Boycott Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ అతి త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ టోర్నమెంట్ పునః ప్రారంభం అవుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో… ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును బైకాట్ చేయాలంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఆ జట్టు హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని… భారత పౌరులను అవమానించేలా వ్యవహరిస్తోందని నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Select Shreyas Iyer: అప్పుడు ధనశ్రీ, ఇప్పుడు చాహల్ కొత్త ప్రియురాలు.. అయ్యర్ పాడు పనులు ?
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై బాయ్ కాట్?
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై బైకాట్ విధించాలని నేటిజన్స్ అలాగే క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ జట్టులోకి బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్ ( Mustafizur Rahman ) వస్తున్న నేపథ్యంలో ఈ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. బంగ్లాదేశ్ దేశంలో ఇటీవల.. రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో అక్కడి ప్రధాని.. దేశం వదిలి పారిపోయింది. కోల్కత్తాకు వచ్చి తలదాచుకుంది. ఆ సమయంలో బంగ్లాదేశ్ లో అనేక అల్లర్లు జరిగాయి. ముస్లింలు ఎక్కువగా ఉన్న బంగ్లాదేశ్ లు… హిందువులపై దాడులు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇండియా కు సంబంధించిన హిందువులపై కూడా దాడులు జరిగాయి. చాలా కర్కశంగా అక్కడి బంగ్లాదేశ్ పౌరులు వ్యవహరించారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ ఏళ్ళు ఎవరూ కూడా ముందుకు వచ్చి పిలుపునివ్వలేదు. హిందువులను కాపాడలేదు. అయితే అలాంటి బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తీసుకోవడం దారుణమని ఫైర్ అవుతున్నారు క్రికెట్ అభిమానులు. హిందూ ద్రోహులను బయటకు పంపించాలని… వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై బాయ్ కాట్ విధించాలని.. రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఢిల్లీ జట్టులోకి వచ్చేసిన ముస్తాఫిజుర్ రహమాన్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన నేపథ్యంలో ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో విదేశీ ప్లేయర్లు అందరూ తమ సొంత దేశాలకు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో కొంతమంది ప్లేయర్లు ఇండియాకు రావడం జరుగుతుంది. అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాడు ప్రెషర్… తమ దేశానికి వెళ్లి.. ఇండియాకు రావడానికి ఇష్టపడడం లేదు. అయితే టెంపరరీ రీప్లేస్మెంటులో భాగంగా… ఈసారి ప్రెజర్ స్థానంలో ముస్తాఫిజుర్ రహమాన్ జట్టులోకి వస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ఆటగాడైన ముస్తాఫిజుర్ రహమాన్ పై ట్రోలింగ్ జరుగుతుంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును బాయ్ కాట్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: IPL Players: ఐపీఎల్ జట్లకు బంపర్ ఆఫర్.. ఇకపై టెంపరరీ రీప్లేస్మెంట్ లు.. కొత్త రూల్స్ ఇవే
Hindus are slaughtered in Bangladesh, After all the franchises boycotted bangladeshi players in ipl auction, Delhi Capitals has shamelessly signed Bangladeshi player Mustafizur Rahman now!
Hindus be united & boycott This Anti-National Franchise 🙏🏻 pic.twitter.com/BVtpSH0XOl
— Voice of Hindus (@Warlock_Shubh) May 14, 2025