Mass Jathara : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో సూర్యదేవర నాగ వంశీ ఒకరు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నాగ వంశీ సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. వాస్తవానికి ఈ బ్యానర్ కి మంచి గౌరవం ఉంది. జెర్సీ, సార్, లక్కీ భాస్కర్ వంటి ఎన్నో సినిమాలు ఈ బ్యానర్ కు ఒక బ్రాండ్ వ్యాల్యూని తీసుకొచ్చాయి. అయితే రీసెంట్గా ఈ బ్యానర్ నుంచి వచ్చిన సినిమా కింగ్డమ్.
గౌతమ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించి విపరీతమైన బుకింగ్స్ వచ్చాయి. ఒక్క పాజిటివ్ టాక్ వస్తే చాలు సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. కానీ ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక ప్రస్తుతం ఇదే బ్యానర్ నుంచి మాస్ జాతర అనే సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.
మాస్ జాతర టీం కు లీగల్ నోటీసులు
ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్న తరుణంలో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ పైన ఇప్పుడు క్లారిటీ లేదు, అలానే చాలా ఇష్యూస్ చిత్ర యూనిట్ ఫేస్ చేస్తుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి మదర్ ఈ చిత్ర యూనిట్ కు లీగల్ నోటీసులు పంపారు. దీనికి కారణం ఈ సినిమాలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ ద్వారా చక్రి వాయిస్ ఉపయోగించి తు మేరా లవ్ అనే పాటను కంపోజ్ చేశారు. అయితే ఈ పాటను కంపోజ్ చేసినప్పుడు వాళ్ల పర్మిషన్ తీసుకోలేదు అని ఈ లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం వినిపిస్తుంది. మొత్తానికి ఈ పాట మాత్రం సినిమా మీద విపరీతమైన క్రేజ్ పెంచింది. మిస్ అయిన చక్రి వాయిస్ ని మళ్లీ వినడం చాలా కొత్తగా అనిపించింది.
వేరే సింగర్స్ తో పాట
బాగా పాపులర్ అయిన ఈ పాటను ఇప్పుడు వేరే సింగర్స్ తో పాడించే పనిలో ఉన్నారు. ఈ పాటకి సంబంధించిన షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు మళ్లీ వేరే సింగర్స్ తో పాడించి, షూట్ చేసిన పాటకు అటాచ్ చేయాలి. మరోవైపు ఈ సినిమాని సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కానీ ఈ సినిమా ఆ డేట్ కి వచ్చే క్లారిటీ లేదు. మొత్తానికి ఈ సినిమాను అక్టోబర్ నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. దీని గురించి ఇంకా అధికారికి ప్రకటన రావాల్సి ఉంది. ఇక నిర్మాత వంశీకి ఒక దెబ్బ తర్వాత మరో దెబ్బ తగులుతూనే ఉన్నాయి. కింగ్డమ్ అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు, డిస్ట్రిబ్యూట్ వార్ 2 సినిమా దెబ్బ కొట్టింది. ఇప్పుడు మాస్ జాతరకు చిక్కులు.
Also Read: Nithiin: పాపం నితిన్… హిట్ కోసం మళ్ళీ ఆ దర్శకుడును నమ్ముకుంటున్నాడు