BigTV English

AA 22×A6: అల్లు అర్జున్ అట్లీ సినిమా వచ్చేది అప్పుడేనా… ఎదురుచూపులు తప్పవా?

AA 22×A6: అల్లు అర్జున్ అట్లీ సినిమా వచ్చేది అప్పుడేనా… ఎదురుచూపులు తప్పవా?

AA 22×A6:  టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప సినిమా(Pushpa Movie)తో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచిందని చెప్పాలి.. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో మారుమోగుతుంది. ఇక ఇటీవల విడుదలైన పుష్ప 2 సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా గ్లోబల్ స్థాయిలో కూడా విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.


గ్లోబల్ స్థాయిలో విడుదలకు సిద్ధం?

ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee)దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా AA 22 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో ఒక పాటకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఈ పాటలో అల్లు అర్జున్ అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


2027 మార్చిలోనే?

ఈ సినిమా విడుదల గురించి అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాను థియేటర్లో చూడాలి అంటే ఎదురుచూపులు తప్పవని చెప్పాలి. ఈ సినిమాని 2027 మార్చి 25వ తేదీ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.అయితే ఇప్పటివరకు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలబడలేదు. ఈ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాలు పాటు ఎదురుచూడాల్సిందేనని  తెలుస్తుంది. ఇలా ఈ సినిమా ఇంత ఆలస్యంగా రాబోతుందనే విషయం తెలిసిన అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

పుష్పను ఢీకొట్టబోతున్న శ్రీవల్లి..

ఇక ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో షూటింగ్ పనులతో పాటు విఎఫ్ఎక్స్ వర్క్ ఇతరతా పనులకు సమయం పడుతున్న నేపథ్యంలోనే ఈ సినిమాని 2027లో విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. ఇక ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా సన్ పిక్చర్స్ వారు నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం నటించబోతున్నారు. హీరోయిన్ గా దీపికా పదుకొనేతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక వంటి తదితరులు నటిస్తున్నారు.. ఈ సినిమాలో రష్మిక విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వినిపించాయి.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి రొమాన్స్ చేసిన రష్మిక ఈసారి అల్లు అర్జున్ ను ఢీకొట్టబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఈ సినిమాపై చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Also Read: 3BHK Movie: సచిన్ ఎఫెక్ట్.. హిందీ వెర్షన్ లో ఓటీటీ విడుదలకు సిద్ధమైన 3bhk!

Related News

NTR: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేది అప్పుడే, అత్త సుహాసిని క్లారిటీ

Telugu star hero: ప్రొడ్యూసర్ వలనే సినిమా చేయను అని చెప్పిన స్టార్ హీరో, కానీ దర్శకుడు అంటే వీరాభిమానం

Deepika Das: గౌరవం ఇవ్వటం నేర్చుకోండి… హీరో యశ్ తల్లికి కౌంటర్ ఇచ్చిన దీపిక!

Actor Vishal: పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్… అప్పటివరకు ఆగాల్సిందేనా?

Mowgli Glimpse: జాగ్రత్తగా చూసుకోండి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై ఆ నటుడు సెన్సేషనల్ ట్వీట్

Big Stories

×