Nagarjuna Sagar: భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ప్రవాహం కొనసాగుతుంది. దాంతో ప్రాజెక్టు 22 గేట్లను ఐదు అడుగుల మేర పైకి ఎత్తి.. లక్షా 72వేల 194 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు డ్యాం అధికారులు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో లక్షా 98 వే 152 క్యూసెక్కుల ఉండగా.. ఔట్ ఫ్లో 2 లక్షల 13వేల 596 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 587 అడుగులకు చేరింది. డ్యాం ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 306 టీఎంసీలుగా కొనసాగుతోంది. సాగర్ జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పతి కొనసాగుతోంది.
పులిచింతల ప్రాజెక్టుకు భారీగా కొనసాగుతున్న వరద
పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 6 గేట్లను 4 మీటర్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2 లక్షల 15 వేల 728 క్యూసెక్కులుగా ఉండగా.. అవుట్ ఫ్లో లక్షా 96వేల 969 క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 171 అడుగులుకు చేరింది. ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం 42.16 టీఎంసీలుగా ఉంది. విద్యుత్ ఉత్పత్తికి 16 వేల 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా 2 లక్షల 8 వేల 372 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుంది. అలాగే మూసీ నది ద్వారా 7వేల 356 క్యూసెక్కులు నీరు పులిచింతల లోకి వచ్చి చేరుతుంది.
జూరాల 6 గేట్లు ఎత్తి నీటి విడుదల
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. దాంతో ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రస్తుత నీటి మట్టం 317 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 99వేల 307 క్యూసెక్కులు ఉండగా… ఔట్ ఫ్లో 93వేల 231 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు 5 పవర్‌హౌస్‌ల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Also Read: నూర్ మహమ్మద్ పై దేశద్రోహ కేసు.. 14 రోజుల రిమాండ్
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయం 5 రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగులు మేర ఎత్తి… దిగువ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో లక్షా 17 వేల 402 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో లక్షా 97వేల 152 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు ప్రస్తుతం నీటి మట్టం 881 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో ప్రస్తుతం 196 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.