BigTV English

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Sitara Ghattamaneni : టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సూపర్ కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. అప్పటిలో మహేష్ నటించిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సంపాదించుకొని సూపర్ స్టార్ అయ్యాడు. మహేష్ బాబు వారసురాలు సితార గురించి అందరికి తెలుసు. చిన్న వయసు నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తండ్రికి మించి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. సేవా కార్యక్రమాల చేస్తూ తండ్రికి మించిన తనయురాలు అనే టాక్ ను అందుకుంది. సితార తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. ఫేక్ అకౌంట్ల తో మోసపోవద్దు అని అలెర్ట్ చేసింది. ఇంత సడెన్ గా ఆ పోస్ట్ ఎందుకు పెట్టిందో అని సోషల్ మీడియాలో చర్చలు వినిపిస్తున్నాయి..


అది నాది కాదు.. బీ అలెర్ట్.. 

ఈ మధ్య ఫేక్ అకౌంట్స్ ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయి. సెలబ్రిటీలు, వాళ్ల పిల్లలు వీటి బారిన పడుతుంటారు. ఇప్పుడు మహేష్ బాబు కూతురు సితారకు కూడా అలాంటి అనుభవమే ఎదురైనట్లు ఉంది. ఆ పోస్ట్ లో ఏం జరిగిందో రాసుకొచ్చింది. నా పేరు మీద పలు ఫేక్ అకౌంట్స్ ఉన్నట్లు దృష్టికి వచ్చింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ.. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే అకౌంట్ ఉంది. ఇదే నా అఫీషియల్. ఏదైనా చెప్పాలనుకుంటే దీని ద్వారా చెబుతా. వేరే ఏ సోషల్ మీడియా లోనూ నాకు ఖాతా లేదు.. దయచేసి నమ్మి మోసపోకండి అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది. అది ప్రస్తుతం వైరల్ అవ్వడంతో నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. సితార స్పెషల్ టాలెంట్స్ విషయానికొస్తే.. మహేష్ బాబు గారాల పట్టి సితార.. మంచి క్లాసికల్ డ్యాన్సర్.. నటి అవుతానని గతంలో ఓసారి చెప్పింది. మరి ఎప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందో చూడాలి..


Also Read: ‘చిరంజీవి హనుమాన్ ‘ ఏఐ పూర్తి.. థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే..?

మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. 

గత ఏడాది గుంటూరు కారం మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. అయితే సినిమా పాజిటివ్ టాక్ ని అందుకున్న సరే మంచి క్రేజ్ అయితే వచ్చింది. ప్రస్తుతం ఈయన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకుధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తన 29వ సినిమా చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ తర్వాత మరో రెండు భారీ ప్రాజెక్టుల లో నటిస్తున్నాడు. ఇటీవల మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. అది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రాజమౌళి సినిమాలు అంటే ఎక్స్పెక్టేషన్స్ మాములుగా ఉండవు.. ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి..

Related News

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

Big Stories

×