Santhanam DD Next Level: తమిళ స్టార్ కమెడియన్ సంతానం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు స్టార్ హీరోలో సినిమాల్లో కమెడియన్గా నటించిన ఈయన ఈమధ్య వరుసగా సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలు మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ హీరో నటిస్తున్న డిడి నెక్స్ట్ లెవెల్ అనే సినిమా వివాదాలకు కేరాఫ్ గా మారింది. సినిమాలోని ఓ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దేవుడి మీద వచ్చే పాటను పేరడీగా పాడి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు అంటూ కొందరు హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ పాటను సినిమా నుంచి డిలీట్ చేయాలంటూ పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ప్రస్తుతం ఇది ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు కోలీవుడ్ మీడియా వర్గాల్లో ను హాట్ టాపిక్ అవుతుంది. అయితే తాజాగా బిగ్ టీవీ రాసిన కథనం మేరకు ఈ పాటను సినిమా నుంచి తొలగించినట్లు తెలుస్తుంది. అసలేం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం..
వివాదాస్పదంగా మారిన డిడి నెక్స్ట్ లెవెల్ సాంగ్..
తమిళ చిత్ర పరిశ్రమలో హాస్యనటుడిగా అరంగేట్రం చేసి ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నారు సంతానం. ఆయన నటిస్తున్న డిడి నెక్స్ట్ లెవెల్ అనే చిత్రం త్వరలో విడుదల కానుంది..ఈ క్రమంలో ఈ సినిమాను ఈ నెల 16న థియేటర్లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ నుంచి ఒక సాంగ్ ని చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. డిడి నెక్స్ట్ లెవెల్ చిత్రంలోని ఒక పాట తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని అవమానించేలా ఉందని హిందూ సంస్థలు ఆరోపించాయి.. అలాగే శ్రీనివాస గోవిందా పాటను తిరుపతి భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పాటను చిత్రం నుండి తొలగించాలని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి ప్రతిస్పందించిన సంతానం మీడియా తో మాట్లాడారు.. తిరుమలను అవమానించలేదని, సెన్సార్ బోర్డు నిబంధనల ప్రకారం చిత్రం నిర్మించబడిందని తెలిపారు. కానీ హిందూ సంఘాల డిమాండ్ ఎక్కువ పోవడంతో పాటుగా.. బిగ్ టీవీ రాసిన కథనం వల్లే చిత్ర యూనిట్ దిగొచ్చిందని తెలుస్తుంది. ఈ మూవీలోని పాటను తొలగించారని తెలుస్తుంది. అసలు విషయం ఏంటో ఒకసారి చూద్దాం..
బిగ్ టీవీ దెబ్బకు సాంగ్ డిలీట్..
సంతానం హీరోగా నటించిన డిడి నెక్స్ట్ లెవల్ మూవీలో హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద నామాలను పేరడీగా మార్చి సినిమాలో ఓ పాటని పాడారు. ఆ పాట కాస్త వ్యంగ్యంగా ఉండడంతో హిందువులు దేవుడు పాటని కించపరుస్తున్నారు అంటూ మండిపడ్డారు. తమిళనాడు తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని కొందరు హిందూ సంఘాలు ఆ సినిమాపై ఫిర్యాదులు చేశారు. అంతేకాదు తిరుపతిలో దీనిపై పెద్ద ఎత్తున నిరసన సెగ మొదలైంది. తాజాగా బిగ్ టీవీ నిరసన గురించి పూర్తి వివరాలను ప్రజలకు అందించింది. హిందూ సంఘాల డిమాండ్ ను చిత్ర యూనిట్కు అర్థమయ్యేలా చేసింది. ఆ పాటను సినిమాలో ఉంచడం వల్ల జరిగే నష్టం గురించి వివరించడంతో మేకర్స్ దెబ్బకు దిగొచ్చారు.. స్వామివారి నామాలను కించపరిచేలా సినిమాలో పాట ఉందంటూ వరుస కథనాలు ప్రసారం చేసిన బిగ్ టీవీ.. పాట తొలగించాలంటూ ఆందోళనకు బీజేపీ నేతలు, హిందూ సంఘాలు కలిసి తమిళనాడులో ఈ సినిమా నిర్మాతపై కేసు నమోదు చేశారు.. అయితే నిర్మాతకు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి నోటీసులు పంపించారు. ఇక ఈ వివాదం తీవ్రం కావడంతో సినిమా నుంచి సాంగ్ ని తొలగిస్తునట్లు ప్రకటన చేశారు.. మొత్తానికి ఈ వార్తను విన్న హిందువులు బిగ్ టీవీ చేసిన పనికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు..
బిగ్ టీవీ కథానాలకు దిగొచ్చిన DD Nextlevel సినిమా యూనిట్
సినిమాలోనుంచి శ్రీనివాసా గోవిందా అనే ర్యాప్ సాంగ్ ను తొలగిస్తునట్లు ప్రకటించిన చిత్ర బృందం
స్వామివారి నామాలను కించపరిచేలా సినిమాలో పాట ఉందంటూ వరుస కథనాలు ప్రసారం చేసిన బిగ్ టీవీ
పాట తొలగించాలంటూ ఆందోళనకు దిగిన బీజేపీ… pic.twitter.com/P8rrccNtLi
— BIG TV Breaking News (@bigtvtelugu) May 15, 2025