BigTV English

Sanju Samson : సంజూ శాంసన్ ది ఎంత గొప్ప మనసో… చిన్నారి అడిగిందని ఏకంగా అభిమానుల మధ్యలోకి వెళ్లి మరి

Sanju Samson : సంజూ శాంసన్ ది ఎంత గొప్ప మనసో… చిన్నారి అడిగిందని ఏకంగా అభిమానుల మధ్యలోకి వెళ్లి మరి

Sanju Samson : టీమిండియా క్రికెటర్ సంజు శాంసన్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అతను టీ-20 ఇండియా జట్టులో ఆడుతున్నాడు. ఆసియా కప్ 2025కి కూడా సెలెక్ట్ అయ్యాడు.  రాజస్థాన్ రాయల్స్ జట్టుకి కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. 2012 అండర్ -19 ప్రపంచ కప్ లో భారత్ కి ప్రాతినిధ్యం వహించేందుకు శాంసన్ ని UAE కి పంపారు. అయితే అతను సెలెక్టర్లను మాత్రం నిరాశ పరచలేదు. భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఆ సమయంలో మూడు హాఫ్ సెంచరీుల చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. భారత్ సెమీ ఫైనల్ కి అర్హత సాధించలేదు. కానీ టోర్నమెంట్ మొత్తంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో 6వ స్థానంలో నిలిచాడు సంజు శాంసన్. ఇక ఆతరువాత ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున టీమిండియా తరపున ఆడాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ నుంచి వదిలిపెట్టాలని చూస్తున్నట్టు సమాచారం.


Also Read : Ipl 2026: కావ్య పాప బిగ్ స్కెచ్… ఏకంగా ఆ 4 గురు ప్లేయర్లపై వేటు.. లిస్టులో షమీ కూడా!

సంజు శాంసన్ సెల్ఫీ.. 


మరోవైపు సంజు శాంసన్ గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే..? ఓ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడిన శాంసన్ ఆట ముగించుకొని అటు సైడ్ నుంచి వెళ్తుంటే.. ఒక పాప సంజుశాంసన్ అని పిలిచింది. వెంటనే సంజు శాంసన్ ఆ పాప వద్దకు వెళ్లి పలుకరించాడు. అనంతరం ఆ పాపతో పాటు అక్కడ ఉన్న వారందరితో కలిసి ఓ సెల్పీ దిగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ఆడే జట్టులో ఎట్టకేలకు సంజూ శాంసన్ కి చోటు దక్కింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు ఈ కేరళ స్టార్ ను కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు.

శాంసన్ కి డేంజరేనా..? 

ఈ టోర్నీ ద్వారానే శుబ్ మన్ గిల్ అంతర్జాతీయ టీ-20లలో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అంతేకాదు.. ఏకంగా వైస్ కెప్టెన్ స్థాయిలో గిల్ జట్టులోకి వచ్చేశాడు. అతని గైర్హాజరీలో ఇన్నాళ్లూ ఓపెనర్ గా ఉన్న సంజు శాంసన్ కి ఇది తలనొప్పిగా మారింది. తొలి ప్రాధాన్య ఓపెనర్ గా అభిషేక్ శర్మకు పెద్ద పీట వేస్తామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ బహిరంగంగానే చెప్పేశాడు. దీంతో గిల్, యశస్వి జైస్వాల్ లేరు కాబట్టే సంజూను ఓపెనర్ గా పంపించామని అగార్కర్ గతంలో స్పష్టం చేశాడు. దీనిని బట్టి చూస్తే కేలం వికెట్ కీపర్ బ్యాటర్ గా మాత్రమే సంజూ శాంసన్ కి జట్టులో స్థానం ఇచ్చారన్నది స్పష్టమవుతోంది. కీపర్ కోటాలో జితిశ్ శర్మ కూడా ఉన్నందున సంజూ శాంసన్ పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సంజు శాంసన్ ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నట్టే అని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

?igsh=MW40M2kyZDl0M29mYg==

Related News

Sa vs Nam: టీ20 చ‌రిత్ర‌లో సంచ‌ల‌నం…దక్షిణాఫ్రికాపై నమీబియా సంచలన విజయం

AFG vs PAK: పాకిస్థాన్ కు షాక్ ఇచ్చిన అప్ఘానిస్తాన్…ద్వైపాక్షిక సిరీస్ లు ర‌ద్దు…షేక్ హ్యాండ్ లు కూడా ర‌ద్దు !

IND VS WI: 518-5 వ‌ద్ద‌ టీమిండియా డిక్లేర్డ్…గిల్ భయంక‌ర సెంచ‌రీ, WTCలో చ‌రిత్ర‌

Rohit Sharma Angry: 10 ఏళ్ల కుర్రాడిపై సెక్యూరిటీ దారుణం..కట్టలు తెంచుకున్న రోహిత్ శ‌ర్మ ఆగ్ర‌హం

Yashasvi Jaiswal Run Out: గిల్ సెల్ఫీష్‌, యశస్వి జైస్వాల్ ర‌నౌట్ పై వివాదం, నాటౌట్ అంటూ!

Eng-W vs SL-W: ఇవాళ శ్రీలంక వ‌ర్సెస్ ఇంగ్లాండ్ ఫైట్‌.. పాయింట్ల ప‌ట్టిక వివ‌రాలు ఇవే

Rohit Sharma Car: రోహిత్ శ‌ర్మ విధ్వంస‌ర బ్యాటింగ్‌..రూ.4.57 కోట్ల కారు ధ్వంసం

Hardik Pandya: ల‌వ‌ర్ ఫోటో లీక్ చేసిన హ‌ర్ధిక్ పాండ్యా…ఇంత‌కీ మహికా శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Big Stories

×