Big TV Kissik Talks : ఒక ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలి అంటే గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే సరిపోదు ఆవగింజంత అదృష్టం ఉండాలి అని చెబుతారు. కచ్చితంగా అదృష్టం ఉండాలి అనే మాట వాస్తవమే, అలానే టాలెంట్ లేకపోతే ఎక్కువ కాలం ఇక్కడ నిలవలేము అనేది అసలైన వాస్తవం.
అయితే టాలెంట్ లేని వాళ్ళు కూడా మంచి గుర్తింపు సాధిస్తుంటారు.ఇది కొంతమందికి ఎప్పటికీ అర్థం కాదు. ఇదే విషయాన్ని రవితేజ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిజంగా టాలెంట్ ఉన్నోడు పైకొస్తే ఏమీ అనిపించదు. ఏమి టాలెంట్ లేని వాడిని చూస్తేనే అలా అనిపిస్తుంది అంటారు. ఇక ప్రస్తుతం అదే అంశం పైన తన ఉద్దేశాన్ని తెలిపింది జబర్దస్త్ యాంకర్ సౌమ్యరావు.
ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు
బిగ్ టివి కిస్సిక్ టాక్ షో కి హాజరైన సౌమ్యరావు అనేక ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో మీరు హార్డ్ వర్క్ ని నమ్ముతారా లక్కు నమ్ముతారా అని యాంకర్ వర్ష అడిగినప్పుడు, ఇక్కడ హార్డ్ వర్క్ పనికిరాదు రా లక్కే ఇంపార్టెంట్.
ఇప్పుడు ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరికీ టాలెంట్ ఉందా.? నువ్వు కరెక్ట్ గా చెప్పు. కొంతమంది లక్ పరంగా వస్తారు, కొంతమంది కొన్ని గిమిక్స్ పరంగా వస్తారు, వచ్చారు, వస్తూనే ఉంటారు. అంటూ తన ఒపీనియన్ తెలియజేసింది.
ఉదయభాను మాటలకు మద్దతు
యాంకర్ ఉదయభాను గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని కారణాల వలన ఆమె హవా ఇప్పుడు తగ్గింది కానీ ఒకప్పుడు యాంకరింగ్ లో ఆమె నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆమె యాంకరింగ్ చాలా పవర్ ఫుల్ గా ఉండేది. చాలా రియాలిటీ షోస్ ఆమె యాంకరింగ్ వలన సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత కాలంలో ఆమె కొంచెం యాంకరింగ్ కి దూరమయ్యారు. ఇక ప్రస్తుతం కొన్ని సినిమాల్లో కనిపిస్తున్నారు. అయితే యాంకరింగ్ గురించి మాట్లాడుతూ ఇక్కడ పెద్ద సిండికేటే నడుస్తుంది అని చెప్పారు ఉదయభాను. ఇప్పుడు అదే మాటలను జబర్దస్త్ యాంకర్ సౌమ్యరావు బిగ్ టీవీ కిసిక్ టాక్స్ లో గుర్తు చేసింది.
Also Read: Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను