BigTV English

Tollywood Movies : హీరో క్యారెక్టర్ చనిపోయినా హిట్ అందుకున్న సినిమాలు ఇవే..

Tollywood Movies : హీరో క్యారెక్టర్ చనిపోయినా హిట్ అందుకున్న సినిమాలు ఇవే..

Tollywood Movies : సినిమాలకు హీరోలు చాలా ముఖ్యం.. అతనిదే హైలెట్ పాత్ర.. హీరోయిన్ కంటే హీరోనే ఎక్కువగా చూస్తారు. సినిమా వాల్ పోస్టర్ మీద హీరోయే క్రౌడ్ పుల్లర్.. విలన్ చేతిలో చనిపోకుండా హీరోనే విలన్ ను చంపేసి కథకు ముంగింపు పలుకుతారు. హీరోల క్యారక్టర్ సినిమా మొత్తం ఉంటుంది. కొన్ని సినిమాల్లో మొదట హీరో క్యారెక్టర్ చనిపోయినట్టు చూపించిన కూడా ఆ తర్వాత ఆయన బ్రతికి వచ్చి స్టోరీకి శుభం కార్డు వేస్తారు. కొన్ని సినిమాల్లో ఊహించని విధంగా హీరోలు, హీరోయిన్లు చనిపోయినప్పుడు మనం బాధపడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కొన్ని సినిమాలలో హీరో మరణించడం తో అభిమానులు నిరాశగా బయటకి వస్తూ ఉంటారు.. అలాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. హీరో చనిపోయిన కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాల గురించి వివరంగా తెలుసుకుందాం..


భీమిలి కబడ్డీ జట్టు…

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం భీమిలి కబడ్డీ జట్టు.. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాగా ఆకట్టుకుంది.. కబడ్డీలో ఎలాగైనా నెగ్గాలని కుదురు ప్రయత్నం చివరికి ఫలిస్తుంది. కానీ సినిమా చివర్లో హీరో చనిపోతారు.. బ్లాక్ బస్టర్ హీట్ అయింది..


ఈగ.. 

దర్శక ధీరుడు రాజమౌళి, నాచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ఈగ.. సమంత హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో విలన్ నానిని చంపేస్తారు. ఆ తర్వాత ఈగ లోకీ ఆత్మ వస్తుంది. విలన్ ను చంపేస్తాడు. ఇందులో నాని కొద్దిసేపు మాత్రమే కనిపిస్తాడు.. మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది.

నేనే రాజు నేనే మంత్రి.. 

తేజ దర్శకత్వంలో 2017 లో వచ్చిన ఈ చిత్రంలో రానా, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు.. ఇందులో హీరో చనిపోతాడు.. అలా మూవీ హిట్ అవుతుంది.

జెర్సీ..

గౌతం తిన్ననూరి దర్శకత్వం లో నాని హీరోగా నటించారు. ఇది క్రికెట్ ఆట నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ ఉంటుంది. క్రికెట్ ఆటలో చివరకు చనిపోతాడు. మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది.

Also Read : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు..అస్సలు మిస్ అవ్వకండి..

ఇవే కాదు ఇంకా ఎన్నో సినిమాలు ఉన్నాయి. అందులో అడివి శేష్ ఎంతో సీరియస్ గా తీసుకొని తెరకెక్కించిన మేజర్ సినిమాలో కూడా హీరో పాత్ర చనిపోతాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వం లో వచ్చింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు.. ఈ మూవీలో హీరో చనిపోతాడు. చివరంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపుతాడు అనే ప్రశ్నార్థకంతో సినిమాని ఎండ్ చేశాడు. ఆ తర్వాత పార్ట్ 2 లో దాని స్టోరీని రివిల్ చేశాడు.. ఇలా ఎన్నో సినిమాలు మంచి స్టోరీ తో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి..

Related News

Tollywood Producer: ఒకేసారి 15 సినిమాలకు కమిట్ అయిన నిర్మాత.. రికార్డుల కోసం రిస్క్ అవసరమా?

Ram Gopal Varma: నాన్న జన్మనిస్తే.. నాగార్జున రెండో జీవితాన్ని ఇచ్చారు.. వర్మ ఎమోషనల్ !

Kollywood: ధనుష్ చెల్లెలిగా స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా?

Pawan Kalyan: మీరు మా పెద్దన్న.. స్టార్ హీరోపై పవన్ కళ్యాణ్ ట్వీట్!

Malaika Arora: 51 ఏళ్ల వయసులో రెండో పెళ్లి… నేను రొమాంటిక్ అంటున్న నటి!

Manam Movie: ఐసీయూ బెడ్ మీద నుంచి  ఆ సినిమా డబ్బింగ్ చెప్పిన హీరో… ఇది కదా డెడికేషన్ అంటే?

Big Stories

×