BigTV English

Nithiin: పాపం నితిన్… హిట్ కోసం మళ్ళీ ఆ దర్శకుడును నమ్ముకుంటున్నాడు

Nithiin: పాపం నితిన్… హిట్ కోసం మళ్ళీ ఆ దర్శకుడును నమ్ముకుంటున్నాడు

Nithiin: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో నితిన్ ఒకడు. జయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. మొదటి సినిమా జయం తర్వాత వచ్చిన దిల్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. నితిన్ జయం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కూడా నితిన్ కెరీర్ లో అపజయాలే ఎక్కువ ఉన్నాయి. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలిపోతున్నాయి.


ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నితిన్ చేసిన సినిమా సై. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఆ సినిమా తర్వాత కొన్ని ఏళ్లపాటు నితిన్ హిట్ సినిమా చూడలేకపోయాడు. ఆ తరువాత విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అప్పుడే నితిన్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద అభిమాని అని అందరికీ తెలిసింది.

మరోసారి అదే దర్శకుడు తో 


ప్రస్తుతం నితిన్ హిట్ సినిమా చూసి చాలా ఏళ్లు అయిపోయింది. ఎన్నో అంచనాల మధ్య వస్తున్న సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోతున్నాయి. ఈ తరుణంలో మరోసారి విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నితిన్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పుడు వరుస డిజాస్టర్లు వచ్చినప్పుడు ఇష్క్ సినిమాతో మంచి హిట్ ఇచ్చి సక్సెస్ ట్రాక్ లో నిలబెట్టాడు. ఇప్పుడు మరోసారి విక్రం కే కుమార్ హిట్ ఇస్తాడా అనేది అందరిలో ఉన్న క్యూరియాసిటీ. మరోవైపు విక్రమ్ కే కుమార్ అద్భుతమైన సినిమా తీస్తే అది కేవలం నితిన్ కు మాత్రమే కాకుండా విక్రమ్ కే కుమార్ కూడా ప్లస్ అవుతుంది. వెంకీ కుడుముల రాబిన్ హుడ్ సినిమా మంచి కం బ్యాక్ అవుతుంది అని అందరూ ఊహించారు ఆ సినిమా కూడా తేడా కొట్టింది.

ఎల్లమ్మ ఇప్పట్లో లేదా 

దిల్ రాజు ప్రొడక్షన్స్ లోనే నితిన్ చివరి సినిమా తమ్ముడు విడుదలైంది. ఆ సినిమా ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే సినిమాను నితిన్ చేస్తున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఆ సినిమా డిలే అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. వేణు కి మిగతా రెండు ప్రొడక్షన్ హౌసెస్ నుంచి కొంత అడ్వాన్స్ లు రావడంతో ప్రస్తుతానికి ఎల్లమ్మ ప్రాజెక్టును పక్కన పెట్టినట్లు సమాచారం వినిపిస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన రాలేదు.

Also Read: జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Related News

Mass Jathara : మాస్ జాతర టీం కు లీగల్ నోటీసులు, నిర్మాత వంశీకి దెబ్బ మీద దెబ్బ

Sreeleela: శ్రీలీలా హీరోయిన్ అవ్వడం వెనక ఎన్టీఆర్, బిగ్గెస్ట్ ట్విస్ట్ రివీల్ చేసిన శ్రీలీలా మదర్

Nara Rohit: పొలిటికల్ ఎంట్రీపై హీరో క్లారిటీ.. ఆ అపోహలకు చెక్!

Priyanka Chopra: బాలీవుడ్ పై గ్లోబల్ బ్యూటీ అసహనం.. ఆ మార్పు రావాలంటూ?

Kantara Chapter 1: తెలుగు స్టేట్స్ లో భారీ డీల్.. ప్రీక్వెల్ కి అంత అవసరమా?

Big Stories

×