Deepthi Sunaina: ప్రముఖ నటి బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన (Deepthi Sunaina) గత వారం క్రితం కొత్త బిజినెస్ మొదలుపెట్టబోతున్నట్లు ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కొత్త బిజినెస్ ను చెన్నైలో ప్రారంభించింది. ఈ మేరకు నిన్న ఘనంగా ఓపెనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీప్తి సునైనా తల్లిదండ్రులతో పాటు స్నేహితులు, సన్నిహితులు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను దీప్తి సునయన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. కొత్త బిజినెస్ మొదలు పెట్టడంతో అభిమానులు ఈమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన దీప్తి..
హెచ్ కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ బిజినెస్ ను తాజాగా ఈమె మొదలుపెట్టింది. ముఖ్యంగా హర్షిత(Harshita ), కార్తీక్ (Karthik )లతో కలిసి క్లినిక్ బ్రాంచ్ ను చెన్నైలో ప్రారంభించింది. ఈ హెచ్ కె పెర్మనెంట్ మేకప్ క్లినిక్ లో ఐబ్రో మైక్రోబ్లీడింగ్, లిప్ కలర్ కరెక్షన్ తో పాటు ఇతర కాస్మెటిక్ విధానాల వంటి సేవలను ఇక్కడ అందించనున్నారు. ముఖ్యంగా హెచ్ కే ఫార్మా అండ్ కాస్మెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో భాగం కావడం గమనార్హం. ఇకపోతే ఈమెతో పాటు సిరి హనుమంత్ (Siri Hanumanth) కూడా ఈ బిజినెస్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో తేదీన ఆమె ఈ హెచ్ కే పర్మినెంట్ మేకప్ క్లినిక్ ను మొదలు పెట్టింది. దీనికి బిగ్ బాస్ తాజా మాజీ కంటెస్టెంట్స్ అందరూ కూడా హాజరయ్యారు.
దీప్తి కెరియర్..
దీప్తి కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టడంతో ఈమె కూడా సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీప్తి సునైనా విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలతో ప్రజలను ఆకట్టుకొని బాగా ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా కొన్ని కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ లో చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. మరొకవైపు షణ్ముఖ్ జస్వంత్ అనే మరో యూట్యూబర్ తో ప్రేమాయణం నడిపిన ఈమె.. బిగ్ బాస్ కారణంగానే తన ప్రియుడికి దూరమైందనే చెప్పవచ్చు. ఇక ఈమె కూడా బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొని బిగ్బాస్ కి వెళ్లిన వారిలో అతి చిన్న వయస్కురాలిగా నిలిచింది.
షార్ట్ ఫిలిమ్స్ లోనే కాదు సినిమాలలో కూడా..
షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే కాదు సినిమాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. 2018లో నిఖిల్ హీరోగా నటించిన ‘కిర్రాక్ పార్టీ’ అనే చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కనిపించింది. పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్ , రామ్ చరణ్ లకు వీరాభిమాని అయిన ఈమె.. ఒకవైపు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూనే ఇప్పుడు ఏకంగా బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టింది. మరి తాజాగా చెన్నైలో ప్రారంభించిన ఈ క్లినిక్ కి మంచి ఆదరణ లభించి, ఆమె ఈ రంగంలో సక్సెస్ కావాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.
?igsh=ZjFkYzMzMDQzZg==
also read: Ghattamaneni: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న ఘట్టమనేని వారసురాలు..అత్త కల నెరవేరుస్తుందా?