YouTuber Armaan Malik:ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా ఎవరు ఎలాంటి కంటెంట్ ప్రసారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ముఖ్యంగా కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లు, యూట్యూబర్లు క్రియేట్ చేస్తున్న కంటెంట్ పలువురు మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయని చెప్పవచ్చు. ఆ కారణంగానే ఇప్పుడు సదరు వ్యక్తులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనడంలో సందేహం లేదు.ఈ క్రమంలోనే ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలతో వార్తల్లో నిలిచిన ప్రముఖ యూట్యూబర్ అర్మాన్ మాలిక్ (Armaan Malik) కూడా తాజాగా చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆయనకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
యూట్యూబర్ కి కోర్టు నోటీసులు..
ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ 3 కంటెస్టెంట్ మాలిక్ తో పాటు ఆయన ఇద్దరి భార్యలకి కూడా పాటియాల జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. ముఖ్యంగా రవీందర్ రాజ్ పుత్ దాఖలు చేసిన పిటిషన్ తర్వాత ఈ ముగ్గురిని సెప్టెంబర్ 2న హాజరు కావాలి అని కోరుతూ పిటిషన్ లో తెలిపింది. అసలు విషయంలోకి వెళ్తే.. అర్మాన్ మాలిక్ హిందూ వివాహ చట్టాన్ని ఉల్లంఘించాడని పిటీషన్ లో ఆరోపించారు. హిందూ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి ఒక భాగస్వామిని మాత్రమే వివాహం చేసుకోవచ్చు. కానీ అర్మాన్ మాత్రం తన పేరుతో రెండు కాదు ఏకంగా నాలుగు వివాహాలు చేసుకున్నాడని ఫిర్యాదులో తెలిపారు. ఇది రుజువైతే ద్విభార్యత్వంగా పరిగణించబడుతుంది. ఇది చట్టరీత్యా నేరం అని స్పష్టం చేశారు. ద్విభార్యత్వ ఆరోపణలతో పాటు అర్మాన్ అలాగే అతని భార్యలు మతపరమైన మనోభావాలను కూడా దెబ్బతీశారు అంటూ సదరు పిటిషనర్ తన పిటిషన్ లో ఆరోపించారు.
ఒక్క వీడియోతో చిక్కుల్లో పడ్డ యూట్యూబర్ కుటుంబం..
దాంతో అర్మాన్ మాలిక్ తో పాటూ ఆయన ఇద్దరు భార్యలు పాయల్ మాలిక్, కృతిక మాలిక్ లకు జిల్లా కోర్టు వేరువేరుగా నోటీసులు జారీ చేసింది. ఇందులో పాయల్ మాలిక్ హిందూ దేవత కాళీ వేషంలో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వివాదం మొదలైంది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియోని అగౌరవంగా, అభ్యంతరకరంగా భావించిన చాలామంది వ్యక్తులు విమర్శించారు.దీంతో అర్మాన్ – పాయల్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అని కోరారు.
పశ్చాత్తాప దిశగా అడుగులు వేసిన యూట్యూబర్ జంట..
చేసేదేమీలేక ఈ జంట జూలై 22న ప్రార్థనలు చేసి.. క్షమాపణ కోరడానికి పాటియాలాలోని కాళీమాత ఆలయాన్ని సందర్శించారు. మరుసటిరోజే పాయల్ మొహాలిలోని ఖరార్ లో ఉన్న మరొక కాళీ ఆలయంలో ఏడు రోజులపాటు మతపరమైన తపస్సును ప్రారంభించింది. తపస్సులో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరచడం, పశ్చాతాప చర్యగా సాంప్రదాయ ఆచారాలను నిర్వహించడం లాంటివి చేసింది. ఆ తర్వాత ఈ జంట హరిద్వార్ కు వెళ్లి అక్కడ నిరంజని అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ కైలాసానంద గిరిని కలిశారు. ఆ వీడియో వల్ల తమకు ఏర్పడిన వివాదానికి క్షమాపణ కోరుతూ ఆయన వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు.
ఉత్కంఠ రేకెత్తిస్తున్న కోర్టు తీర్పు..
ఇకపోతే అర్మాన్ 2010లో పాయల్ ను వివాహం చేసుకోగా.. ఆమెకు విడాకులు ఇవ్వకుండానే 2018లో కృతికాని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం చట్టపరమైన కేసు ఇప్పుడు ఈ వివాహాలు హిందూ వివాహ చట్టాన్ని ఉల్లంఘించాయి అని, అలాగే ద్విభార్యత్వంతో పాటు మతపరమైన నేరం ఆరోపణలు నిజమా అనే కోణంలో జిల్లా కోర్టు విచారణ చేపట్టనుంది. సెప్టెంబర్ 2 కి విచారణ వాయిదా వేయడంతో ప్రస్తుతం అందరి దృష్టి కోర్టు ఇచ్చే తీర్పు పైనే ఉంది అని చెప్పవచ్చు.
ALSO READ:War 2: సినిమా ప్రసారంలో అంతరాయం.. 20 నిమిషాల పాటు నిలిచిపోయిన ప్రదర్శన!