Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. క్రికెట్ రంగంలో సచిన్ టెండూల్కర్ ఎన్నో విజయాలను సాధించాడు. క్రికెట్ గాడ్ గా పేరు సొంతం చేసుకున్నాడు. క్రికెట్ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే వారికి ఇతను ఒక ఆదర్శం అని చెప్పవచ్చు. ఇక సచిన్ వయసు పైబడటంతో క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. చాలా సంవత్సరాల తర్వాత సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున తన ఆటను కొనసాగించాడు. వచ్చే సంవత్సరం ఐపిఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టు నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
దానికి గల ప్రధాన కారణం తన ఆట తీరుతో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. అర్జున్ టెండూల్కర్ పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాడు. ఇదిలా ఉండగా… అర్జున్ టెండూల్కర్ ఆగస్టు 13వ తేదీన సానియా చందోక్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చెసుకున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. వీరి ఎంగేజ్మెంట్ కు అతి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లుగా తెలుస్తోంది. వీరికి సంబంధించిన ఓ పాత ఫోటో సైతం సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో వీరిద్దరూ నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చినప్పటికీ వాటిపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఈ విషయంపైన సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ) కూడా ఇంతవరకు రియాక్ట్ అవలేదు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఇక సచిన్ టెండూల్కర్ భార్య అంజలి టెండూల్కర్ ముంబైకి దగ్గరలో ఒక స్మాల్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిందట. దాని విలువ సుమారు 40 లక్షల వరకు ఉంటుందని సమాచారం అందుతుంది. ఈ విషయం తెలిసిన అనంతరం అర్జున్ టెండూల్కర్ వివాహం తర్వాత సెపరేట్ గా ఉండడానికి ఇలా అపార్ట్మెంట్ కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి. వారికి కాబోయే కోడలు సానియా చందోక్ కు గిఫ్ట్ గా ఇవ్వడానికి ఇలా అపార్ట్మెంట్ కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి.
ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ ల వివాహం అక్టోబర్ నెలలో జరగబోతున్నట్టుగా వార్త వైరల్ గా మారింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఈ విషయం పైన సచిన్ టెండూల్కర్ కుటుంబ సభ్యులు ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.