Free Pickle Offer:పికిల్స్ బిజినెస్ చేస్తూ యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ లో ఫేమస్ అయిన పచ్చళ్ళ పాప ఎవరు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles) అలేఖ్య మాత్రమే.. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా ఎంత ఫేమస్ అయిందో అంతే నెగిటివిటీని కూడా మూట గట్టుకుంది.. పచ్చళ్ళ రేట్ విపరీతంగా పెట్టడంతోపాటు కస్టమర్లతో రూడ్ గా బిహేవ్ చేయడం వల్ల పచ్చళ్ల పాప పచ్చళ్ళ బిజినెస్ మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా అలేఖ్య చిట్టి పికిల్స్ కి ఓ వ్యక్తి పచ్చళ్ళ రేటు మరీ ఇంతలా పెడతారా అని ఒక కామెంట్ పెడితే..దాని కింద ఆమె చాలా దారుణమైన రిప్లై ఇవ్వడంతో ఆమె మాట్లాడిన ఆడియో కాస్త నెట్టింట వైరల్ అయ్యి సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేసారు.
నోటి దూలతో బిజినెస్ క్లోజ్ చేసుకున్న అలేఖ్య..
అయితే తాను చేసింది తప్పే.. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడను అని చెప్పినా కూడా ఎవరు వినలేదు.ఆమెను సోషల్ మీడియాలో ఏకీపారేశారు. అయితే సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ ని ఎదుర్కోలేని అలేఖ్య(Alekhya) చివరికి హాస్పిటల్ పాలయ్యింది. అంతేకాదు పచ్చళ్ళ బిజినెస్ కూడా క్లోజ్ చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులు సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉండి మళ్లీ బిజినెస్ ని స్టార్ట్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ పచ్చళ్ళ పాప ఒక ఛాలెంజ్ ని విసిరింది. తాను ఇచ్చిన ఛాలెంజ్ ని ఎవరైతే ఫినిష్ చేస్తారో వారికి ఒక పచ్చడి ప్యాకెట్ ఫ్రీ అంటూ ఒక బంపర్ ఆఫర్ కూడా పెట్టింది.
ఫాలోవర్స్ కి ఛాలెంజ్ విసిరిన అలేఖ్య..
మరి ఇంతకీ పచ్చళ్ళ పాప అలేఖ్య పెట్టిన ఆ ఛాలెంజ్ ఏంటి అనేది చూస్తే.. జోలో చిప్స్ ఛాలెంజ్.. జోలో చిప్స్.. ఈ పేరు వింటేనే చాలామందికి భయం పుడుతుంది. ఎందుకంటే ఈ జోలో చిప్స్ నోట్లో వేసుకుంటే చాలు చెవులలో నుండి పొగలు అలా వచ్చేస్తాయని, నోరంతా మండి పోతుందని,దీన్ని తిన్న చాలా మంది రివ్యూలు ఇస్తూ ఉంటారు.చాలా కారం కారంగా తింటే ఘాటు నషాలానికి ఎక్కేలా ఉండే ఈ జోలో చిప్స్ ని ఇప్పటివరకు చాలామంది టేస్ట్ చేసి వాళ్ళ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ ఇద్దరు కూడా ఈ జోలో చిప్స్ ఛాలెంజ్ ని విసిరారు. మొదట ఇద్దరు అక్కా చెల్లెళ్లు జోలో చిప్స్ ని తిన్నారు.కానీ అవి తినడంతోనే మంట తట్టుకోలేక పోయారు. దాంతో నోట్లో మంట చల్లారడం కోసం పాల డబ్బా మొత్తం ఖాళీ చేశారు. చాక్లెట్లు తిన్నారు. ఎన్ని తిన్నా ఏం చేసినా కూడా జోలో చిప్స్ తిన్న కారం మాత్రం పోవడం లేదు.
అలేఖ్య ఛాలెంజ్ స్వీకరించే ధైర్యం ఉందా?
ఈ నేపథ్యంలోనే అలేఖ్య చిట్టి సిస్టర్స్ జోలో చిప్స్ ఎవరైతే తిని ఛాలెంజ్ ని పూర్తి చేస్తారో వారికి చిట్టి పికిల్స్ ప్యాకెట్ ఫ్రీగా ఇస్తాను అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఈ ఛాలెంజ్ ని అలేఖ్య సిస్టర్ సుమీ స్వీకరించి తన భర్త జై తో కలిసి చేసినప్పటికీ ఈ జోలో చిప్స్ కారం భరించలేక అల్లాడిపోయింది. అలాగే సుమీ భర్త జై కూడా జోలో చిప్స్ తిని తన అనుభవాన్ని చెప్పారు. మరి జోలో చిప్స్ ఛాలెంజ్ ని ఎవరైనా స్వీకరించి ఫినిష్ చేస్తారా..? అలేఖ్య చిట్టి ఇచ్చే పికిల్స్ ప్యాకెట్ ని ఫ్రీ గా అందుకుంటారా? అనేది చూడాలి..
also read: Coolie film: కాసేపట్లో కూలీ మార్నింగ్ షో.. ఇంతలోనే థియేటర్‌ను ముంచేసిన వరద!