BigTV English

Fish Venkat: నడవలేని స్థితిలో ఫిష్ వెంకట్, కాళ్లు తీసేస్తారట.. పాపం ఏమైంది?

Fish Venkat: నడవలేని స్థితిలో ఫిష్ వెంకట్, కాళ్లు తీసేస్తారట.. పాపం ఏమైంది?

Tollywood comedy actor Fish Venkat two kidneys failure..condition serious: విలన్ పక్కన ఉండే కామెడీ పాత్రలతో తనదైన స్టయిల్, మ్యాడ్యులేషన్ తో నవ్వు తెప్పించే పాత్రలు చేస్తారు ఫిష్ వెంకట్. హైదరాబాద్ లో పుట్టిపెరిగిన ఫిష్ వెంకట్ చదువుకుంది కేవలం మూడవ తరగతి. దివంగత నటుడు శ్రీహరి ఫిష్ వెంకట్ కు మంచి మిత్రుడు. శ్రీహరి ప్రోత్సాహంతో సినీ ఫీల్డ్ కి వచ్చిన ఫిష్ వెంకట్ కుటుంబం చేపలు అమ్ముకుని జీవనం సాగించేవారు. అందుకే అతని అసలు పేరు వెంకటేష్ అయినా సినిమా రంగంలో అతని పరిచయస్తులు ఫిష్ వెంకట్ గా పిలిచేవారు. అదే పేరుతో పాపులారిటీ సంపాదించుకున్నారు ఫిష్ వెంకట్.


తొడ గొట్టు చిన్నా..

దర్శకుడు వివి వినాయక్ ఆది మూవీలో ఫిష్ వెంకట్ కు అవకాశం ఇచ్చారు. ఆది మూవీలో ఎన్టీఆర్ ని తొడగొట్టు చిన్నా అంటూ ఎంకరేజ్ చేసే పాత్ర చేశాడు. ఆ తర్వాత అనేక చిత్రాలలో తన కామెడీ టైమింగ్ తో తన డైలాగ్ వేరియేషన్ తో ప్రేక్షకులను నవ్వించారు. బన్నీ మూవీలో గుడ్డి పాత్రలో మంచి కామెడీని పండించాడు ఫిష్ వెంకట్. ఆ మూవీలో రఘుబాబుతో కలిసి ప్రకాష్ రాజ్, అల్లు అర్జున్ వద్ద చేసిన యాక్టింగ్ కొంత కాలం ఫిష్ వెంకట్ పేరు గుర్తుంచుకునేలా చేసింది. ఇంకా డాన్ శీను, అదుర్స్, దరువు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు ఫిష్ వెంకట్.


రెండు కిడ్నీలు పాడయ్యాయి

ప్రస్తుతం ఫిష్ వెంకట్ పరిస్థితి దీనంగా ఉంది. ఓ యూ ట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ద్వారా తన రెండు కిడ్నీలు పాడయ్యాయని..ప్రతి రోజూ డయాలిసిస్ అవసరమని వైద్యులు సూచించడంతో..ఖర్చులకు డబ్బులు కూడా లేక ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకుంటున్నానని తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
దాదాపు సంవత్సర కాలంగా బయటకే రావడం లేదని..తనకు ఆయాసం బాగా వచ్చి వైద్యుని సంప్రదిస్తే వారం ట్రీట్ మెంట్ తర్వాత తెలిసిందని తన రెండు కిడ్నీలు పోయాయని..అప్పటినుంచి డయాలిసిస్ చేయించుకుంటున్నాని అన్నారు ఫిష్ వెంకట్. కాలుకు కూడా తగిలిన చిన్న దెబ్బ షుగర్ వ్యాధి కారణంగా మొత్తం ఇన్ ఫెక్షన్ కు గురయిందని అన్నారు. సినిమాలలో ఛాన్సులు వచ్చినా నటించలేకపో్తున్నానని అన్నారు. ప్రస్తుతం గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నానని..తనని ఎవరైనా ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరడంతో నెటిజన్లు చలించిపోతున్నారు.

బిచ్చగాడు నిర్మాత ఆర్థిక సాయం

అయితే ఫిష్ వెంకట్ పరిస్థితి తెలుసుకున్న కొందరు సినీ ప్రముఖులు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రముఖ బిచ్చగాడు మూవీ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఫిష్ వెంకట్ కు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. అలాగే టీఎఫ్ పీసీ సెక్రటరీ ప్రసన్న కుమార్, ప్రముఖ దర్శకుడు కె . అజయ్ కుమార్ తదితరులు ఫిష్ వెంకట్ ని పరామర్శించి ఆర్థిక సాయంగా చెక్కును అందజేశారు. అయితే ఈ సందర్భంగా ఫిష్ వెంకట్ తనకు సాయం అందించిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుకు ధన్యవాదాలు తెలిపారు. తాను ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటానని..ఆ దేవుడి ఆశీస్సులు నిర్మాతకు ఎప్పటికీ ఉండాలని భావోద్వేగానికి గురయ్యారు . దాదాపు అగ్ర హీరోలందరితోనూ నటించి ఫిష్ వెంకట్ ను పెద్ద మనసుతో హీరోలు ఆదుకోవాలని సోషల్ మీడియా వేదికగా నెటిజనులు స్సందిస్తున్నారు.

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×