Kissik talks show : ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ బిగ్ టీవీ ప్రేక్షకులను అలరించేందుకు నిత్యం కొత్త షోలను పరిచయం చేస్తుంది. ఇప్పటికే ఎన్నో రకాల కొత్త ప్రోగ్రాం లను ప్రేక్షకులకు అందిస్తుంది. ప్రతి ప్రోగ్రాం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ మధ్య వచ్చిన ఓ షో కిస్సిక్ టాక్స్ ( Kissiks Talks Show) కు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. జబర్దస్త్ ద్వారా ఫేమ్ వర్ష ఈ షోకు యాంకర్ గా వ్యవహారిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ప్రసారం కాబోతోంది. ప్రతివారం పెద్ద ఎత్తున బుల్లితెర నటీనటులు సినీ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి బుల్లి తెర యాంకర్ సౌమ్య రావు గెస్టుగా వచ్చారు. తన కెరీర్ లో ఎదుర్కొన్న పరిస్థితులు, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అన్న విషయాల గురించి ఓపెన్ గా అన్ని విషయాలను బయటపెట్టింది.. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో తెలుసుకుందాం..
తండ్రి వల్లే నరకాన్ని అనుభవించాను..
బుల్లితెర యాంకర్ సౌమ్య రావు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు జబర్దస్త్ షోకు యాంకర్ గా వ్యవహరించారు. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. తను యాంకరింగ్ చేసింది కొద్ది రోజులైనా కూడా యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఈమధ్య బుల్లితెరపై యాంకర్ గా షోలు చేయలేదు కానీ పలు స్పెషల్ ఈవెంట్లలో సౌమ్య సందడి చేస్తుంది.. తాజాగా ఈమె బిగ్ టీవీ లోని ప్రత్యేక కార్యక్రమం కిస్సిక్ టాక్స్ షో కు ఇంటర్వ్యూ ఇచ్చింది.. ఈ ఈవెంట్లో తన తండ్రి చేసిన మోసాన్ని బయట పెట్టింది. ఆయన చేయడం వల్లే మేము ఎన్నో బాధలు అనుభవించామని కన్నీళ్లు పెట్టుకుంది యాంకర్ సౌమ్య.. చిన్నప్పటి నుంచి ఆమె అనుభవించిన బాధలను అనుభవించిన బయటపెట్టింది.
Also Read: రజినీ ఖాతాలో హిట్.. డే 1 వసూళ్ల ప్రిడిక్షన్..కలెక్షన్ల సునామీనే..
హీరో టార్చర్ వల్లే ఇండస్ట్రీకి దూరం..?
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న సౌమ్యను వర్ష ఒక ప్రశ్న అడిగింది. నువ్వు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు మీ దగ్గరకొచ్చి ఒక హీరో నెంబర్ తీసుకున్నారంట నిజమేనా అని అడగ్గా.. దాని గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతావు అది నేను మర్చిపోలేని చేదు అనుభవం అని సౌమ్య సమాధానం చెబుతుంది.. ఆ హీరో నెంబర్ తీసుకొని ఆ తర్వాత చేసిన టార్చర్ నేను జీవితంలో మర్చిపోలేను అని సౌమ్య బయటపెట్టింది. ఆయనను బ్లాక్ చేసిన విషయాన్ని కూడా సౌమ్య చెప్పింది. కానీ ఆ హీరో ఎవరన్న పేరుని బయట పెట్టలేదు. మొత్తానికి ఈ ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఎపిసోడ్లు మరిన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టినట్లు తెలుస్తుంది. సౌమ్య ఏం చెప్పిందో? ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి ఎలా వివరించిందో? తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..