Big TV Kissik Talks : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పుడు నుంచో వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అలానే కొంతమంది దాని గురించి పోరాటం కూడా చేశారు. అయితే దాని పూర్తిగా ఒక కొలిక్కి రాకముందే మధ్యలో ఆపేశారు. ఇండస్ట్రీలోనే కాకుండా సమాజంలో అయినా కూడా ఏదైనా ఒక విషయాన్ని కేవలం రెండు రోజులు మాత్రమే పరిగణలోకి తీసుకొని పట్టించుకుంటారు. ఆ తర్వాత కొత్త ఇష్యూ వస్తే ఉన్నదని మర్చిపోతారు.
ఇండస్ట్రీ అనగానే బయట చూసే సమాజానికి కొద్దిపాటి అపోహలు కూడా ఉంటాయి. వాటిలో ఇక్కడ కొన్ని అక్రమ సంబంధాలు కూడా ఉంటాయి అని నమ్ముతుంటారు. హీరోకి హీరోయిన్ కి మధ్య ఏవేవో జరిగిపోతున్నాయని అనుకుంటారు. దీని గురించి జబర్దస్త్ యాంకర్ సౌమ్యరావు స్పందించారు. రీసెంట్ గా బిగ్ టీవీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మొత్తం ఓపెన్ అయ్యారు.
ఆ హీరోయిన్ కార్ తో గుద్దుతుంది
ఇండస్ట్రీలో కొన్ని విషయాలను బయట పెడితే ఒక ఎగ్జాంపుల్ చెప్పింది సౌమ్యరావు. తాను ఒక సీరియల్ చేస్తున్నప్పుడు, ప్యాకప్ అయిపోయిన తర్వాత ఆ హీరో వచ్చి సౌమ్యరావుతో మాట్లాడుతున్నాడట. ఆ సీరియల్ హీరోయిన్ వీళ్లిద్దరూ మాట్లాడటం చూసింది. అయితే ఆ హీరోకి, హీరోయిన్ కి మధ్య ఏదో ఉంది. ఇది సౌమ్యరావుకి అర్థమైంది. కేవలం సౌమ్య రావు తో మాట్లాడుతున్నాడని చెప్పి ఆ హీరోయిన్ కార్ రివర్స్ చేసి సౌమ్యరావుని గుద్దిందట. ఈ విషయాన్ని చాలా బాధపడుతూ చెప్పింది సౌమ్యరావు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నా జీవితంలో చాలా ఉన్నాయి. నాకు ఇండస్ట్రీ ఇచ్చిందానికంటే నేను ఇండస్ట్రీలో కోల్పోయింది ఎక్కువ అని చెప్పింది సౌమ్యరావు.
కార్ యాక్సిడెంట్
ఒక తరుణంలో ఒక హీరోను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిందట. అయితే కారులో ఆ ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నప్పుడు తనకి ఒక భారీ ఆక్సిడెంట్ జరిగిందట, దానితో నా కాలిపోయింది విపరీతంగా రక్తం వచ్చింది. ఇక్కడ నుంచి నేను వేరే యాంకర్ ఉన్నచోటికి వెళ్లాలి. అంటూ తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి రివీల్ చేసింది.