OTT Movie : మలయాళ సినిమా ప్రేమికులకు ఈ ఆగస్టు 2025 ఓటీటీ రిలీస్‌లు విభిన్న రుచులను అందిస్తున్నాయి. ఈ సినిమాలు సన్‌ఎన్‌ఎక్స్‌టీ, లయన్స్‌గేట్ ప్లే, సైనా ప్లే, మనోరమామ్యాక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి. మలయాళ సినిమా పరిశ్రమ ఎప్పటిలాగే తన వైవిధ్యమైన కథలతో ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో సందడి చేస్తోంది. ఆగస్టు 2025లో విడుదలైన కొత్త మలయాళ సినిమాలు, సిరీస్‌లు వినోద ప్రియులను విభిన్న జానర్‌లతో ఆకట్టుకుంటున్నాయి. కామెడీ, డ్రామా, థ్రిల్లర్, రొమాంటిక్ కథల నుండి The Chronicles of the 4.5 Gang, Soothravakyam, Perumani, Shanthamee Raathriyil వంటి చిత్రాలు ఆగస్టు చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
1. The Chronicles of the 4.5 Gang : ఇది ఒక ఇంట్రిగింగ్ మలయాళ వెబ్ సిరీస్. దర్శకుడు కృషాండ్ దీనిని రూపొందించారు. ఈ సిరీస్ ఒక చిన్న పట్టణంలో 4.5 సభ్యులుగా ఉన్న ఒక గ్యాంగ్ చుట్టూ తిరిగే కామెడీ-డ్రామా. వీళ్ళు చేసే సాహసాలు, స్నేహ బంధాల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ సిరీస్ ఓటీటీప్లే లో ఆగస్టు 2025 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో 7.2/10 రేటింగ్‌తో, ఈ సిరీస్ ఫ్రెష్ కాన్సెప్ట్ , కామెడీ కోసం ప్రశంసలు అందుకుంది,
2. Soothravakyam : ఒక మలయాళ కామెడీ థ్రిల్లర్. దర్శకుడు యూజిన్ జోస్ చిరమ్మెల్ దర్శకత్వంలో, షైన్ టామ్ చాకో, విన్సీ అలోషియస్, దీపక్ పరంబోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. కథలో సబ్-ఇన్‌స్పెక్టర్ క్రిస్టో జేవియర్ (షైన్ టామ్ చాకో) తన పోలీస్ స్టేషన్‌ను విద్యార్థుల కోసం ఒక ట్యూషన్ సెంటర్‌గా మార్చి, స్థానిక యువతకు సహాయం చేస్తాడు. అయితే ఒక వ్యక్తి మిస్సింగ్ కేసుతో ఈస్టోరీ ఒక గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్‌గా మారుతుంది. ఈ సినిమా 2025 జూలై 11న థియేటర్లలో విడుదలై, ఆగస్టు 21 నుండి లయన్స్‌గేట్ ప్లేలో మలయాళం, తమిళం, కన్నడం, హిందీ డబ్బింగ్ వెర్షన్‌లతో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ ETV విన్‌లో అందుబాటులో ఉంది. షైన్ టామ్ చాకో లేయర్డ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.
3. Perumani : ఒక మలయాళ ఫీల్ గుడ్ సినిమా. దర్శకుడు మాజు దీనిని రూపొందించారు. ఇందులో అలెన్సియర్ లే లోపెజ్, సన్నీ వేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. పెరుమని అనే గ్రామంలో ఈ కథ జరుగుతుంది. ఒక వివాహ వేడుక సమయంలో ఒక అతిథి ఊరిలోకి రావడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. అక్కడి ప్రజలు, అతన్ని దైవ పురుషుడిగా భావించి, గ్రామంలో ఉండమని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఈ సినిమా సైనా ప్లేలో 2025 ఆగస్టు 21 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో 6.5/10 రేటింగ్‌తో, ఈ చిత్రం దాని స్టోరీ లైనింగ్, నటనలకు ప్రశంసలు అందుకుంది.
4. Shanthamee Raathriyil : ఒక రొమాంటిక్ సినిమా. ప్రముఖ దర్శకుడు జయరాజ్ దీనిని రూపొందించారు. ఇందులో ఎస్తర్ అనిల్, సిద్ధార్థ్ భరతన్, జీన్ పాల్ లాల్, టినీ టామ్, మరియు కైలాష్ నటించారు. ఈ చిత్రం, రెండు ప్రేమ కథలతో తెరకెక్కింది. ఒక యువకుడు యూకేలో చదువుతూ, తన తాత ప్రేమకథ వెనుక సీక్రెట్ తెలుసుకునే పనిలో పడతాడు. గతం, వర్తమానం మధ్య ఒక ఆసక్తికరమైన లింక్ తో ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మనోరమా మ్యాక్స్‌లో 2025 ఆగస్టు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో 5.8/10 రేటింగ్ అందుకుంది.
Read Also : తాత లవ్ స్టోరీపై మనవడి కన్ను… ఆ ఒక్క రాత్రి గురించే ఆరా… మనసుకు హత్తుకునే మలయాళ మూవీ