Venuswamy: వేణు స్వామి (Venuswamy) ..ఈ పేరు తెలియని వాళ్లు ఉండరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సమంత (Samantha ), నాగచైతన్య (Naga Chaitanya) విడాకుల వ్యవహారంతో ఈయన పేరు మరింత వైరల్ అయింది.అయితే తరచూ పలు యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూలు ఇస్తూ కొంతమంది సినీ నటీనటుల పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతూ.. వాళ్ల పేర్లతో సహా చెప్పి వీళ్లు పెళ్లి చేసుకుంటే విడిపోతారు, వీళ్లకు పెళ్లి అచ్చి రాదు, వీళ్ళ సినీ కెరియర్ ఇలా ఉంటుంది అంటూ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. అంతేకాదు కొంతమంది సంతానం లేని వారికి కూడా పూజలు చేస్తానంటూ కామాఖ్య దేవి ఆలయం గురించి చెబుతూ ఎన్నో విషయాలు మాట్లాడారు. అయితే ఇవేవీ తెలియని చాలామంది జనాలు వేణుస్వామి చెప్పేది నిజమే కావచ్చు అనుకున్నారు.అంతేకాదు కామాఖ్య దేవాలయ ప్రతిష్ట దెబ్బతిస్తూ ఆలయం గర్భగుడిలో సె** వంటి ఎన్నో అపచారపు మాటలు కూడా మాట్లాడారు. అయితే తాజాగా వేణు స్వామికి తగిన గుణపాఠం జరిగింది.
వేణు స్వామికి ఘోర అవమానం..
అదేంటంటే కామాఖ్య దేవాలయం గురించి అసభ్యకరమైన మాటలు మాట్లాడి.. ఆ దేవాలయంలోనే అవమానించబడ్డాడు. విషయంలోకి వెళ్తే.. తాజాగా వేణు స్వామి అస్సాంలో ఉండే కామఖ్య దేవి టెంపుల్ కి వెళ్ళాడు. టెంపుల్ కి వెళ్ళగానే అక్కడ ఉన్న పండితులు ఆయన్ని లోపలికి వెళ్ళనివ్వలేదు. అంతేకాదు గత కొద్దిరోజులుగా మేము నీ బాగోతం చూస్తున్నాం.కామాఖ్య దేవత ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా నువ్వు మాట్లాడుతున్నావ్.. నీలాంటి దొంగ స్వామీజీలను మేము అస్సలు నమ్మము.. అంటూ బయటకు తోసేసారు.
లక్షలు తీసుకొని మోసం చేస్తున్నాడు..
అనంతరం ఆ గుడి పండితులు మాట్లాడుతూ..” ఎవరికైనా ఏదైనా పూజలు కావాలంటే డైరెక్ట్ గా మమ్మల్ని వచ్చి కలవండి. ఈయన చేసే పూజలు మేం కూడా చేస్తాం. కానీ ఈయన లక్షలు తీసుకొని చేస్తున్నారు. ఇలా లక్షల ఖర్చుతో ఇక్కడ పూజలు లేవు. తక్కువ ఖర్చుతోనే మీకు చేయాల్సిన పూజలన్నీ చేసేస్తాం.ఇలాంటి దళారుల మాటలు పట్టించుకోకండి” అంటూ చాలామంది వేణు స్వామిని నమ్మి మోసపోయిన వారికి ఇక్కడి పండితులు కళ్ళు తెరిపించారు.
సమస్య ఉంటే నేరుగా కలవండి – కామాఖ్య టెంపుల్ పూజారులు
అంతేకాదు ఎవరికైతే సమస్యలు ఉంటాయో వాళ్ళు ఇక్కడికి వచ్చి మీ సమస్యలను పూజారులకు చెబితే ఆ పూజారులు దానికి అవసరమయ్యే డబ్బుతో మాత్రమే మీకు పరిహార పూజలు చేస్తారు. వేణు స్వామి లక్షలు ఖర్చు చేయించి చేసే పూజలు ఇక్కడ ఏమీ లేవు.ఆయన మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఈ వేణు స్వామి గురించి మాకు కొద్ది రోజుల క్రితం తెలిసింది. అందుకే ఈయన వస్తున్నాడనే సమాచారం తెలియగానే మేము ఆయన్ని అడ్డుకున్నాము. అలాగే కామాఖ్య గుడితో గానీ గుడిలోని పూజలతో కానీ వేణు స్వామికి ప్రత్యక్ష సంబంధం లేదు.. గుడి అంటే గుడి లాగే ఉండాలి అంటూ అక్కడ పూజారులు వేణు స్వామిని అడ్డగించినట్లు తెలుస్తోంది.
వేణు స్వామిపై కేసు ఫైల్ చేస్తామంటూ హెచ్చరిక..
ఆ తర్వాత వేణు స్వామి ఆ గుడిలోకి వెళ్లకుండా అడ్డుకొని బయటికి గెంటేసారు. అంతేకాదు వేణు స్వామి కామాఖ్య దేవాలయ గురించి తప్పుగా ప్రచారం చేయడమే కాకుండా కామాఖ్య దేవాలయం పేరు చెప్పుకొని లక్షలు దోచుకొని పూజలు చేయించాడు కాబట్టి ఖచ్చితంగా వేణు స్వామిపై పోలీస్ స్టేషన్లో కేసు పెడతామంటూ చాలా కచ్చితంగా చెప్పారు అక్కడి పూజారి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్లు వేణు స్వామికి తగిన గుణపాఠం ఇదే.. ఇన్ని రోజులు కామాఖ్య దేవతను అవమానించారు.. చివరికి ఆ దేవతనే సరైన గుణపాఠం చెప్పింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ALSO READ:Tamannaah Bhatia: అలాంటి సీన్స్ చేశాకే నా కెరియర్ మారిపోయింది -తమన్నా