Aishwarya Rai : బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకుంది.. గ్లామర్ క్వీన్ ఐసు ఈమధ్య సినిమాలలో కీలకపాత్రలో నటిస్తూ బిజీగా ఉంది. అంతే కాదు నిత్యం వార్తల్లో నిలుస్తూ హైలైట్ అవుతూ వస్తుంది. తాజాగా మరోసారి ఐశ్వర్యరాయ్ వార్తల్లో నిలిచింది.. పన్ను వివాదం విషయంలో ఆమె పేరు వినిపిస్తుంది.. ఈ విషయంపై కోర్టులో పిటిషన్ వేసిన ఐశ్వర్యరాయ్ కి ఊరట లభించినట్లు తెలుస్తుంది. ఈ పన్ను వివాదం ఏంటి? ఐశ్వర్య రాయ్ పన్ను కట్టకుండా తప్పించుకుంటుందా..? అసలు ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
ఆదాయాన్ని బట్టి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కి పన్ను కట్టాలన్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న హీరోలు పన్ను విషయంలో పలు జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. సినిమాల ద్వారా కోట్లు సంపాదిస్తున్న వాళ్లంతా కూడా కరెక్ట్ గా పన్ను కడుతూ ఇన్కమ్ టాక్స్ రైడ్ ల నుంచి ఉపశమనం పొందుతుంటారు. కేవలం హీరోలు మాత్రమే కాదు అటు హీరోయిన్లు కూడా తమ ఆస్తులకు సంబంధించిన పనులను కరెక్టుగా చెల్లిస్తుంటారు. కానీ ఐశ్వర్య రాయ్ మాత్రం పన్ను వివాదంలో ఇరుక్కున్నట్లు తెలుస్తుంది. ఈమె నాలుగు కోట్ల పన్ను కట్టాల్సింది.. అని అది కట్టలేదంటూ ఆరోపణలు వినిపించాయి. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తుంది. అయితే ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కు ఆదాయపు పన్ను శాఖతో ఉన్న వివాదంలో ఊరట లభించింది. సుమారు రూ.4 కోట్లకు పైగా ఉన్న పన్ను కేసులో ముంబై ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలుస్తుంది.
Also Read :నర్మదకు భద్ర స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంట్లో రచ్చ చేసిన శ్రీవల్లి..భాగ్యం దెబ్బకు ఆనందరావుకు షాక్..
నిజానికి ఇది రెండేళ్ల క్రితం ఫైల్ అవ్వాల్సింది. 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించినది. ఐశ్వర్య తన ఐటీ రిటర్న్స్‌లో తన మొత్తం ఆదాయాన్ని రూ.39.33 కోట్లుగా ప్రకటించింది.. కానీ ఆమె ఆదాయం 41 కోట్లకు పైగా ఉన్నట్లు తేలింది. ఐశ్వర్య రాయ్ పై అదనంగా రూ.4.11 కోట్ల పన్ను భారం పడింది.. ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ వద్ద సవాలు చేశారు. దీనిపై కోర్టులో పిటిషన్ కూడా వేసినట్లు తెలుస్తుంది.. ఇటీవలే విచారణ జరిపిన కోర్టు ఐశ్వర్యరాయ్ కి ఊరట కల్పించింది. ఐశ్వర్యరాయ్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే మరో విచారణ నవంబర్ రెండవ వారంలో ఉండబోతున్నట్లు సమాచారం. మొత్తానికైతే ఐశ్వర్యరాయ్ కి కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చిందని బాలీవుడ్ మీడియా వర్గాల్లో సమాచారం.. ఇకపోతే ఈమె ప్రస్తుతం కథకు డిమాండ్ ఉన్న పాత్రలు చేస్తూ బిజీగా ఉంది.. అంతేకాదు ఈమధ్య ఈమె తన భర్తతో విడాకులు తీసుకుందంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు కారణం వీరిద్దరూ సపరేట్గా ఈవెంట్లకు హాజరు కావడమే.. ఇటీవల తన భర్తతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసి ఆ రూమర్స్ కు చెక్ పెట్టేశారు.