Pro Kabaddi League 2025: అందరూ ఎంతో ఆతృతంగా ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ 2025 టోర్నమెంట్ ( Pro Kabaddi League 2025) ఇవాళ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ అట్టహాసంగా వైజాగ్ వేదికగా ప్రారంభమైన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 లో తెలుగు అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ.. తగలడం జరిగింది. ప్రో కబడ్డీ 2025 టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ లోనే తెలుగు టైటాన్స్ ( Telugu Titans) దారుణంగా ఓడిపోయింది. గత సీజన్ లో కూడా అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన తెలుగు టైటాన్స్… ఈ సీజన్లో కూడా పేలవ ప్రదర్శనతో… అందరికీ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తమిళ్ తలైవాస్ ( Tamil Thalaivas ) చేతిలో తెలుగు టైటాన్స్ ( Telugu Titans) టీం ఓడిపోయింది.
విశాఖ వేదికగా గ్రాండ్గా ప్రారంభమైన ప్రో కబడ్డీ 2025
విశాఖపట్నం వేదికగా ప్రో కబడ్డీ 2025 టోర్నమెంట్ ఇవాళ సాయంత్రం ప్రారంభమైంది. ఇప్పటివరకు 11 సీజన్లు సక్సెస్ఫుల్గా పూర్తికాగా.. ఇవాల్టి నుంచి 12వ సీజన్ ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం అయింది. విశాఖ వేదికగా ఈ ఏర్పాట్లను చాలా గ్రాండ్గా నిర్వహించింది యాజమాన్యం. ఇందులో భాగంగానే ఇవాళ రెండు మ్యాచ్లు నిర్వహించారు. మొదటి మ్యాచ్ లో తమిళ్ తలైవాస్ వర్సెస్ తెలుగు టైటాన్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. రెండవ మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ వర్సెస్ పుణేరి పల్టాన్స్ మధ్య భయంకరమైన ఫైట్ జరిగింది. అయితే తొలి రోజే తెలుగు టైటాన్స్ ఓడిపోగా… అటు రెండు మ్యాచ్లో బెంగళూరు దారుణ పరాజయాన్ని చవిచూసింది.
పోరాడి ఓడిన తెలుగు టైటాన్స్ ( Telugu Titans)
ప్రో కబడ్డీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… తొలి మ్యాచ్ లోనే తెలుగు టైటాన్స్ ( Telugu Titans) ఓటమిపాలైంది. తొలి మ్యాచ్లో తమిళ్ తలైవాస్ వర్సెస్ తెలుగు టైటాన్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో తమిళ్ తలైవాస్ 38 పాయింట్లు సాధించగా తెలుగు టైటాన్స్ కేవలం 35 పాయింట్లు మాత్రమే స్కోర్ చేయగలిగింది.. దీంతో మూడు పాయింట్ల తేడాతో ఓటమిపాలైంది తెలుగు టైటాన్స్. వాస్తవానికి ఫస్ట్ హాఫ్ లో రెండు జట్లు చాలా బ్రహ్మాండంగా స్కోర్ చేశాయి. రెండవ ఆఫ్ వచ్చేసరికి తెలుగు టైటాన్స్.. లీడ్ లోకి వెళ్లడం జరిగింది. కానీ తెలుగు టైటాన్స్ ప్లేయర్ల పొరపాటు కారణంగా… మళ్లీ తమిళ్ తలైవాసు రెచ్చిపోయారు. దీంతో తెలుగు టైటాన్స్ ఓడిపోవలసి వచ్చింది. తమిళనాడు జట్టులో అర్జున్ 12. సాధించగా పవన్ 9 పాయింట్లు సాధించి దుమ్ము లేపారు. అటు తెలుగు టైటాన్స్ రైడర్ భరత్ 11 పాయింట్లు సాధించాడు. ఇక అటు బెంగుళూరు బుల్స్ పైన 6-4 తేడాతో పుణేరి పల్టాన్ విజయం సాధించింది.
Also Read : CSK Vs RCB : అరేయ్ ఏంట్రా ఇది… గణపతి విగ్రహాలతో CSK vs RCB మ్యాచ్… వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే
⚡ Day 1 & We have another Thriller 🤯🔥
📖 First Tie Breaker of PKL history 🏆
💪 Puneri Paltan with solid defense 🛡️ in 5–5 raids clinches Victory 🟠⚪.
.
.#PuneriPaltan #Thriller #ProKabaddi #PKL #PKL12 #PKL2025 #Kabaddi360 pic.twitter.com/m5QiNAtZjU— Kabaddi360 (@Kabaddi_360) August 29, 2025