Abhishek- Gill LV Bag: ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ చిట్ట చివరి టీ20 జరగనుంది. అయితే ఈ టి20 సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోనే అభిషేక్ శర్మ ఉన్నారు. ఆస్ట్రేలియా పిచ్ లపై కూడా అద్భుతంగా ఆడుతున్నాడు ఈ అభిషేక్ శర్మ. అయితే మ్యాచ్ గురించి పక్కకు పెడితే, ఆస్ట్రేలియాలో అభిషేక్ శర్మ వాడిన విలేజ్ LV బ్యాగులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పల్లెటూరులో జనాలు వాడే సంచులను లగేజీ బ్యాగు లాగా అభిషేక్ శర్మ ( Abhishek- Gill LV Bag ) ఇటీవల వాడారు. అయితే దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా మహిళలు కూడా ఆ బ్యాగులకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అభిషేక్ శర్మ వాడిన LV బ్యాగుల తరహాలోనే వచ్చిన వాటిని మహిళలు కొనుగోలు చేసి, వాడేస్తున్నారు.
Also Read: Cm Revanth Reddy: హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ స్టేడియం..ఆస్ట్రేలియా తరహాలో బౌన్సీ పిచ్ లు
అభిషేక్ శర్మ ( Abhishek Sharma) వాడిన LV బ్యాగులు ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లోకి వచ్చాయి. అందరూ ఆ సంచి లాంటి బ్యాగులనే కొనుగోలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలో మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా క్రికెట్ స్టేడియానికి కూడా అభిషేక్ శర్మ వాడిన LV బ్యాగులను కొనుగోలు చేశారు. అచ్చం అదే తరహాలో మార్కెట్ లో కూడా కొన్ని కంపెనీలు బ్యాగులను తీసుకువస్తున్నాయి. దీంతో యంగ్ లేడీస్ మొత్తం ఆ బ్యాగులను కొనుగోలు చేస్తున్నారు. ఇక ఆ బ్యాగులను స్టేడియానికి తీసుకువచ్చి అభిషేక్, అభిషేక్ అంటూ రచ్చ చేస్తున్నారు లేడీస్. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. అభిషేక్ శర్మతో పాటు ఇటీవల కాలంలో వైస్ కెప్టెన్ శుభమాన్ గిల్ కూడా వాటినే వాడుతున్నాడు. దీంతో జనాలు మొత్తం ఈ సంచుల కోసం ఎగబడుతున్నారు. వాటిని కొనుగోలు చేసి హ్యాండ్ బ్యాగులుగా వాడుతున్నారు.
నేడే టీమిండియా వర్సెస్ ఆసీస్ చివరి టీ20 మ్యాచ్ ( Australia vs India, 5th T20I ) జరుగనుంది. బ్రిస్బేన్ లోని ది గబ్బా ( The Gabba, Brisbane) వేదికగా మ్యాచ్ జరునుంది. ఎప్పటిలాగే, మధ్యాహ్నం 1.45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు కూడా వర్షం విలన్ గా మారే ప్రమాదం ఉంది. ఈ తరుణంలోనే, టాస్ చాలా కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు క్రీడా విశ్లేషకులు. ఇక ఇవాళ్టి మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే, 3-1 తేడాతో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది.
Shubman And Abhishek made these local bags branded 😭😭 #ShubmanGill #abhisheksharma pic.twitter.com/ewFJvORdUY
— 𝑆𝓃𝑒𝒽𝒶77🪞✨ (@xo_sneha77) November 7, 2025