The Bigg Folk Night 2025 : చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇప్పటివరకు ఎన్నో లైవ్ కన్సర్ట్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మ్యూజిక్ దర్శకులను మొదలుకొని సింగర్స్ వరకు చాలామంది లైవ్ కన్సర్ట్స్ నిర్వహిస్తూ తమ టాలెంటును నిరూపించుకుంటున్నారు. ఒకవైపు లైవ్ లో పాటలు పాడుతుంటే.. మరోవైపు మ్యూజిక్ తో శ్రోతలు మైమరిచిపోయారు. అయితే పాటలంటే సినిమా పాటలే కాదు సాంస్కృతి కళలకు జీవం పోసేలా.. సమాజంలో జరిగే సహజత్వాన్ని పాటల రూపంలో సమకూరుస్తూ.. తమ అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను అలరిస్తున్న ఎంతోమంది జానపద గాయకులు మన మధ్యనే ఉన్నారన్న విషయం తెలిసిందే. అయితే ఎంతోమంది జానపద పాటలకు పెట్టింది పేరు.. అక్కడక్కడ మాత్రమే వీరి గాత్రం వినిపిస్తున్నా.. వీరికి మాత్రం సరైన గుర్తింపు లభించడం లేదు అనే వాదన ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇలాంటి ప్రతిభ ఉన్న ఎంతోమంది జానపద గాయని గాయకులు అందర్నీ ఒకే చోట చేర్చి.. జానపద కళలకు ప్రాణం పోస్తూ.. ఇప్పుడు చరిత్ర సృష్టించడానికి సిద్ధం అయ్యింది ప్రముఖ ఛానల్ బిగ్ టీవీ .
ఇప్పటివరకు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జానపద పాటలకు గుర్తింపు కలిగేలా.. గాయకులు ఒకరి తరువాత ఒకరు ఏకంగా 60 మంది తమ గొంతును వినిపించడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా జానపద గాయని గాయకులు తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి ది బిగ్ ఫోక్ నైట్ 2025 పేరిట అతిపెద్ద వేదికను ఏర్పాటు చేశారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో 2025 ఆగస్టు 23న అంటే ఈరోజు సాయంత్రం 6:00 కు ది బిగ్గెస్ట్ ఫోక్ నైట్ చాలా ఘనంగా నిర్వహించనున్నారు. 60 మంది తెలంగాణ ఫోక్ సింగర్స్ ఒకే స్టేజి పైన తొలిసారి ప్రదర్శించబోతున్న ఈ కార్యక్రమంలో ఒకరి తరువాత ఒకరు మాస్ సాంగ్ తో స్టేజ్ దద్దరిల్లేలా చేస్తున్నారు. వేలాదిమంది ఆడియన్స్ మధ్య ఈ కార్యక్రమం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు..
ది బిగ్ ఫోక్ నైట్ – 2025 మిషన్..
ఈ కార్యక్రమం మిషన్ ఏంటంటే.. తెలంగాణ జానపద సంగీత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి.. జానపద కళాకారులను ఒకే వేదికపై తీసుకువచ్చే ఒక చారిత్రాత్మక సమ్మేళనం.. జానపద పాటల ప్రామాణికత, వైవిధ్యం, సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రదర్శించి.. నేటితరం భవిష్యత్తు తరానికి కూడా అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
ది బిగ్ ఫోక్ నైట్ – 2025 విజన్..
తెలంగాణ జానపద సంగీతం , సంస్కృతులు, తరాలకు, సమాజాలకు వారధిగా ఉండే సార్వత్రిక భాషగా జరుపుకునే ప్రపంచాన్ని ఊహిస్తూ.. కళాకారులను శక్తివంతం చేస్తూ.. సాంప్రదాయాలను పునరుజ్జీవింపజేసి.. ప్రపంచ ప్రేక్షకులను ఆకర్షించేలా డైనమిక్ వేదికను సృష్టించడమే ప్రధాన లక్ష్యం.. ముఖ్యంగా జానపద పాటలను కొత్త ఎత్తులకు తీసుకెళ్లడమే లక్ష్యంగా..మూలాల ప్రామాణికతను కాపాడుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ది బిగ్ ఫోక్ నైట్ – 2025 వేదికపై ఆలపించే సింగర్స్ వీరే..
విమలక్క, సుద్దాల అశోక్ తేజ, వందేమాతరం శ్రీనివాస్, మొగులయ్య, మధుప్రియ, వరంగల్ శ్రీనివాస్, మెట్ల తిరుపతి, బోళే షావళి, క్లెమెంట్, పెద్దపులి ఈశ్వర్, నార్సింగి నర్సింగ్ రావు, నల్గొండ గద్దర్, బుల్లెట్ బండి లక్ష్మణ్, రెలారే గంగ, కనకవ్వ, భిక్షమమ్మ, ఉషక్క, కళ్యాణ్ కీస్, మదీన్ ఎస్కే, రెలారే రషీద్, పాటమ్మ రాంబాబు, గడ్డము సంతోష్, వరమ్, రెలారే జాన్, రాము రాతోడ్, హనుమంతు యాదవ్, కొండ రాజేందర్, ప్రభ, వీణ, షోను సింగ్, స్పూర్తి జితేందర్, మమత, నాగ లక్ష్మీ, ముకుందా, మామిడి మౌనిక, కరుణాకర్, అశ్వీనీ రాతోడ్, బుల్లెట్ రాము, అరుణ్ రుక్సజ్ తో పాటు మరి కొంత మంది తెలంగాణ ఫోక్ సింగర్స్ ఆలపించనున్నారు.
స్టేజ్ పై ఆలపించే సాంగ్స్ ఇవే..
సుద్దాల అశోక్ తేజ – కొమురం భీముడో, సారంగదరియ
విమలక్క – సినుకు సినుకు
వందేమాతరం శ్రీనివాస్ – ఎర్రజెండా ఎర్రజెండా, బండెనక బండి
మధుప్రియ – గోదారి గట్టు, హీ సో క్యూట్
కిన్నెర మొగులయ్య – భీమ్లా నాయక్ & స్పెషల్ ఫర్ఫామెన్స్
మాట్ల తిరుపతి – ఏమవుతావని ఆకాశం నీకు
గద్దర్ నాసిరెడ్డి – అమ్మ పాట
క్లెమెంట్ – చిన్నది చాప / నీలా రాయే నీలా
పెద్దపులి శంకర్ – పెద్ద పులి
రేలారే గంగ – పుట్ట మీద పాల పిట్ట / పలుగు రాళ్ల పాడుల దిబ్బ
బుల్లెట్ బండి లక్ష్మణ్ – బుల్లెట్ బండి సాంగ్
భోలే షావళి – కష్టపడ్డ పాలమ్మిన పాట
రామ్ ( లవ్ ఫెయిల్యూర్ ) – అల్లాహె అల్లా / గుర్తుకు ఓచినప్పుల్లా
రాము రాథోడ్ – రాను బొంబాయి కి రాను / సొమ్మసల్లి పోతున్నావే
మామిడి మౌనిక – దరిపొంతొస్తుండు / కోరుకున్నారోరాయ
కనకవ్వ – ఆడ నెమలి / గిజ్జగిరి
భిక్షమమ్మ – లేగర సాంబయ్య / రావు తల్లి రావు తల్లి రేణుక ఎల్లమ్మ
ప్రభ – ఓ పిలగా వెంకటేశు / రాను బొంబాయి కి రాను
రాజేందర్ కొండ – యెర్ర యర్రా రుమాలు / కోమటోళ్ల ఓ వెంకటి
గడ్డం సంతోష్ – కమలాపురం రోడ్డట
హనుమంత్ యాదవ్ – సిటుకేస్తే పోయే ప్రాణం / ఒద్దనా గుండెల్లో
ముకుంద – ఉరుముల రమ్మంటినే
రషీద్ – మా వొళ్లు మా ఇంటి కడా
రెలారే జాన్ – మామ నాగాలు
రామ్ బాబు – పాటమ్మ తోనే ప్రాణం / అంద్రికోసం అయి జన్మల
చిటపట కరుణ్కర్ – బంజారా దప్పెమా / చోరీ చిట్టియే
వరం – కల్లజోడు కాలేజీ పాప
స్పూర్తి జితేందర్ – ఉండిపోవా
ఎలా బుక్ చేసుకోవాలంటే..?
ఈ బిగ్ ఫోక్ నైట్ టికెట్స్ ఎంట్రీవాలా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. యాప్ స్టోర్ నుంచి ఎంట్రీవాలా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, మీ నెంబర్ తో లాగ్ ఇన్ అవ్వండి. తర్వాత మీకు కావాల్సిన చోట టికెట్ బుక్ చేసుకోండి.
ALSO READ: బిగ్ ఫోక్ నైట్ 2025 టికెట్స్ బుక్ చేసుకోండి.. 20 శాతం డిస్కౌంట్‌తో…