Terrorist Noor Mohammed: సత్యసాయి జిల్లా ధర్మవరం ఉగ్రలింకుల కేసులో.. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించింది. నూర్ మహమ్మద్‌కు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో భారీ భద్రత మధ్య నూర్ మహమ్మద్‌ను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలతో చాటింగ్ చేస్తూ పట్టుబడ్డాడు నూర్ మహ్మద్. ఎన్‌ఐఏ, కౌంటర్ ఇంటెలిజెన్స్ నుంచి కీలక సమాచారం అందడంతో.. అప్రమత్తమైన ధర్మవరం పోలీసులు గత కొన్ని రోజులుగా నిఘాపెట్టారు.
సుమారు 37 వాట్స్అప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్న నూర్ మొహమ్మద్
ఉగ్రవాది నూర్ మొహమ్మద్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సుమారు 37 వాట్సాప్ గ్రూపుల్లో నూర్ మొహమ్మద్ సభ్యుడిగా ఉన్నారు. ఈ గ్రూపుల్లో కీలకమైన ఆల్ కాయిదా, లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిద్దీన్, జైషే మహమ్మద్ వీడియోలు గుర్తించారు.
శనివారం తెల్లవారుజామున నూర్ ఇంట్లో సోదాలు..
నూర్ ఇంటి పరిసరాల్లో శుక్రవారం రాత్రి నుంచి రెక్కీ నిర్వహించి.. శనివారం తెల్లవారుజామున నూర్ ఇంట్లో సోదాలు జరిపారు. స్థానికంగా ఉన్న ఓ బిర్యానీ సెంటర్‌లో పనిచేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేయడంతో ధర్మవరం ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
భార్యను వదిలేసి.. ఓ మహిళతో వివహేతర సంబంధం..
నూర్.. సుమారు 30 ఉగ్రవాద సంస్థల్లో సభ్యుడిగా ఉన్నట్టు గుర్తించారు. నిందితుడి ఇంట్లో కొన్ని సిమ్ కార్డులు, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. నూర్ కుటుంబంలో తగాదాల కారణంగా భార్యను వదిలి వేరుగా ఉంటున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే తాడిపత్రిలో ఓ మహిళతో ఇతనికి వివాహేతర సంబంధం ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు.. ఆమె గురించి విచారించారు. పాకిస్థాన్ తీవ్రవాద సంస్థలతో ఆ మహిళకు కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో ప్రశ్నించారు. మార్కెట్ సమీపంలోని సల్మా బిర్యానీ హోటల్ చుట్టపక్కల కూడా నిందితుడికి సంబంధించిన కొంత సమాచారాన్ని పోలీసులు సేకరించారు.
ఉగ్రవాది నూర్ మొహమ్మద్ కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు..
మరోవైపు ఇదే కేసులో యువకుడు రియాజ్‌ని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కీలక అంశాలను రాబట్టే పనిలో ఉన్నారు. అటు తమ కుమారుడు మంచి వాడని చెబుతున్నారు నూర్ మొహమ్మద్ తల్లితండ్రులు. పోలీసులు ఎందుకు తీసుకెళ్లారో తెలియదని అంటున్నారు. తమ ఇంట్లో నిర్వహించిన సోదాల్లో పోలీసులకు ఏమీ దొరకలేదని వివరించారు.
Also Read: నయా స్కెచ్‌తో కొడాలి నాని రీ ఎంట్రీ
మరింత దర్యాప్తు కోసం నూర్ మహమ్మద్ ను జ్యుడీషియల్ కస్టడీకి కోరే అవకాశం..
పాకిస్తాన్ జెండాతోపాటు దాయాది దేశానికి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీడియోను వాట్సప్ స్టేటస్ పెట్టు కున్నాడు యువకుడు రియాజ్. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పాక్ జిందాబాద్ అంటూ వాట్సప్ స్టేటస్ పెట్టుకోవడంతోపాటు సయ్యద్ బిలాల్ వీడియోను అప్‌లోడ్ చేశాడు ఎర్రగుంట ప్రాంతానికి చెందిన రియాజ్. ఇలా ఒకే రోజు రెండు వేర్వేరు కేసులు వెలుగులోకి రావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ధర్మవరంపై పడింది.
నూర్ మహమ్మద్ పై ఉపా యాక్ట్ తో పాటు దేశద్రోహం కేసు నమోదు..
నూర్ ను కదిరి కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
పలు ఉగ్రవాద సంస్థల్లో నూర్ కీలక సభ్యుడిగా ఉన్నట్లు అనుమానం https://t.co/sxTaWLJYG0
— BIG TV Breaking News (@bigtvtelugu) August 16, 2025