The Big Folk Night 2025 : సంగీతానికి రాళ్లు కూడా కదులుతాయి అంటారు. ఒక మనిషిని కదిలించగలిగే శక్తి సంగీతానికి, సాహిత్యానికి , అక్షరానికి మాత్రమే ఉంటుంది. అక్షరాల ఆ మాటను మరోసారి రుజువు చేసింది బిగ్ టీవీ. ముందు వచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అనేది సామెత. ఆ సామెతకు అద్దం పట్టింది బిగ్ టీవీ.
బిగ్ టివి అనేది కేవలం ఒక ఛానల్ పేరు మాత్రమే కాదు. ప్రస్తుతం బిగ్ టివి అనేది ఒక బ్రాండ్. అతి తక్కువ కాలంలో ఎక్కువ ప్రాచుర్యం పొంది మిగతా ఛానెల్స్ కి దీటుగా నిలబడుతుంది. ఎవరు ఊహించని విధంగా, కని విని ఎరుగని రీతిలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో బిగ్ టివి బిగ్ ఫోక్ నైట్ ఏర్పాటు చేసింది.
దద్దరిల్లిని ఎల్బీ స్టేడియం
ఈ ఈవెంట్ ఉందని గత కొన్ని రోజులుగా అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. అలానే టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి అనే వెబ్సైట్లను కూడా బిగ్ టీవీ అనౌన్స్ చేసింది. మొత్తానికి నేడు అంగరంగ వైభవంగా ఈవెంట్ స్టార్ట్ అయింది. ఎవరు ఊహించని రీతిలో భారీ స్పందన లభించింది. సాధారణంగా ఊహించిన జనం కంటే ఎక్కువ జనంతో ఈ ఈవెంట్ కిటకిటలాడిపోయింది. ఈ ఈవెంట్ లో తెలంగాణ జానపద సింగర్స్ అంతా కలిసి వేదికపై పాటలు పాడుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఎల్బీ స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది.
అదే లక్ష్యంతో ఈవెంట్
మామూలుగా ఒక ఈవెంట్ నిర్వహించారు అంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో ఒక మోటివ్ ఉంటుంది. అయితే ఈ కార్యక్రమం నిర్వహించడం వెనక తెలంగాణ జానపద సంగీత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఉద్దేశం అని తెలుస్తుంది. జానపద పాటల ప్రామాణికత, వైవిధ్యం, సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రదర్శించి.. నేటితరం భవిష్యత్తు తరానికి కూడా అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
ట్రెండ్ సెట్టింగ్ కన్సర్ట్
మామూలుగా కన్సర్ట్ అంటే ఒక సింగర్ పాట పాడుతూ ఉంటారు. ఆ పాటను తిరిగి ప్రేక్షకులు హమ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క సింగర్ పేరు మీద కన్సర్ట్ అనేది జరుగుతుంది. కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఏకంగా 60 మంది సింగర్స్ ఒకే వేదిక పైన చూడటం అంటే మామూలు విషయం కాదు. రెండు కళ్ళు చాలడం లేదు అని సామెతను దీనికి వాడొచ్చు. 60 మంది సింగర్స్ ఒకరితో ఒకరు పాటలు పాడుతూ అలరిస్తున్నారు. ఎన్నో అచీవ్మెంట్స్ చేసిన బిగ్ టీవీ మొత్తానికి దీనితో మరో ముందడుగు వేసి తమ బ్రాండ్ ఏంటో మరోసారి నిరూపించుకుంది.