యముడు తల పట్టుకుని ఈ శిరోభారం భరించలేను అంటూ కూర్చుని ఉండగా ఇంతలో ఆరు దేవకన్యలా వేషం వేసుకుని వస్తుంది. అది చూసిన గుప్త, యముడు షాక్ అవుతారు. తను మానవ కాంతయా..? లేక నిజంగా దేవకన్యనా..? అని యముడు అడగ్గానే.. నాకూ అటులనే అనిపిస్తుంది ప్రభు.. మనం నారదుల వారికి నిజం చెబితిమా..? అబద్దం చెబితిమా..? అవగతం అవ్వడం లేదు.. అని మాట్లాడుకుంటుండగానే.. ఆరు దగ్గరకు వెళ్లి రాజు గారు, గుప్త గారు ఈ గెటప్ ఎలా ఉంది అని అడుగుతుంది. దీంతో గుప్త అద్బుతం బాలిక.. అమోఘం.. ఇది వేషధారణ వలే లేదు.. అచ్చు దేవకన్యలా ఉన్నావు.. సాక్ష్యాత్తు ఆ దేవేంద్రుడి పుత్రిక ఇంద్రజ సైతం ఈర్ష పడేలా ఉన్నావు ఏడు ఏడు పద్నాలుగు లోకములలో నీకు సాటి ఎవ్వరూ లేరు అనుటలో అతిశయోక్తి లేదు.. అని పొగుడుతుంటే..
యముడు కోపంగా ఆపుము విచిత్రగుప్త నువ్వు నీ సోదరి ప్రేమ.. ఒక మానవ కాంతను మరీ అంతలా పొగడట ఇక్కడ అవసరం లేదు.. అని తిడుతుంటే.. ఆరు కల్పించుకుని ఏంటి రాజు గారు.. మీ ఇంద్రజ డాటర్‌కు నేను పోటీగా వచ్చానని మీ ఫీలింగా అని అడుగుతుంది. మాకు అలాంటి మనోభావాలు ఏమీయూ లేవు.. నువ్వు ఈ వేషధారణలోనే ఉండుము.. ఎవరైనా అడిగినచో.. నువ్వు ఇంద్రజవే అని చెప్పుకునుము అంటాడు యముడు.. దీంతో ఆరు అలాగే రాజు గారు నేను ఈ డ్రెస్ వేసుకుని మా లోకానికి వెళ్లే చాన్స్ ఏమైనా ఉందా..? అని అడగ్గానే.. నీకు ఆ సౌలభ్యం లేదు అంగుళీకము లేనిచో నువ్వు ఎచ్చటకు వెళ్లలేవు.. అని చెప్పగానే.. అయితే ఆ అంగుళీకము కొట్టేసే వెళ్తాను అని మనసులో అనుకుంటుంది ఆరు. ఇంతలో యముడు చిత్రవిచిత్ర గుప్త నీ అంగుళీయకము జాగ్రత్త.. అని చెప్పగానే.. అలాగే ప్రభు ఇటు చూడుము ప్రభూ.. ఈ బాలిక తస్కరించకుండా మా అంగుళీకమును మేము బంధించితిమి అని చెప్పగానే..
మేము కూడా మా అంగుళీకమును.. మా దేవి అంగుళీకమును జాగ్రత్తగా భద్రపరుచితిమి.. నువ్వు ఏ రకంగా తస్కరించలేవు బాలిక అని యముడు చెప్పగానే.. మీ రింగు లేకపోతే ఏంటి..? నారదుడు ఉన్నాడు కదా..? అతన్ని పట్టుకుని భూలోకం వెళ్లిపోతాను.. ఈ నారదుడు ఏంటి ఎప్పుడూ పిలవక ముందే వచ్చేవాడు.. ఇప్పుడేంటి రావడం లేదు అని మనసులో అనుకుంటుంటే.. యముడు వెళ్లిపోతాడు.. గుప్త మాత్రం ఏమిటి బాలిక నీ ముఖము చూస్తుంటే.. మనసులో ఏదో పథకము వేస్తున్నట్టు ఉన్నావు అని అడగ్గానే..
రింగు లేకుండా ఎలాగూ మా లోకమునకు వెళ్లలేను కదా..? మీ బాస్ చెప్పారు కదా.. గుప్త గారు అంటుంది ఆరు. అంగుళీకము లేకుండానే నువ్వు భూలోకం వెళ్లుటకు ఏదైనా పథక రచన చేయుచున్నావో అని మా అనుమనాం. బాలిక నీ మదిలో అటువంటి తలంపు ఏదైనా ఉన్నచో ముందుగా మాకు విన్నవించుము అని గుప్త చెప్పగానే.. ఆ అన్ని చెప్తారు మరి..? పోండి గుప్త గారు.. అంటూ ఆరు వెళ్లిపోతుంది. దీంతో గుప్త ఈ బాలికనే ఇంద్రజ అని నారద మునీంద్రల వారికి చెప్పి ఈ బాలిక భూలోకమునకు వెళ్లుటకు మేమే దారి చూపి మరీ ద్వారము తెరిచితిమా..? జగన్నాథ యమహో యమా.. అనుకుంటూ వెళ్లిపోతాడు గుప్త..
మరోవైపు బ్లాక్ మ్యాక్ సంబంధించిన పర్స్ ఒకటి తీసుకొచ్చి అమర్ ఇంట్లో పెడతాడు. అందులో ఏముందో చూద్దామని మిస్సమ్మ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో మిస్సమ్మ వాళ్ల అమ్మ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చూసి మిస్సమ్మ షాక్ అవుతుంది. అంటే ఇది నాన్న పర్స్ అంటే ఆ బ్లాక్ మ్యాన్ నాన్నేనా..? అని బాధపడుతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.