Sreeleela: ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. నిన్ను చూడాలని సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తారక్. అంతకంటే ముందు బాలునట్టుగా లవకుశ సినిమాలో కనిపించాడు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ సాధించింది. అయితే హీరోగా పరిచయమైన నిన్ను చూడాలని సినిమా ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అక్కడితో హీరోగా నిలబడిపోయాడు తారక్. ఆ తర్వాత అద్భుతమైన సినిమాలు చేస్తూ అంచలంచెలుగా ఎదిగాడు. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో ఎన్టీఆర్ ఒకడు.
శ్రీ లీలా వెనుక ఎన్టీఆర్
పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీలా. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు కానీ శ్రీలేఖ మాత్రం వరుసగా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో శ్రీ లీల ఒకరు అని చెప్పొచ్చు. మిడ్ రేంజ్ హీరోలతో మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు పక్కన కూడా నటించింది శ్రీలీలా.
అయితే శ్రీ లీల హీరోయిన్ అవ్వడానికి కారణం ఎన్టీఆర్. ఎన్టీఆర్ చిన్నప్పుడు భరతనాట్యం చేస్తున్న ఫోటోను చూసింది శ్రీ లీలా మదర్. ఎప్పటికైనా సరే నాకు ఆడపిల్ల పుడితే ఇలా డాన్స్ నేర్పించాలి అని ఆవిడ ఫిక్స్ అయ్యారట. ఈ మాట జయము నిశ్చయంబురా ప్రోగ్రాంలో శ్రీ లీల మదర్ స్వయంగా తెలిపారు. తానా సభల్లో కూడా ఎన్టీఆర్ తో ఈ విషయాన్ని చెప్పారు. ఆ మాదిరిగానే శ్రీ లీలాను పెంచారు తన మదర్. ఇప్పుడు శ్రీ లీలా అంటే టక్కున గుర్తుచేది తన డాన్స్. మొత్తానికి చాలా చిన్న ఏజ్ లో అవతల వాళ్ళని ఇన్స్పైర్ చేయగలిగాడు ఎన్టీఆర్.
రెండు బ్యాలెన్స్ చేస్తూ
కేవలం సినిమాల మీద మాత్రమే దృష్టి పెట్టకుండా, మరోవైపు స్టడీస్ కూడా ఫినిష్ చేశారు. పోతే శ్రీ లీల కెరియర్ లో మంచి లైనప్ సెట్ చేసుకుంది. రీసెంట్ టైమ్స్ లో ఆమె నటిస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించక పోయినా కూడా తనకు అవకాశాలు అయితే వరుసగా వస్తున్నాయి. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది శ్రీ లీలా.
Also Read: Nithiin: పాపం నితిన్… హిట్ కోసం మళ్ళీ ఆ దర్శకుడును నమ్ముకుంటున్నాడు