
World Cup 2027 : 2023 వరల్డ్ కప్ ఎన్నో తీపి గుర్తులను, చేదు జ్నాపకాలను మిగిల్చి వెళ్లింది. ఇప్పుడు ఆడుతున్న భారతీయ క్రికెటర్లే కాదు, ఇతర దేశాల్లో ఆడే సీనియర్ క్రికెటర్లు చాలామంది వచ్చే 2027 వరల్డ్ కప్ లో కనిపించకపోవచ్చు. మరి వారిని కూడా ఒకసారి లుక్కేద్దాం పదండి..
ఇంగ్లండ్ కి చెందిన 32 ఏళ్ల బెన్ స్టోక్స్ ఆల్రడీ రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ వరల్డ్ కప్ కోసం వాయిదా వేసుకుని జట్టులోకి వచ్చాడు. ఆల్రడీ చెప్పేశాడు కాబట్టి, ఇక 2027లో కనిపించడనే చెప్పాలి.
టైమ్డ్ అవుట్ వివాదంతో పాపులర్ అయిన శ్రీలంక ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ కూడా వచ్చే వరల్డ్ కప్ నాటికి ఉండకపోవచ్చు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారి టైమ్డ్ అవుట్ అయిన క్రికెటర్ గా చరిత్ర పుటల్లోకి ఎక్కిన మాథ్యూస్ చాలా పెద్ద వివాదానికి తెర తీశాడు. అలా కూడా పాపులర్ అయ్యాడు. అంతకుముందు శ్రీలంక కెప్టెన్ గా కూడా చేశాడు. 36 ఏళ్ల మ్యాథ్యూస్ వచ్చే వరల్డ్ కప్ నాటికి 40 ఏళ్లవాడవుతాడు. అందుకని ఉండే అవకాశాలైతే దాదాపు లేవు.
ఆఫ్గనిస్తాన్ కి చెందిన 38 ఏళ్ల మహ్మద్ నబీ వరల్డ్ కప్ లో 8 వికెట్లు తీశాడు. తనకైతే అవకాశం లేదు. ఆఫ్గనిస్తాన్ అద్భుతంగా ఆడుతోంది కాబట్టి, యువతరానికే పెద్ద పీట వేసే అవకాశాలున్నాయి.
పుష్ప-3 ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, సెంచరీ చేస్తే చాలు తగ్గేదేలే అంటూ పుష్పని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన వార్నర్ కి 37 ఏళ్లు వచ్చేశాయి. దాదాపు వచ్చేవరల్డ్ కప్ లో ఆడే అవకాశం లేదు.
వన్డే వరల్డ్ కప్ 2023 సాధించడంలో కీలకంగా ఉన్న ఆస్ట్రేలియాలో నలుగురు ప్లేయర్లు కూడా వచ్చే వరల్డ్ కప్ కి వయసు మీరిపోతున్నారు. 34 ఏళ్ల స్మిత్, మాక్స్ వెల్, స్టయినిస్, 33 ఏళ్ల స్టార్క్ అంతా వచ్చే ఏడాది ఇంట్లో టీవీ ముందు కూర్చుని చూడాల్సిందే అంటున్నారు.
న్యూజిలాండ్ కెప్టెన్ ..కేన్ మామగా పిలిచే కేన్ విలియమ్సన్ కి కూడా 34 ఏళ్లు వచ్చేశాయి. తన హయాంలో 2019 వరల్డ్ కప్ లో కివీస్ ఫైనల్ వరకు వెళ్లి ఇంగ్లండ్ తో సమానంగా నిలిచింది. ఫోర్లు పేరు చెప్పి కివీస్ నుంచి వరల్డ్ కప్ ని ఇంగ్లండ్ లాగేసుకుంది. ఇప్పుడు సెమీస్ లో ఇండియా చేతిలో ఓటమి పాలై ఇంటికి వెళ్లింది. ఈ పరిస్థితుల్లో వచ్చే వరల్డ్ కప్ కి కేన మామ్ ఉండకపోవచ్చు. కివీస్ కి వరల్డ్ కప్ అందించే అపురూపమైన గౌరవాన్ని అందించలేకపోయాడు.
దక్షిణాప్రికా నుంచి డికాక్, ఇంగ్లండ్ నుంచి డేవిడ్ విల్లీ ఆల్రడీ రిటైర్మెంట్ ప్రకటించేశారు.
ఇంకా వయసురీత్యా పెద్దవాళ్లయినా 34 ఏళ్ల బౌల్డ్ , సౌథీ కూడా న్యూజిలాండ్ టీమ్ లో వచ్చే వరల్డ్ కప్ కి ఉండకపోవచ్చు. బంగ్లాదేశ్ నుంచి షకీబుల్ హసన్, ముష్పీకర్ రహీం, ఇంగ్లండ్ నుంచి డేవిడ్ మలన్ , మెయిన్ ఆలీ, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ , దక్షిణాప్రికా నుం చి బవుమా, మిల్లర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ తదితర ఆటగాళ్లకు ఇదే చివరి ప్రపంచకప్ కావచ్చునని వాళ్ల వయసు రీత్యా చెప్పవచ్చు.