BigTV English

Ramgopal Varma: వార్ 2 పై వర్మ రివ్యూ… అందుకే సినిమాలు ఫెయిల్ అవుతున్నాయంటూ!

Ramgopal Varma: వార్ 2 పై వర్మ రివ్యూ… అందుకే సినిమాలు ఫెయిల్ అవుతున్నాయంటూ!

Ramgopal Varma: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ramgopal Varma)ఇటీవల కాలంలో సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయారు. వర్మ సోషల్ మీడియా వేదికగా ఏ చిన్న పోస్ట్ చేసిన లేదా మీడియా సమావేశంలో ఏం మాట్లాడినా పెద్ద ఎత్తున సంచలనం అవుతూ ఉంటాయి. ఇలా తన మాట తీరుతోనే వివాదాలకు ఆజ్యం పోసే వర్మ తాజాగా ఎన్టీఆర్ (NTR)హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోలుగా నటించిన వార్ 2(War 2) సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. యష్ రాజ్ ఫిలిమ్ యూనివర్స్ నుంచి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


జపాన్ వారితో ఫైటింగ్ ఎందుకు?

ఈ సినిమా విడుదలకు ముందు సినిమా పట్ల ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ విడుదల తర్వాత ఈ సినిమా అంచనాలను చేరుకోలేక పూర్తిగా నిరాశపరిచింది. ఇలాంటి తరుణంలోనే రాంగోపాల్ వర్మ ఈ సినిమా ఇలా ఫెయిల్యూర్ అవ్వడానికి గల కారణాలను తెలియజేస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ లోనే జపాన్ వారితో ఎందుకు ఫైట్ చేశారో అర్థం కాని విషయం. ఇలాంటి సీన్ ఎందుకు పెట్టారని తాను ఒకరిని అడిగాను. జపాన్ వాళ్లతో ఫైటింగ్ అనేది కొత్త కాన్సెప్ట్ లాగా ఉంటుందని పెట్టి ఉంటారు అంటూ సమాధానం చెప్పారు.


ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు అయాన్?

వార్ 2 అనేది ఒక స్పై సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పై సినిమా అంటే ఎప్పుడు కూడా ఇండియాకు శత్రుదేశాలతో యుద్ధం జరిగేలా చూపించాలి అయితే జపాన్ మనకు ఎప్పుడు శత్రుదేశం కాదు అలాంటిది జపాన్ వారితో హీరో ఫైట్ చేయడం ఏంటి? ఇంత చిన్న లాజిక్ డైరెక్టర్ ఎలా మిస్ అయ్యారు? కాన్సెప్ట్ కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటివి క్రియేట్ చేయటం వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ వార్ 2 అనుకున్న విధంగా సక్సెస్ కాకపోవడం గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఆల్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా తారక్…

ప్రస్తుతం వర్మ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వర్మ చెప్పింది కూడా నిజమే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ కు ఇటీవల బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి.. ఎన్టీఆర్ నటించిన మొదటి బాలీవుడ్ సినిమా కావడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి కానీ అనుకున్న స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అలాగే త్రివిక్రమ్ తో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ రెండు సినిమాలతో పాటు దేవర 2 కూడా రాబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: Daisy Shah: సౌత్ హీరోయిన్ల పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు.. ఆ పిచ్చి ఎక్కువ అంటూ!

Related News

Actress Meena: గీతాంజలి సినిమా మీనా చేయాల్సిందా.. అలా మిస్ చేసుకుందా?

Nithiin: లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తో నితిన్ మూవీ… అంతా తమ్ముడు ఎఫెక్ట్

Chiranjeevi: నూతన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను కలిసిన చిరంజీవి !

Sai Dharam Tej : అల్లు అర్జున్ గురించి సాయి తేజ్ లేటెస్ట్ కామెంట్స్, ఆయన ఇప్పుడు గొప్పోళ్ళు అయిపోయారు

Mowgli Release Date: మొగ్లీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ , క్రేజీ వీడియో

K- Ramp Trailer delay : ఈ దర్శక నిర్మాతలు మారరా, ప్రేక్షకులతో ఆడుకోవడమే పని అయిపోయిందా

Silambarasan TR: ఆ షార్ట్ ఫిలిం డైరెక్టర్ ని పట్టుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్, ఏకంగా శింబు తో సినిమా

‎Raviteja: ఆ డిజాస్టర్ సినిమాలంటే ఇష్టమన్న మాస్ హీరో..ఆ డౌట్ వస్తే సినిమా పోయినట్టేనా?

Big Stories

×