3BHK Movie: శ్రీ గణేష్ దర్శకత్వంలో సిద్దార్థ్ (Siddarth), మీతా రఘునాథ్ (Meetha Ragunath)జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 3bhk(3BHK Movie). ఈ సినిమా జూన్ 12వ తేదీ తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా థియేటర్లలో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు తమిళ భాషలలో అందుబాటులోకి వచ్చింది. కేవలం థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇటీవల మరోసారి ట్రెండింగ్ లో ఉంది. ఇలా ఈ సినిమాకు మరోసారి వార్తల్లో రావడానికి కారణం లేకపోలేదు. క్రికెట్ దేవుడు.. సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేయడమే అందుకు కారణమని చెప్పాలి.
ప్రశంసలు కురిపించిన సచిన్…
సచిన్ టెండుల్కర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని మీరు సినిమాలు చూస్తారా అంటూ ప్రశ్నించడంతో అవును చూస్తాను ఇప్పుడే 3bhk సినిమా చూశాను చాలా అద్భుతంగా ఉంది సినిమా చూస్తూ చాలా ఎంజాయ్ చేశానని సచిన్ టెండూల్కర్ ఈ సినిమా గురించి ప్రశంసలు కురిపించడంతో మరోసారి ఈ సినిమా ట్రేడింగ్ లోకి వచ్చింది.. ఇలా సచిన్ టెండూల్కర్ లాంటి ఒక గొప్ప వ్యక్తి తమ సినిమాకు ఇలాంటి ప్రశంసలు అందించడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యలతో అమెజాన్ ప్రైమ్(Amazon Prime) మరొక సంచలన నిర్ణయం తీసుకుంది.
హిందీలోకి 3BHK..
ఇప్పటివరకు ఈ సినిమా కేవలం తెలుగు తమిళ భాషలలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అయితే సచిన్ టెండూల్కర్ ఎప్పుడైతే ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడారో అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాని హిందీ వెర్షన్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇలా సచిన్ టెండూల్కర్ కారణంగానే ఈ సినిమాకు మరింత ఆదరణ లభించిందని చెప్పాలి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే… ఈ సినిమాలో సీనియర్ నటుడు శరత్ కుమార్(Sarath Kumar) దేవయాని (Devayani) హీరో తల్లిదండ్రుల పాత్రలలో నటించి సందడి చేశారు. ఇక ఈ సినిమా మొత్తం ఓ మధ్యతరగతి వ్యక్తి జీవిత కథను తెలియజేస్తుందని చెప్పాలి.
సొంత ఇంటి కల…
ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తికి సొంత ఇల్లు అనేది చాలా పెద్ద కోరిక. తమ జీవితంలో సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని ఎంతో తాపత్రయపడుతుంటారు. ఇక ఈ సినిమాలో కూడా సొంత ఇంటి కోసం సిద్ధార్థ కుటుంబ సభ్యులు ఎలా కష్టపడ్డారు? చివరికి తమ సొంత ఇంటికి కల నెరవేర్చుకున్నారా? అనే అంశాన్ని దర్శకుడు శ్రీ గణేష్ ఎంతో అద్భుతంగా చూపించారు. ఇక ఈ సినిమా ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి. ఈ సినిమా సాధారణ ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు అందుకోవడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Deepika Das: గౌరవం ఇవ్వటం నేర్చుకోండి… హీరో యశ్ తల్లికి కౌంటర్ ఇచ్చిన దీపిక!