BigTV English

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

Big TV kissik talks : ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ బిగ్ టీవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల కొత్త ప్రోగ్రాంలను అందిస్తుంది. ఇప్పటివరకు ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న షోలన్నీ కూడా మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. అందులో ఒకటి కిస్సిక్ టాక్స్.. జబర్దస్త్ ద్వారా ఫేమ్ వర్ష ఈ షోకు యాంకర్ గా వ్యవహారిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ప్రసారం కాబోతోంది. ప్రతివారం పెద్ద ఎత్తున బుల్లితెర నటీనటులు సినీ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి డ్యాన్స్ మాస్టర్ పండు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న అనేక విషయాల గురించి పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఎపిసోడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..


శేఖర్ మాస్టర్ పై ట్రోల్స్..

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో స్టెప్పులు వేయించారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా సరే మరోవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ షో కి జడ్జిగా వ్యవహరించారు. ఎంతోమంది డాన్సర్లకు ఈయన సలహాలు ఇస్తూ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా కొనసాగేలా ప్రోత్సహించారు. అయితే తాజాగా ఈ మాస్టర్ గురించి పండు సంచలన విషయాలను బయటపెట్టారు.. శేఖర్ మాస్టర్ ప్రస్తావన గురించి వర్ష అడగ్గా.. పండు మాస్టర్ గురించి చెప్పారు. బయట మాస్టర్ అలాంటివాడు ఇలాంటి వాడు అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంత గొప్ప మనిషి. అంత పెద్ద మాస్టర్ అయ్యుండి కూడా మాకు ఎప్పుడు సలహాలు ఇస్తూ ఉండేవాడు. ఆయన మీద ట్రోల్స్ రావడం మాకు బాధగానే అనిపించింది కానీ వాటిపై రెస్పాండ్ అయితే మళ్లీ లేనిపోని సమస్యలు కొనితెచ్చిన వాళ్ళం అవుతామని సైలెంట్ గా ఉంటున్నాం అంటూ పండు అన్నారు. మాస్టరు డాన్సర్స్ అందరిని ఫ్రెండ్ చూస్తారు.. నాకు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ డాన్స్ మాస్టర్ అంటే శేఖర్ మాస్టర్ అని పండు అన్నాడు.


పండుకు ప్రదీప్ సాయం..

డాన్స్ మాస్టర్ పండు కెరియర్ పూల పాన్పు కాదు.. ఇప్పటికీ మాస్టర్ కి సొంత ఇల్లు కూడా లేదంటే చాలామంది నమ్మకపోవచ్చు. కానీ మాస్టర్ చెప్పిన విషయం ప్రకారం అయితే ఆయన ఇప్పటికీ రెంట్ కడుతూ తన తల్లిదండ్రులని సంతోషంగా చూసుకుంటున్నాడు.. అయితే ఒక సందర్భంలో మాస్టర్ తండ్రికి హాస్ట్రోక్ రావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు యాంకర్ ప్రదీప్ సాయం చేసినట్టు పండు మాస్టర్ బయటపెట్టారు. ప్రదీప్ అన్న లేకపోతే మా తండ్రిని ఈరోజు చూసుకునే వాళ్ళం కాదు అంటూ ఎమోషనల్ అయ్యాడు పండు.

Also Read: జీతాల పెంపు.. సినీ కార్మికులకు లేబర్ కమీషన్ పెట్టిన కండీషన్స్ ఇవే..!

పండు ఇప్పుడేం చేస్తున్నాడు..? 

పండు మాస్టర్ కొరియోగ్రాఫర్ గా, డాన్సర్ గా, ఈమధ్య బుల్లితెరపై నటుడిగా జబర్దస్త్ లో చేస్తున్నారు.. అటు సినిమాల్లో కూడా నటిస్తున్న విషయాన్ని పండు బయటపెట్టారు. డాన్సర్ గా మాత్రమే కాదు నటుడుగా కూడా తనలోని టాలెంట్ ని పరిచయం చేయాలని చూస్తున్నాడు.. అందుకే జబర్దస్త్ లో చేస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం ఢీ షో కారణంగా ఆ షోలో చేసేందుకు టైం లేదని కొద్ది రోజులు షోలో కనిపించలేనని పండు మాస్టర్ అంటున్నారు. మొత్తానికి పండు మాస్టర్ ఎపిసోడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైకి నవ్వుతూ నవ్వించే పండు మాస్టర్ జీవితంలో ఎన్ని కష్టాలు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×