E-Paper
Advertisement

NTR: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేది అప్పుడే, అత్త సుహాసిని క్లారిటీ

NTR: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేది అప్పుడే, అత్త సుహాసిని క్లారిటీ
Advertisement

NTR: ప్రతి పరిశ్రమలోను వారసత్వం అనేది ఉంటుంది. అలానే రాజకీయాల్లో కూడా వారసత్వం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. పార్టీ పెట్టిన కొన్ని నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. ఆ తరువాత ఆ పార్టీకి సంబంధించి ఎన్నో అవకతవకలు జరిగాయి.

ఇక ప్రస్తుతం అదే పార్టీకి ముఖ్యమంత్రిగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అయితే ఆ పార్టీ ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించింది అని, నారా ఫ్యామిలీది కాదు అని కొన్ని వివాదాలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీని నడిపించి ముందుకు తీసుకు వెళ్లవలసింది జూనియర్ ఎన్టీఆర్ అంటూ కొంతమంది అభిమానులు అంటుంటారు.

Advertisement

ఒకప్పుడు ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లో బిజీగా ఉండేవారు. 2009 సంబంధించి ప్రచారం కూడా చేశారు. కానీ ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయారు. ఇప్పుడు కూడా పెద్దగా రాజకీయ విషయాలకి స్పందించరు. ఈ తరుణంలో ఎన్టీఆర్ అత్త నందమూరి సుహాసిని తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు.

 

జూనియర్ ఎన్టీఆర్ వస్తారు

Advertisement

 

నేను 2018 నుంచి రాజకీయాల్లోనే యాక్టివ్ గానే ఉంటున్నాను. అని చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ గురించి స్పందించారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. తప్పకుండా అవకాశం కలిగినప్పుడు ఆయనే ఎంట్రీ ఇస్తారు అంటూ సుహాసిని ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం పైన క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఏ సభ జరిగిన కూడా ఎన్టీఆర్ అభిమానులు సీఎం అని అరుస్తుంటారు. ఇక రీసెంట్ గా అనంతపూర్ ఎమ్మెల్యే ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులంతా కూడా ర్యాలీలు కూడా చేశారు.

హరికృష్ణ గురించి సుహాసిని

తెలుగుదేశం పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడల్లా నేను ఉన్నాను అంటూ, కార్యకర్తలు అందరికీ భరోసా ఇస్తూ ముందుకెళ్లారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా గాని, మహిళలకు ఎప్పుడూ అండగా ఉండి, వాళ్లకు కండక్టర్లుగా కూడా అవకాశం కలిగించారు. అలానే రాజ్యసభలో కూడా తెలుగులోనే మాట్లాడి, తెలుగు వాళ్లకి గుర్తింపు ఉండాలి అని తెలుగులో అడిగారు. నందమూరి తారక రామారావు గారికి హరికృష్ణ గారు ఎప్పుడు తోడుగా ఉన్నారు. అలాంటి కొడుకు ఎవరూ ఉండరు. అలానే అలాంటి నాన్నగారు ఎవరికి ఉండరు. ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అందరికీ నమస్కారం జోహార్ నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna). నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఈ విషయాలు మాట్లాడారు సుహాసిని.

Also Read: Telugu star hero: ప్రొడ్యూసర్ వలనే సినిమా చేయను అని చెప్పిన స్టార్ హీరో, కానీ దర్శకుడు అంటే వీరాభిమానం

Related News

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

Big Stories

Advertisement
×