Vishal 35 Title Teaser:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal) తాజాగా ‘విశాల్ 35’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దుషారా విజయన్ (Dushara vijayan) హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. అంజలి(Anjali ) కీలక పాత్ర పోషిస్తుంది. రవి అరసు తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాత ఆర్.బి చౌదరి సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. చెన్నైలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరగగా.. షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కాబోతోంది. ఈ మేరకు నటీనటులకు సంబంధించిన వివరాలను మేకర్స్ ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు.
విశాల్ 35 టైటిల్ టీజర్ రిలీజ్..
విశాల్ – రవి అరసు కాంబోలో రాబోతున్న మొదటి మూవీ అయినప్పటికీ కూడా.. ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ అభిమానులలో అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ను రిలీజ్ చేసి అభిమానులకు మంచి సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. తాజాగా టీజర్ చూస్తుంటే.. విశాల్ మరో సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లబోతున్నారు అని స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి ‘మగుడం’ అనే టైటిల్ ని తమిళ్ లో.. ‘మకుటం’ అనే టైటిల్ తో తెలుగులో విడుదల కాబోతున్నట్లు టీజర్ రిలీజ్ చేశారు.
టైటిల్ టీజర్ ఎలా ఉందంటే?
ఇక టైటిల్ టీజర్ విషయానికి వస్తే.. టీజర్ మొదలవగానే ముందుగా సముద్రంలోని చేపలను చూపించారు
. ఆ తర్వాత ఒక పెద్ద ఆక్టోపస్ చూపించారు. ఆ తర్వాత ఒక పీత పాకుకుంటూ షిప్ ఎక్కడం చూపించారు.. ఆ తర్వాత జనాలు అరుస్తూ ఉండగా మధ్యలో వైట్ అండ్ వైట్ లో విశాల్ అటు తిరిగి ఉండడం చూపించారు. ఇది చూసిన నెటిజన్స్ ఫేస్ కనిపించకపోయేసరికి కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఈ సినిమాతో మరొక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నట్లు ఫైనల్ గా రివీల్ చేశారు మేకర్స్. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
విశాల్ కెరియర్..
ఇక విశాల్ విషయానికి వస్తే .. ఇటీవలే ‘మదగజరాజా’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా అప్పుడే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ విడుదలకు నోచుకోలేదు. కానీ 12 ఏళ్ల తర్వాత కూడా విడుదలై సక్సెస్ సాధించింది అంటే.. కంటెంట్ ఉంటే ఎప్పుడైనా సినిమా సక్సెస్ అవుతుందని మరొకసారి నిరూపించింది ఈ సినిమా.
విశాల్ వ్యక్తిగత జీవితం..
ఇకపోతే గతంలో వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi) తో ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ వరలక్ష్మి శరత్ కుమార్ తండ్రి శరత్ కుమార్ (Sarath Kumar) తో విశాల్ కి విభేదాల ఉన్నాయని.. అందుకే వీరి పెళ్లి ఆగిపోయిందని కూడా ప్రచారం జరిగింది. అయితే అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు సాయి ధన్సిక (Sai Dhansika) తో పెళ్లికి సిద్ధం అయ్యారు. నడిగర్ సంఘం భవనం పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పిన విశాల్.. భవన నిర్మాణం పూర్తయింది. ఇక ఆ భవనంలో జరిగే తొలి పెళ్లి తనదేనని క్లారిటీ ఇచ్చారు.
ALSO READ:Arjun Das: ప్రేమలో పడ్డ అర్జున్ దాస్.. ఆమెను ఎలా పడేసారబ్బా!