IND VS AUS 5th T20I: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 5th T20I ) మధ్య ఇవాళ చిట్ట చివరి టీ20 జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో రెండు జట్ల మధ్య 4 టీ20లు పూర్తయ్యాయి. ఇవాళ ఐదవ టీ20కి రెండు జట్లు సిద్ధమయ్యాయి. ఇవాళ టీమిండియా ఓడిపోతే సిరీస్ సమం కానుంది. అదే టీమిండియా విజయం సాధిస్తే, 3-1 తేడాతో టీ20 సిరీస్ కైవసం చేసుకుంటుంది సూర్య కుమార్ యాదవ్ సేన. దీంతో ఆస్ట్రేలియా చాలా కసిగా ఆడేందుకు సిద్ధమైంది.
Also Read: Cm Revanth Reddy: హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ స్టేడియం..ఆస్ట్రేలియా తరహాలో బౌన్సీ పిచ్ లు
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ జరగబోతున్న ఐదవ టి20 మ్యాచ్ బ్రిస్బేన్ లోని ది గబ్బా ( The Gabba, Brisbane) వేదికగా జరగనుంది. ఎప్పటి లాగే మధ్యాహ్నం 1:45 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.1:15 గంటల సమయంలో టాస్ ప్రక్రియ ఉంటుంది. జియో హాట్ స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ ను ఉచితంగానే తిలకించవచ్చు. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియాను ఒకే ఒక్క విషయం వణికిస్తోంది. గబ్బా వేదికగా 2006 నుంచి ఆస్ట్రేలియాకు ఒక్క ఓటమి లేదు. అన్ని మ్యాచ్ లలో విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టుకు గబ్బా స్టేడియం లక్కీగా మారింది. ఇదే విషయం టీమిండియాను టెన్షన్ పడుతోంది. అయితే గత రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన సూర్య కుమార్ యాదవ్ సేన.. ఇవాళ కూడా విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో ఇప్పటి వరకు సూర్య కుమార్ అలాగే గిల్ పెద్దగా మెరువలేదు. మొన్న నాలుగో టీ20 లో గిల్ 46 పరుగులు చేసినప్పటికీ నిలదొక్కుకోలేకపోయాడు. ఆస్ట్రేలియా బౌన్షి పిచ్ లు చూసి గజగజ వణికి పోతున్నాడు గిల్. రికార్డు సూర్య కుమార్ యాదవ్ కూడా పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. ఇవాల్టి మ్యాచ్ లో అయినా వీళ్ళు క్లిక్ అయితే బాగుంటుంది. లేకపోతే వీళ్ళపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ తొలగించే ఛాన్సులు కూడా ఉంటాయి.
ఆస్ట్రేలియా ప్రాబబుల్ XI: మిచ్ మార్ష్ (కెప్టెన్), మాట్ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (WK), గ్లెన్ మాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్, మిచ్ ఓవెన్/జోష్ ఫిలిప్, నాథన్ ఎల్లిస్, జేవియర్ బార్ట్‌లెట్, ఆడమ్ జంపా, మహ్లీ బార్డ్‌మాన్/బెన్ ద్వార్షియస్
ఇండియా ప్రాబబుల్ ఎలెవన్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా
Jasprit Bumrah is just 1️⃣ wicket away in T20Is from becoming the first Indian to take 💯 wickets across all formats 💥🏏#JaspritBumrah #IndianCricket #T20I #ODI #Test #Insidesport #CricketTwitter pic.twitter.com/f5xH8iVBMN
— InsideSport (@InsideSportIND) November 7, 2025