BigTV English

Pushpa 2 update : పుష్ప 2 క్రేజీ అప్డేట్.. ఆ ఒక్క సీన్ కి పూనకాలే..

Pushpa 2 update : పుష్ప 2 క్రేజీ అప్డేట్.. ఆ ఒక్క సీన్ కి పూనకాలే..
Pushpa 2 update

Pushpa 2 update : ప్రస్తుతం టాలీవుడ్ లో తీసుకున్న సినిమాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. వీటిలో ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ది రైజ్ మూవీ కూడా ఒకటి. టాలీవుడ్ క్రేజ్ అమౌంట్ పెంచడమే కాకుండా యావత్ ప్రపంచాన్ని పాటలతో కుదిపేసింది ఈ సినిమా. ఈ మూవీలో మాస్ ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉంది అంటే.. మళ్ళీ కాక బయట దేశాల సెలబ్రిటిస్ కూడా ఈ సినిమా పాటలకు స్టెప్పులు వేసి వీడియోలను వైరల్ చేశారు.


ఇక ఆ విషయం పక్కన పెడితే మొదటి సినిమా సంచలనం సృష్టించడంతో రాబోయే రెండవ పార్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ జరుగుతుంది. మూవీకి సంబంధించి ఇప్పటికే పలు కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ చేయడం జరిగింది. వేర్ ఇస్ పుష్ప అంటూ వచ్చిన అల్లు అర్జున్ వీడియో, వెరైటీ గెట్ అప్ తో అల్లు అర్జున్ ఫస్ట్ పిక్ మూవీ పై అంచనాలను బాగా పెంచాయి.

త్వరలోనే చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకొని విడుదల కూడా చేయబోతున్నారు. అంచనాలు భారీగా ఉండడంతో ప్రతి విషయంపై ఎంతో జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు టాక్. సాధారణ రోజు కూలీగా పని చేసే ఒక కుర్రవాడు.. కేవలం తన తెలివితేటలు ,తెగింపు పెట్టుబడిగా పెట్టి.. ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాలో అగ్రస్థానానికి ఎలా ఎదుగుతాడు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన మూవీ పుష్ప ద రైజ్. అయితే దానికి కొనసాగింపుగా మాఫియాకు లీడర్ గా ఎలా మారుతారు అన్న పాయింట్ తో.. హై రేంజ్ యాక్షన్స్ సన్నివేశాలతో వస్తున్న చిత్రం పుష్ప ద రూల్.


 లేటెస్ట్ గాసిప్ ప్రకారం ఈ మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో మైండ్ బ్లాక్ చేస్తుందట. ఇంటర్వెల్ కి ముందు వచ్చే యాక్షన్ సీన్ హాలీవుడ్ రేంజ్ ని తలపించే విధంగా డిజైన్ చేసినట్లు టాక్. ఇక ఈ ఫైట్ సీన్ ముందు వచ్చే ఒక ట్విస్ట్ కథని మొత్తం మలుపు తిప్పే విధంగా ఉంటుందట. దీంతో రాబోయే చిత్రంపై అంచనాలు మరింత భారీగా పెరిగాయి. ఇక ఆ ఇంటర్వెల్ సిన్ ఏ రేంజ్ లో ఉంటుందో మూవీ విడుదల అయితే కానీ తెలియదు.

Related News

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Big Stories

×