BigTV English

Jio IPO: తగ్గేదే లేదంటున్న జియో.. త్వరలో ఐపీఓ, మెటాతో కలసి AI ఎంట్రీ

Jio IPO: తగ్గేదే లేదంటున్న జియో.. త్వరలో ఐపీఓ, మెటాతో కలసి AI ఎంట్రీ

రిలయన్స్ జియో త్వరలో మరో సంచలనానికి తెరతీయబోతోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జియో ఐపీఓకి వస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఇన్నాళ్లూ జియో తన మాతృసంస్థలో రిలయన్స్ లో భాగంగా వ్యాపారం నిర్వహిస్తోంది. ఇకపై ప్రజల నుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకు స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ కు రెడీ అవుతోంది. 2026 లో జియో IPOకి వస్తుందని తేలిపోయింది.


48వ వార్షిక సమావేశం..
రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆ సంస్థ అధినేత ముకేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. తన మానస పుత్రిక జియో అభివృద్ధిని ఆయన మరోసారి వివరించారు. దేశవ్యాప్తంగా 50 కోట్లమందికి పైగా జియో వినియోగదారులు ఉన్నారని చెప్పారాయన. ఆ సంఖ్య మరింత పెంచుకుంటామని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడికి మొబైల్ సేవలు, బ్రాడ్‌ బ్యాండ్ కనెక్టివిటీ అందించడం, ప్రతి ఇంటినీ జియో స్మార్ట్ హోమ్ గా మార్చడం, జియోటీవీ సహా డిజిటల్ సేవలు అందించడం తమ లక్ష్యమని చెప్పారు. ఈ దూకుడుకి కొనసాగింపుగా త్వరలో జియోని స్టాక్ ఎక్స్చేంజ్ లలో లిస్టింగ్ కి తీసుకొస్తున్నామని చెప్పారు. జియోషేర్ల దూకుడు ఎలా ఉంటుందోనని ఇప్పట్నుంచే ఆసక్తిని పెంచారాయన.

జియో ఇంటెలిజెన్స్..
జియో కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా తన సత్తా చూపేందుకు సిద్ధమవుతోంది. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవానికి జియో నాంది పలుకుతుందని చెప్పారు ముకేష్ అంబానీ. AI ప్రతి చోటా, ప్రతి ఒక్కరికోసం అనే నినాదంతో జియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి వస్తోందన్నారు. భారత్ వెలుపల కూడా జియో సేవలు విస్తరింపజేయబోతున్నామని, అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో జెండా పాతుతామని చెప్పుకొచ్చారు.

మెటాతో కలసి..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో జియో, మెటా సంస్థతో కలిసి కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతోంది. మెటాతో కలసి AI జాయింట్ వెంచర్‌ను ఆవిష్కరించబోతున్నట్లు ప్రకటించారు ముకేష్ అంబానీ. రిలయన్స్ సంస్థ వ్యాపారైన ఇంధనం, రిటైల్, టెలికాం, మీడియా, మాన్యుఫ్యాక్చరింగ్ విభాగాల్లో ఓపెన్ ఏఐ మోడల్స్, ఏఐ టూల్స్ తో అనుసంధానం జరుపుతానన్నారు. ఏఐ కోసం రిలయన్స్ ఇంటెలిజెన్స్ పేరుతో ఓ కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు ముకేష్. దీన్ని అభివృద్ధి చేసేందుకు మెటాతోపాటు, గూగుల్ సేవలు కూడా వినియోగించుకుంటామన్నారు.

జియో పీసీ..
జియోపీసీ గురించి ఆకాష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. జియోపీసీ అనేది మన ఇంట్లో టీవీని లేదా ఇతర స్క్రీన్ ని పూర్తిగా AI-రెడీ కంప్యూటర్‌గా మార్చే ఫీచర్. దీనిపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయని, ఇది ఓ విప్లవాత్మక మార్పు అని అన్నారు ఆకాష్. ఇక జియో ఫ్రేమ్స్ కూడా ఓ ఉత్తేజకరమైన ఉత్పత్తి అని చెప్పారు. జియోఫ్రేమ్స్ అనేది భారతదేశం కోసం తయారు చేయబడిన AI-ఆధారిత వేరబుల్ ప్లాట్ ఫామ్ అని అన్నారు. భారత్ లోని అనేక భాషలకు ఇది మద్దతు ఇస్తుందన్నారు. మనం జియో యొక్క బహుభాషా AI వాయిస్ అసిస్టెంట్‌తో మాట్లాడవచ్చని చెప్పారు.

Related News

YouTube Tips: యూట్యూబ్ ద్వారా కళ్లు చెదిరే ఆదాయం.. సింపుల్ గా ఈ టిప్స్ పాటిస్తే చాలు!

BSNL BiTV: 450కి పైగా టీవీ ఛానెళ్లు, 25 ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. అన్నీ కలిపి రూ.151 మాత్రమే

Jio Airtel flood relief: వరద ప్రభావితులకు రిలీఫ్.. జియో, ఎయిర్‌టెల్ వినియోగదారులకు పెద్ద గుడ్ న్యూస్!

BSNL Pay: ఫోన్ పే, గూగుల్ పే కి కాలం చెల్లినట్టేనా? రంగంలోకి దిగిన బీఎస్ఎన్ఎల్ పే..

Realme 15T Smartphone: ఏముంది రా బాబు.. రియల్‌మీ 15T స్టైలిష్ డిజైన్ లీక్

Big Stories

×