Nani 32 – Hit 3:నేచురల్ స్టార్ నాని ఇటీవలే సరిపోదా శనివారం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఒక్క శనివారం మాత్రమే బాదుడు కార్యక్రమం మొదలు పెట్టే ప్రాత్రలో నటించి అదరగొట్టేశాడు. ఇందులో అతడి మాస్ ఎలివేషన్స్ సినీ ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో నానికి జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఆమె పోలీస్ పాత్రలో నటించి అదరగొట్టేసింది.
కాగా ఇందులో నాని యాక్టింగ్ కూడా ఓ రేంజ్‌లో ఉండటంతో సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నానిని ఢీకొట్టే పాత్రలో ఎస్ జే సూర్య నటించి సినిమాకి మరింత బూస్ట్ అందించాడు. ఇలా నాని, ఎస్‌జే సూర్యల యాక్టింగ్‌తో సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ క్రమంలో నాని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అతడు నటిస్తున్న కొత్త సినిమా ‘హిట్ 3’. ఈ మూవీ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అద్భుతమైన రెస్పాన్స్ అందుకోవడంతో మూడో పార్ట్‌పై అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి.
Less of a cop
More of a criminal
Arjun Sarkaar takes charge #Nani32 is #HITTheThirdCase
Blood gates will open May 1st 2025 🔥🪓#Hit3 Hunter’s Command https://t.co/mrlICAmlPq pic.twitter.com/d4Uj3TfkHU
— Nani (@NameisNani) September 5, 2024
అయితే ఫస్ట్ పార్ట్‌లో విశ్వక్ సేన్ నటించగా గూస్ బంప్స్ వచ్చే రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్లు కూడా దుమ్ముదులిపేశాయి. దాంతో ఏ మాత్రం ఆలోచించకుండా దర్శకుడు శైలేష్ కొలను వెంటనే సెకండ్ పార్ట్‌ను తెరకెక్కించాడు. ఈ సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ నటించి మంచి హిట్ అందుకున్నాడు. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సెకండ్ పార్ట్‌లో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించి తన అందంతో అందరినీ అలరించింది. అయితే ఈ సెకండ్ పార్ట్ ఎండింగ్‌లో నానిని చూపిస్తూ మూడో పార్ట్ వస్తుందని మేకర్స్ తెలిపారు.
ఇక ఇప్పుడు మూడో పార్ట్‌కి సంబంధించిన అదిరిపోయే అప్డేట్‌ను మేకర్స్ అందించారు. ఈ మూడో పార్ట్‌లో నాని నటిస్తున్నాడు అని మేకర్స్ అఫీషియల్‌గా తెలియజేశారు. ఇందులో అతడు అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూడ్డానికి అత్యద్భుతంగా ఉంది. ఒక కారు డ్రైవ్ చేస్తున్న క్రమంలో స్ట్రీరింగ్ తిప్పుతూ చేతిలో రక్తంతో తడిసిన గొడ్డలి, కళ్లకు పెట్టుకున్న సన్‌గ్లాసెస్, నోటిలో సిగర్‌తో కనిపించిన స్టిల్ అబ్బో అదరగొటేస్తుంది. అంతేకాకుండా ఈ పోస్టర్‌తో పాటు ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేయగా సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్లింప్స్‌తో హిట్ 3 రేంజ్ మారిపోయిందనే చెప్పాలి. చూడాలి మరి దర్శకుడు శైలేష్ కొలను ఈ ఫ్రాంచైజీ చిత్రాన్ని ఏం చేస్తాడో