Aus Vs SA : ప్రస్తుతం సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రెండు మ్యాచ్ ల్లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే ఇవాళ నామమాత్రపు మ్యాచ్ 3వ వన్డేలో ఆస్ట్రేలియా జట్టు విరవిహారం చేసింది. 50 ఓవర్లలో ఏకంగా 431/2 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మార్ష్ లతో పాటు గ్రీన్ సెంచరీలతో చెలరేగారు. హెడ్ 103 బంతుల్లో 5 సిక్సర్లు, 17 ఫోర్లతో 142, గ్రీన్ 55 బంతుల్లో 8 సిక్సర్లు, 6 ఫోర్లతో 118 నాటౌట్. మార్ష్ 100 రన్స్ చేశారు. మఫాకా (6 ఓవర్లలో 73), ముల్డర్ (7 ఓవర్లలో 93) తో పాటు మిగతా సౌతాఫ్రికా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
Also Read : Sanju Samson : సంజూ శాంసన్ ది ఎంత గొప్ప మనసో… చిన్నారి అడిగిందని ఏకంగా అభిమానుల మధ్యలోకి వెళ్లి మరి
ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం
తొలి 2 వన్డేల్లో సౌతాఫ్రికా గెలిచింది. మెక్ కే వేదికగా సౌతాఫ్రికా తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి బంతి నుంచే సౌతాఫ్రికా బౌలర్ల పై విరుచుకుపడ్డారు. గ్రేట్ బారియర్ రీఫ్ అరీనాలో బౌండరీల వర్షం కురిపించారు. వీరిద్దరూ తొలి వికెట్ కి 250 పరుగుల భాగస్వామ్యం కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సీనియర్ ఆటగాళ్లు ఇద్దరూ సెంచరీలతో సత్తా చాటారు. హెడ్ కేవలం 103 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్ లతో 142 పరుగులు చేయగా.. మార్ష్ 106 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్ లతో 100 పరుగులు చేశాడు. అతనితో పాటు కామెరూన్ గ్రీన్ 55 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్ లతో 118 పరుగులు సెంచరీతో కదం తొక్కాడు. వీరి ముగ్గురి విధ్వంసం ఫలితంగా ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 431 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ లో సెంచరీలతో మెరిసిన కంగారూ జట్టు ఓపెనర్లు పలు అరుదైన రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు.
తొలి ఓపెనింగ్ జోడీగా రికార్డు..
వీటిలో ముఖ్యంగా వన్డేల్లో దక్షిణాఫ్రికా అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా హెడ్-మార్ష్ రికార్డులకెక్కాడు. ఇంతకు ముందు ఈ వరల్డ్ రికార్డు ఇంగ్లాండ్ ఆటగాళ్లు వి సోలంకి, మార్క్ ట్రెస్కోథిక్ పేరిట ఉండేది. వీరిద్దరూ 2003లో ఓవల్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో తొలి వికెట్ కి 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజా మ్యాచ్ తో 22 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డును హెడ్ – మార్ష్ బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికా పై ఒక వన్డే ఇన్నింగ్స్ లో సెంచరీలు చేసిన మూడో ఓపెనింగ్ జోడీగా మార్ష్-హెడ్ నిలిచారు. వీరిద్దరి కంటే ముందు సచిన్ టెండూల్కర్, సౌరబ్ గంగూలీ.. వీ సొలంకి, మార్క్ ట్రెస్కోథిక్ జోడీలు ఉన్నాయి. వన్డేల్లో సౌతాఫ్రికా పై ఆస్ట్రేలియా తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన మూడో ఆటగాడిగా ట్రావిస్ హెడ్ (142) నిలిచాడు. ఈ జాబితాలో ఆసిస్ మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2016లో కేప్ టౌన్ సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో వార్నర్ 173 పరుగులు చేసాడు.