EPAPER

Meena: మరి నన్ను ఎందుకు పిలిచారు అంటూ హిందీ విలేకరులపై మీనా ఫైర్..!

Meena: మరి నన్ను ఎందుకు పిలిచారు అంటూ హిందీ విలేకరులపై మీనా ఫైర్..!

Meena.. దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న అలనాటి అందాల తార మీనా (Meena) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఈమె సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth )తో కలిసి నటించిన ముత్తు సినిమాతో ఏకంగా జపాన్లో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. ఇప్పటికే అక్కడ స్టార్ హీరో, హీరోయిన్ ఎవరంటే ముందుగా మీనా, రజినీకాంత్ పేర్లే చెబుతారు. అంతలా మన ఇండియాలోనే కాకుండా జపాన్ వంటి అత్యాధునిక టెక్నాలజీ కలిగిన దేశంలో కూడా పేరు సొంతం చేసుకున్నారంటే వీరు తమ నటనతో అక్కడి ఆడియన్స్ ను ఏ విధంగా మెప్పించారో అర్థం చేసుకోవచ్చు.


వృత్తిపరంగా కాదు వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు..

ఇకపోతే మీనా వృత్తి పరంగా ఎన్నో ఫీట్స్ అందుకుంది కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎన్నో ఇబ్బందులు అనుభవించిందని చెప్పాలి. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న తన భర్త విద్యాసాగర్ గత ఏడాది క్రితం అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకునే ప్రయత్నం చేస్తోంది. కూతురు నైనికతో కలిసి కెరియర్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా అబుదాబిలో జరిగిన ఐఫా 2024 వేడుకలలో సందడి చేసింది మీనా. 2024 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్ వేడుక అబుదాబిలో సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు మొత్తం మూడు రోజుల పాటు చాలా ఘనంగా జరిగింది. ఇందులో ఉత్తమ నటి ఉత్తమ చిత్రం వంటి విభాగాలలో అవార్డులు అందజేశారు. ఈ సినిమా అవార్డు వేడుకలలో మీనా కూడా పాల్గొని సందడి చేసింది.


నన్ను ఎందుకు పిలిచారు అంటూ మీనా ఫైర్..

ఇక అక్కడి జర్నలిస్టులు మీనా ను మాట్లాడమని ఆహ్వానించగా.. మీనా కూడా మాట్లాడేందుకు వెళ్ళగానే, అక్కడ చాలా మైక్ లు ఆమె ముందు పెట్టారు. అప్పుడు విలేకరులలో ఒకరు మీనా తో హిందీలో మాట్లాడండి అని అడగ్గా.. టెన్షన్ పడిన మీనా ఇది హిందీ పండుగా
.? నేను హిందీలో మాట్లాడాలి అని అనుకుంటున్నారా..? అయితే మరి నన్ను ఎందుకు పిలిచారు? అంటూ కామెంట్లు చేసింది.

సినిమా ప్రపంచాన్ని ఒక్క తాటిపైకి తేవడమే ఐఫా లక్ష్యం..

సౌత్ ఇండియన్ మాత్రమే ఇక్కడికి వస్తారని నేను అనుకున్నాను. ఇక్కడ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఫిలిమ్స్ చాలా గొప్పవి. నేను సౌత్ ఇండియన్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. ఐఫా ఉత్సవం సౌత్ ఇండియన్స్ ను మాత్రమే కాదు నార్త్ ఇండియన్ ఫిలిం మేకర్స్ ని కూడా ఇక్కడికి తీసుకొస్తుంది. ముఖ్యంగా అటు నార్త్ ఇండియన్, ఇటు సౌత్ ఇండియన్ సినిమా ప్రపంచాన్ని ఒక్క తాటిపైకి తీసుకురావడానికి ఈ ఫెస్టివల్ అతిపెద్ద వేదికగా కానుంది అంటూ తన అభిప్రాయంగా వెల్లడించింది మీనా. ప్రస్తుతం మీనాకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా హిందీ విలేకరులకు మీనా ఝలక్ ఇచ్చిందని చెప్పవచ్చు.

Related News

Bollywood : బిగ్ బ్రేకింగ్.. బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత..

Mahendragiri Vaarahi: సంక్రాంతి బరిలోకి సుమంత్ మూవీ.. అందరిని పిచ్చోళ్లను చేసేలా నిర్మాత మాస్టర్ ప్లాన్…?

Shruti Haasan: ‘డెకాయిట్’ నుండి తప్పుకున్న శృతి హాసన్.. అదే కారణమా?

Jani Master: జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు.. తల్లిని చూసైనా కోర్టు కనికరించలేదా..?

Tollywood Young Hero: పూరీనే రిజెక్ట్ చేసిన కుర్ర హీరో.. తప్పు చేశాడా.. తప్పించుకోవడానికి చేశాడా.. ?

Prabhas Hanu: ప్రభాస్, హను సినిమాకు ఓ రేంజ్‌లో హైప్.. ఓవర్సీస్ కోసం ఏకంగా అన్ని కోట్లు డిమాండ్?

Matka Movie: లేలే రాజా.. ఏముందిరా.. మనోహరీ.. సాంగ్ అదిరింది అంతే

Big Stories

×