్గొనబోతున్నారు అంటూ ఒక వార్త తెరపైకి రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇదే వార్త గనుక నిజమైతే ఈ షో ఈసారి ఊహించని రేటింగ్ సొంతం చేసుకుంటుంది అని కూడా కామెంట్లు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు తాజాగా మరో వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో నిలుస్తున్న దివ్వెల మాధురి ఇప్పుడు కన్ఫామ్ అయినట్లు సమాచారం. ఇప్పటికే రియాల్టీ షో నిర్వహకులు ఆమెను సంప్రదించగా.. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఒంటరిగా కాకుండా రాజా దువ్వాడ శ్రీనివాస్ ను కూడా వెంటబెట్టుకొని జంటగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.


ఒక్క క్లారిటీతో భారీ పాపులారిటీ..

ఈ జంట విషయానికి వస్తే.. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ శ్రీనివాస్, మాధురి బంధం నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. వీరిద్దరూ చట్టా పట్టాలేసుకొని తిరగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. గత కొంతకాలం వరకు రహస్యంగా మైంటైన్ చేసిన తమ రిలేషన్ ని ఒక్కసారిగా బయటకు ప్రకటించి.. మరింత పాపులారిటీ అయిపోయారు. అప్పటినుంచి నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తున్న ఈ జంట ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ లోకి రాబోతున్నారని తెలిసి మరొకసారి వార్తల్లో నిలిచారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా మరొకవైపు ఇప్పటికే బిగ్ బాస్ లోకి ఎన్నో జంటలు వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే. మరి ఈ జంట బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.. మరి జంటగా హౌస్ లోకి కానీ ఇందులో ఎంత నిజం ఉంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Related News

Bigg Boss Thanuja: ఫస్ట్ లవ్ రివీల్ చేసిన తనూజ, మరీ ఇంత ముదురా?

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ ప్రియా శెట్టి.. కానీ?

Bigg Boss 9 Promo: గోల్డెన్ ఆపర్చునిటీ.. పాపం ఆ కంటెస్టెంట్ బలి!

Bigg Boss 9: నామినేషన్ లో 6గురు..గురి వారి మీదే!

Bigg Boss Promo: దివ్య ను టార్గెట్ చేశారా? ఆ కామనర్ దగ్గర హౌస్ మేట్స్ నిజంగానే తోలుబొమ్మలా?

Bigg Boss 9 Promo: మళ్లీ నోరు జారిన హరిత హరీష్.. ఈసారి బ్యాండ్ బాగానే!

Bigg Boss 9 Promo: నామినేషన్ రచ్చ షురూ.. వ్యాలీడ్ పాయింట్స్ చెప్పండమ్మా!

Bigg Boss 9: సంజన పోపు ఘాటు దెబ్బకు తనూజ అవుట్.. మాస్క్ మ్యాన్ సైలెంట్ కౌంటర్..

Big Stories

×