Illu Illalu Pillalu Today Episode November 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం లేవగానే నర్మదా ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అయ్యి వంట గదిలోకి వస్తుంది. వేదవతి మౌనంగా వంటకి కట్ చేసుకుంటూ ఉంటుంది. నర్మదా ఏంటి అత్తయ్య మాట్లాడరా మీరు మొహం ముడుచుకుంటే మీ బుగ్గలు ఎర్రగా కందిపోతున్నాయి. మీరు మాట్లాడండి అక్కయ్య నేను నా ఉద్యోగాన్ని మాత్రమే చేసుకుంటున్నాను.. నా గురించి ఏమీ భయపడకండి అని నర్మదా అంటుంది. ఈ ప్లీస్ అత్తయ్య మీరు నాతో మాట్లాడుకున్న అంటే నాకు ఈ రోజు ఏదో ఒకటి జరుగుతుంది అని నర్మదా అంటుంది. ఎంత బ్రతిమిలాడిన సరే వేదవతి మాట్లాడదు నర్మదా అలానే ఆఫీస్ కి వెళ్ళిపోతుంది. అక్కడకు వెళ్లగానే ఓ వ్యక్తి వచ్చి ప్లాన్ ప్రకారమే నర్మదను లంచం తీసుకుంటుందని ఇరికించేస్తాడు. అది తెలుసుకున్న శ్రీవల్లి సంతోషంతో గంతులు వేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. లంచం తీసుకుంటు దొరికిపోయిందని తెలుసుకున్న శ్రీవల్లి ఆనందానికి అవదులు ఉండవు.. శ్రీవల్లి భాగ్యం బయటికి వచ్చి మరి నర్మదా అరెస్ట్ చేశారని డాన్సులు వేస్తూ ఉంటారు. చాలా సంతోషంగా ఉందమ్మా నర్మదా ఇన్ని రోజులు రెచ్చిపోయింది. ఇకమీదట నుంచి కుక్కిన పెనులాగా పడి ఉంటుంది అని శ్రీవల్లి అంటుంది. భద్రావతి సేన ఇద్దరు కూడా లంచం తీసుకుంటూ రిజిస్టర్ ఆఫీసర్ దొరికిపోయారు అని సంతోష పడుతూ ఉంటారు. మనతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. మన గురించి తెలిసి కూడా ఆ నర్మదా పులి లాగా రెచ్చిపోయింది. ఇప్పుడు మాత్రం మన పేరు వింటే భయపడుతుందిలే అక్క అని సేన అంటాడు. ఏ ఆఫీసరేనా మనకు కనుసైగలతో పని చేసి పెట్టాలి అలాంటిది మన ముందే తోకజాడిస్తుందా అని భద్ర అంటుంది.. ఇప్పుడు ఆ నర్మద మొహం ఎలా ఉందో చూడాలి రా అని భద్రావతి అంటుంది..
అప్పుడే అక్కడికి వచ్చిన నర్మదని చూసి భద్రావతి ఈ అవమానం తట్టుకోలేక ఎక్కడైనా పారిపోయిందేమో అనుకున్నాను. నిన్న మన ఆస్తులు చెప్తే చేసేటప్పుడు పులి లాగా లేడీ సింగం లాగా రెచ్చిపోయింది.. కానీ ఇప్పుడు మాత్రం ఇలా తోక తగిన సింహం లాగా వచ్చింది ఏంటి అని భద్రావతి కావాలని అవమానిస్తుంది.. నర్మద మాత్రం వాళ్ళ మాటలు విని మౌనంగా ఉంటుంది. ఇప్పటికైనా అర్థమైందా ? మాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అని భద్రావతి అంటుంది.. ఈవిడ చేసిన పనికి ఈవిడ మామా ఎలా తలెత్తుకుని బతుకుతాడో అని అవమానంగా మాట్లాడుతుంది.. నర్మదా సైలెంట్ గా లోపలికి వచ్చేస్తుంది..
అప్పటికే నర్మద కోసం ఇంట్లోనే వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఏమైంది ఏంటి అని అందరూ అడుగుతారు కానీ నర్మద మాత్రం ఏమీ చెప్పదు. సాగర్ నర్మదా నీ గురించి వచ్చిన న్యూస్ విని ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నాము ఏంటి అసలు మేటర్ అని అడుగుతాడు.. నర్మద మాత్రం మౌనంగా ఉంటుంది. వెళ్లి వాటర్ తాగి వస్తుంది. గదిలోకి వెళ్ళిపోతున్నాను నర్మదనే సాగర్ ఆపుతాడు. ఇంతమంది టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు వెళ్ళిపోతున్నావేంటి అసలు ఏం జరిగింది చెప్పు అని అడుగుతాడు.
నర్మదా మౌనంగా ఉండడం శ్రీవల్లి రెచ్చిపోతుంది.. ఇంకా అర్థం కాలేదా ఈవిడ గారి మౌనం వెనకాల ఇదే కారణం అని శ్రీవల్లి అంటుంది. లంచాలు తీసుకొని దొరికిపోయింది అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది అని అంటుంది. నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు.. ఇంటి పరువుని తీసేశావు.. అసలు లంచాలు ఎందుకు తీసుకున్నావు అని శ్రీవల్లి అడుగుతుంది. ఎంతగా నర్మదను మాట్లాడించడానికి శ్రీవల్లి ప్రయత్నించిన సరే నర్మద మాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. నువ్విలా లంచాలు తీసుకోవడం వల్ల మావయ్య గారు పరువు ఏమవుతుంది అద్దంకి పరువేమవుతుంది అని అవమానించేలా మాట్లాడుతుంది.. గవర్నమెంట్ ఉద్యోగం కదా అనే ఓ బిల్డప్ ఇచ్చేసావు. ఇప్పుడేంటి నువ్వు చేసింది ఇంట్లో అందరు పరువు తీసేసావు అని శ్రీవల్లి అంటుంది..
Also Read : మీనాక్షి పై అనుమానం.. నిజం తెలిసిపోతుందా..? చక్రధర్ కు టెన్షన్..
ఇంత మాట్లాడుతున్న సరే నువ్వేమీ మాట్లాడట్లేదు అని శ్రీవల్లి ఆయాస పడుతుంది. ఇప్పుడు నువ్వు హ్యాపీ నా సంతోషంగా ఉన్నావా అని నర్మదా అంటుంది. ఆ మాట వినగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. నువ్వు మాట్లాడటం అయిపోతే నాకు నిద్ర వస్తుంది నేను వెళ్లి పడుకుంటాను అని నర్మదా లోపలికి వెళ్ళిపోతుంది.. ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. నర్మదా ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటే.. వేదవతి అక్కడికి వచ్చి ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది.. అత్తయ్య కూడా నేను లంచం తీసుకున్నానని నమ్ముతుందేమో అని నర్మదా అనుకుంటుంది. నేను బాధపడతాను ప్రేమ బాధపడుతుందని నువ్వు మౌనంగా ఉన్నావు నిన్నను భరిస్తున్నావు అవసరం లేదు… తప్పేమీ లేనప్పుడు నువ్వు ఈ నిందని భరించాల్సిన అవసరం లేదు మా పుట్టింటి గురించి మర్చిపోయి నీ నిజాయితీ నేను నిరూపించుకో అని వేదవతి అంటుంది.. ఆ మాట విన్న నర్మదా చాలా సంతోషంగా ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..