BigTV English

Bigg Boss Agnipariksha : బిగ్ బాస్ లో తెలంగాణ పిల్ల.. ఈమె బ్యాగ్రౌండ్ ఏంటంటే..?

Bigg Boss Agnipariksha : బిగ్ బాస్ లో తెలంగాణ పిల్ల.. ఈమె బ్యాగ్రౌండ్ ఏంటంటే..?

Bigg Boss Agnipariksha : బుల్లితెరపై ఎన్నో రకాల ప్రోగ్రాములు ప్రత్యేకమైన షోలు వస్తూనే ఉంటాయి. కానీ ఏడాదికి ఒకసారి వచ్చి బిగ్ బాస్ కోసం అభిమానులు వెయిట్ చేస్తూ ఉంటారు. సెలబ్రిటీలు అందరినీ ఒకచోట చేర్చి హౌస్ లో వాళ్ళ మధ్య టాస్కులు పెడుతూ చిచ్చు పెడుతున్న బిగ్ బాస్ ని చూసేందుకు తెలుగు ఆడియన్స్ ఆసక్తి కనపరుస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు తొమ్మిదవ సీజన్ ని స్టార్ట్ చేయబోతున్నారు మేకర్స్. వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ షో మొదలు కాబోతుంది. ఈ క్రమంలో షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్ల కోసం బిగ్ బాస్ సరికొత్త ప్లాన్ చేసింది. జియో హాట్ స్టార్ లో బిగ్ బాస్ అగ్ని పరీక్ష పేరుతో షోని మొదలు పెట్టారు.. అందులో సెలెక్ట్ అయిన వారిని సీజన్ 9 లోకి పంపిస్తున్నారు. ఈ బిగ్ బాస్ అగ్నిపరీక్షలో తెలంగాణ పిల్ల అనూష పై అందరి ఫోకస్ పడింది. అసలు ఈ పోరి బ్యాగ్రౌండ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


బిగ్ బాస్ అగ్నిపరీక్ష..

ప్రేక్షకులను ఆకట్టుకున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 త్వరలోనే ప్రారంభం కాబోతుంది. గతంలో లాగా ఈ సీజన్ విమర్శలు అందుకోకుండా సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. అందుకోసం ముందుగా కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసేందుకు బిగ్ బాస్ అగ్నిపరీక్ష పేరుతో ఓ షోని స్టార్ట్ చేశారు. ఇందులో అభిజిత్, నవదీప్, బిందు మాధవి కంటెస్టెంట్స్ మధ్య టఫ్ పోటీని పెట్టి సెలెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొంతమందిని త్వరలోనే సెలెక్ట్ చేసి సీజన్ ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షలు తెలంగాణ పిల్ల అనూష అందరినీ ఆకట్టుకుంటుంది. ఈమె బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోవాలని నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ ఈమె గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..


బిగ్ బాస్ అనూష బ్యాగ్రౌండ్..

బిగ్ బాస్ అగ్నిపరీక్ష కోసం ఇప్పటికే వివిధ రంగాల నుంచి 40 మందిని ఎంపిక చేసి, వారిలో నుంచి 15 మందిని ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ జాబితాలో అనూషా రత్నం అనే పేరు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అమ్మాయి వరంగల్ పిల్ల.. ఎమ్మెస్సీ పూర్తి చేసి, ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఐదేళ్లు పనిచేశారు.. అయితే జాబ్ వదిలేసి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారింది అనూష. అక్కడ అనుకోని రీతిలో రెస్పాన్స్ రావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ లోకి వచ్చే ఛాన్స్ ని కొట్టేసింది. బయట బాగా ఫాలోయింగ్ పెంచుకున్న ఈమె బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..

Also Read: ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు..అస్సలు మిస్ అవ్వకండి..

బిగ్ బాస్ సీజన్ 9.. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. సెప్టెంబర్ 7న లేదా సెప్టెంబర్ 15న ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.. ప్రస్తుతం అగ్నిపరీక్ష కొనసాగుతుంది. సెప్టెంబర్ 5 వరకు జియో హాట్ స్టార్ లో ఈ అగ్ని పరీక్ష కొనసాగుతుంది. ఈసారి ఎక్కువగా బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్యులు రావడంతో ప్రేక్షకులంతా ఆసక్తి కనబరుస్తున్నారు. వాళ్ల మధ్య బిగ్ బాస్ ఎలాంటి చిచ్చు పెడుతుందో చూడాలి..

Related News

Bejawada Bebakka: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బెజవాడ బేబక్క… ఇల్లు చూశారా ఎంత బాగుందో?

Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ ఇంటిపై కాల్పులు.. ఏకంగా 12 రౌండ్లు గన్ షాట్స్

Bigg Boss 9 : బిగ్ బాస్ నుండి అదిరిపోయే అప్డేట్.. దివ్వెల మాధురి కన్ఫామ్.. మరి దువ్వాడ?

Bigg Boss New Voice: బిగ్ బాస్‌నే మార్చిపడేశారు… వాయిస్ ఏంటి ఇలా ఉంది ?

Bigg Boss Agnipariksha: నాలో స్వీట్ చాక్లెట్ బాయ్ నే చూశారు… భయపెడుతున్న అభిజిత్

Big Stories

×