BigTV English

Shilpa Shetty: 50ల్లో కూడా స్టిల్ యంగ్.. ఆ అలవాట్లే కారణం అంటున్న శిల్పా శెట్టి!

Shilpa Shetty: 50ల్లో కూడా స్టిల్ యంగ్.. ఆ అలవాట్లే కారణం అంటున్న శిల్పా శెట్టి!

Shilpa Shetty:సాధారణంగా సినీ ఇండస్ట్రీలో రాణించాలి అంటే అందం తప్పనిసరి అయిపోయింది. అందుకే ఇండస్ట్రీలో అందంగా కనిపించడానికి, ఎక్కువ కాలం కొనసాగడానికి హీరోయిన్లు నిత్యం శ్రమిస్తూనే ఉంటారు. ప్రతిరోజు జిమ్ కి వెళ్తూ.. తమ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడమే కాకుండా.. ఆరు పదుల వయసుకు చేరువ అవుతున్నా ఇంకా అంతే అందంగా , ఫిట్ గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. సాధారణంగా ఒక మహిళ పెళ్ళయి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది అంటే.. ఆమెలో చాలా మార్పులు వస్తాయి. బరువు పెరిగిపోయి ఒక్కొక్కసారి గుర్తుపట్టలేనంతగా కూడా మారిపోతూ ఉంటారు.. కానీ ఈ హీరోయిన్లు మాత్రం ఇంకా యంగ్ గా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


50ల్లో కూడా ఇంత అందంగా..

ఇదిలా ఉండగా.. 50ల్లో కూడా ఇంత అందంగా.. యవ్వనంగా కనిపించడానికి ఆ ఆహారపు అలవాట్లే అంటూ చెప్పుకొచ్చింది ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి (Shilpa Shetty) . మరి శిల్పా శెట్టి ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శిల్పా శెట్టి తన శరీర ఆకృతి, గ్లోయింగ్ స్కిన్, ఫిట్నెస్ రహస్యాల గురించి చెప్పుకొచ్చింది. శిల్పా శెట్టి మాట్లాడుతూ.. నేను ప్రతిరోజు నిద్రలేచిన వెంటనే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగుతాను. ఇది జీర్ణక్రియకు చక్కగా సహాయపడుతుంది. కాసేపటి తర్వాత నాలుగు చుక్కల నోని జ్యూస్ తాగుతాను. ఇది రోజంతా కావాల్సిన శక్తిని ఇస్తుంది..ఇక మూడవది టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేసుకుంటాను. ఇది నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.


ఆ అలవాట్లే కారణం..

బ్రేక్ ఫాస్ట్ అంటారా.. బరువు తగ్గాలనే ఆలోచనతో చాలామంది బ్రేక్ ఫాస్ట్ మానేస్తారు.. కానీ ఇలా చేయకూడదు. ఉదయం తీసుకునే ఫస్ట్ మీల్ శరీరానికి ఎనర్జీని ఇస్తుంది. బ్రేక్ ఫాస్ట్ లో బాదం పాలలో ఫ్రూట్స్ ముక్కలు, సీజనల్ ఫ్రూట్స్, ఉడికించిన గుడ్లు తప్పనిసరిగా తీసుకుంటాను. చాలామంది నెయ్యి తీసుకుంటే బరువు పెరుగుతారనే అపోహతో దూరంగా ఉంటారు. కానీ నెయ్యిని నిత్యం భోజనంలో భాగం చేసుకోవడం వల్ల శరీరం మరింత యంగ్ గా మారుతుంది. డైటింగ్ చేయడం, కడుపు మార్చుకోవడం లాంటివి చేయకూడదు. సమయానికి తినాలి.. పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. అయితే మనం డైట్ తీసుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా వైద్యుడు సలహాతోనే డైట్ ప్రారంభిస్తే చాలా మంచిది ” అంటూ తన ఫిట్నెస్ సీక్రెట్ గురించి చెప్పుకొచ్చింది శిల్పా శెట్టి. ఇక ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నా.

శిల్పా శెట్టి సినిమాలు..

1993లో వచ్చిన బాజీగర్ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. తన సినీ కెరియర్లో మొత్తం 40 కి పైగా చిత్రాలలో నటించింది. తెలుగు, తమిళ్ , కన్నడ, హిందీ భాషలలో నటించిన ఈమె తెలుగులో ఆజాద్, సాహస వీరుడు సాగర కన్య, భలేవాడివి బాసూ వంటి చిత్రాలు చేసింది. సుఖీ, నిక్కమ్మ వంటి చిత్రాలలో కూడా నటించింది.

ALSO READ:Vishal 35 Title Teaser: మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్న విశాల్.. టైటిల్ టీజర్ అదుర్స్!

Related News

Ananya Nagalla : మృణాల్ ఏముంది భయ్యా? ఈ తెలుగు అమ్మాయి అందం చూస్తే మతిపోతుంది

Nara Rohit: ఎన్టీఆర్ ఇష్యూ పై స్పందించిన నారా రోహిత్.. అసలు మ్యాటర్ ఏంటంటే?

Kajol: కాజోల్ పై బాడీ షేమింగ్.. సిగ్గులేదా అంటూ ప్రముఖ నటి ఫైర్!

Peddi : రామ్ చరణ్ సినిమాలు రిజెక్ట్ చేసిన మలయాళం బ్యూటీ

Samantha: క్రైమ్ థ్రిల్లర్ కథతో సమంత కొత్త మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?

Raja saab : రాజా సాబ్ లైన్ క్లియర్, ఇంకా ఇంత వర్క్ పెండింగ్ లో పెట్టారా?

Big Stories

×