Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)పేరు మీద ఇప్పటికే ఎన్నో సరికొత్త రికార్డులు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవల కాలంలో బాలకృష్ణ వరుస అవార్డులను సొంతం చేసుకోవడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బాలకృష్ణ పద్మభూషణ్(Padma Bhushan) అవార్డును కూడా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఈయన నటించిన భగవంత్ కేసరి సినిమాకు గాను ఇటీవల జాతీయ అవార్డు రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే బాలకృష్ణ మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు…
బాలకృష్ణ నందమూరి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ సినీ ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేస్తున్నారు. దాదాపు 50 సంవత్సరాలు పాటు ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ మరోవైపు బసవతారకం హాస్పిటల్(Basavatarakam Hospitals) ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా గత 15 సంవత్సరాలుగా బాలయ్య బసవతారకం హాస్పిటల్ ద్వారా అందిస్తున్న సేవలను గుర్తిస్తూ యూకేలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ (UK Worlds Book of records Gold Edition)లో బాలయ్యకు చోటు లభించింది. అయితే ఇలాంటి గౌరవం అందుకున్న ఏకైక నటుడిగా బాలయ్య పేరు ఉండటం విశేషం. ఇప్పటివరకు దేశ సినీ చరిత్రలోనే ఇలాంటి గుర్తింపు ఏ నటుడికి లభించలేదు.
దేశ సినీ చరిత్రలోనే తొలి నటుడిగా…
ఇలా భారత దేశ సినీ చరిత్రలోనే ఇలాంటి రికార్డును బాలయ్య సొంతం చేసుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక బాలయ్యకు ఇలాంటి గుర్తింపు లభించడంతో ఆగస్టు 30వ తేదీ హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంలో ఎంతో ఘనంగా సత్కరించబోతున్నారు. ఈ విషయం తెలిసిన సినీ సెలబ్రిటీలు బాలకృష్ణకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక బాలయ్య కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన బోయపాటి శ్రీను(Boyapati Sreenu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ 2 (Akhanda 2)ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది.
హిందూపురం ఎమ్మెల్యేగా…
ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ విడుదల చేయాలని చిత్ర బృందం భావించారు కానీ అదే రోజున పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అఖండ 2 డిసెంబర్ నెలలో విడుదల కాబోతుందని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు నిర్మాతలు ఈ సినిమా విడుదల గురించి ఎక్కడ అధికారక ప్రకటన మాత్రం వెల్లడించలేదు. ఇలా ఒకవైపు సినీ నటుడుగా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా నిమగ్నమయ్యారు. అలాగే ఓ మంచి మనసున్న మనిషిగా బసవతారకం హాస్పిటల్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వర్తిస్తున్నారు.
Also Read: Ramgopal Varma: వార్ 2 పై వర్మ రివ్యూ… అందుకే సినిమాలు ఫెయిల్ అవుతున్నాయంటూ!