BigTV English

Tatkal Tickets: పే లేటర్, ఆటో పేలతో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడం ఎలా?

Tatkal Tickets: పే లేటర్, ఆటో పేలతో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడం ఎలా?

BIG TV LIVE Originals: రైల్వే ప్రయాణం చేయాలనుకునే ప్రయాణీకులు సాధారణంగా IRCTC ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటారు. బుకింగ్ విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు రైల్వే సంస్థ సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే డబ్బులు లేకపోయిన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఆటోపే, పే లేటర్ అప్షన్స్ ను అందిస్తున్నది. ఆటోపే, పే లేటర్ ఉపయోగించి రైలు టికెట్ బుక్ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి? ఈ విధానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


ఆటోపే: IRCTC iPay చెల్లింపు విధానం గేట్‌ వే ద్వారా అందుబాటులో ఉంది, ఆటోపే UPI, డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లకు సపోర్టు చేస్తుంది. ఈ విధానం ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే, టికెట్ కన్ఫార్మ్ అయిన తర్వాతే డబ్బులు కట్ అవుతాయి. టికెట్ వెయిట్‌లిస్ట్ చేయబడితే, కన్ఫార్మ్ కాకపోతే డబ్బులు కట్ కాకుండా కాపాడుతుంది.

పే లేటర్: ePaylater స్కీమ్ ద్వారా డబ్బులు లేకపోయినా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ డబ్బులను 14 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 14 రోజులు దాటితే వడ్డీ వసూళు చేయబడుతుంది.


ఆటోపే, పే లేటర్ తో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి? 

⦿ IRCTCలో నమోదు చేసుకోండి: ముందుగా IRCTC సైట్ ఓపెన్ చేయాలి. టికెట్ బుకింగ్ కోసం మీ ఇమెయిల్, మొబైల్ నంబర్‌ తో కన్ఫార్మ్ చేసుకోవాలి.

⦿ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి: IRCTCలో మీ బోర్డింగ్, డీ బోర్డింగ్ స్టేషన్లను సెలక్ట్ చేసుకోవాలి. ప్రయాణ తేదీని ఎంచుకోవాలి. జనరల్, తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్లలో ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలి.

⦿ రైలు, క్లాస్ ను సెలెక్ట్ చేసుకోండి: అందుబాటులో ఉన్న రైలును సెలెక్ట్ చేసుకోవాలి. మీ టికెట్ క్లాస్ ను ఎంచుకోవాలి. ఒక పీఎన్ఆర్ నెంబర్ మీద ఆరుగురు ప్రయాణించవచ్చు. తత్కాల్ టికెట్ లో నలుగురు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంటుంది.

⦿ ప్రయాణీకుల వివరాలను ఎంటర్ చేయండి: జర్నీ చేయాల్సిన ప్రయాణీకుల వివరాలను ఎంటర్ చేయాలి. ఇందుకోసం  మాస్టర్ లిస్ట్ ఫీచర్ ను ఉపయోగించుకోవడం మంచిది. బెర్త్ లను సెలక్ట్ చేసుకోవాలి.

⦿ ఆటోపే, పే లేటర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి: IRCTC iPay గేట్‌వేని ఎంచుకుని, ఆటోపే ఎంచుకోండి. UPI, డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లకు అందుబాటులో ఉంటుంది.  టికెట్ కు సంబంధించిన డబ్బులు కట్ కాకుండా తాత్కాలికంగా హోల్డ్ లో ఉంటాయి. టికెట్ కన్ఫార్మ్ అయితే, డబ్బులు డెబిట్ అవుతాయి. టికెట్ బుకింగ్ కోసం పే లేటర్ ను ఎంచుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకున్నాక 14 రోజుల వరకు డబ్బులు పే చేసే అవకాశం ఉంటుంది. ఆటోపే కోసం UPI వివరాలు ఎంటర్ చేయాలి. OTP ద్వారా కన్ఫార్మ్ చేయాలి. పే లేటర్ కు సంబంధించి కూడా  OTP ద్వారా కన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది.

⦿ ఈ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: బుకింగ్ కన్ఫార్మ్ అయిన తర్వాత.. మై బుకింగ్ లోకి వెళ్లి ఈ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ స్కీమ్స్ తత్కాల్ టికెట్లకు వాడుకోవచ్చా?      

ఆటోపే, పే లేటర్‌ పథకాలను తత్కాల్ టికెట్లకు ఉపయోగించుకోవచ్చు. తత్కాల్ బుకింగ్స్ అనేవి నిమిషాల్లోనే అయిపోతాయి కాబట్టి, చాలా మంది వీటిని వినియోగించుకునేందుకు ఎక్కువగా ఇష్టపడరు. ఈ స్కీమ్ ఉపయోగించుకోవడానికి థర్డ్ పార్టీ సైట్ వెళ్తుంది. టైమ్ ఎక్కువగా తీసుకుంటుంది. బుకింగ్ ప్రక్రియను లేట్ అవుతుంది.  టికెట్లు అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువ మంది UPI, డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు, IRCTC iPay ద్వారా తత్కాల్ టికెట్లను బుక్ చేసుకుంటారు. ఒకవేళ మీ నెట్ స్పీడ్ గా ఉంటే, వేగంగా టికెట్ బుక్ చేసుకోగలం అనుకుంటే ట్రై చేయొచ్చు. తత్కాల్ టికెట్లు ప్రయాణానికి ఒక్క రోజు ముందు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. AC క్లాస్ లకు ఉదయం10:00 గంటలకు, నాన్ AC క్లాస్ లకు ఉదయం 11:00 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది. తత్కాల్‌కు ఆటోపే సపోర్టు చేస్తుంది. కన్ఫార్మ్ టికెట్లకు మాత్రమే డబ్బులు కట్ అవుతాయి.

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.

Read Also:  ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉన్న ఏకైక రాష్ట్రం, అక్కడికి వెళ్లాలంటే అంత ఈజీ కాదు!

Related News

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Big Stories

×