BigTV English

Colombia Junk Food : జంక్ ఫుడ్ తింటే పన్ను.. ఆ దేశంలో కఠిన చట్టం

Colombia Junk Food : ల్యాటిన్ అమెరికా దేశమైన కొలంబియా.. తన పౌరుల ఆరోగ్య పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు ఓ కఠిన చట్టం తీసుకువచ్చింది. ప్రజల ఆహార అలవాట్లు, జీవనశైలిని మెరుగుపరిచేందుకు జంక్ ఫుడ్ చట్టం పేరిట ఒక విధమైన ఆరోగ్య పన్ను విధించింది. ఇలాంటి చట్టం అమలుపరుస్తున్న దేశం కొలంబియా.

Colombia Junk Food : జంక్ ఫుడ్ తింటే పన్ను.. ఆ దేశంలో కఠిన చట్టం

Colombia Junk Food : ల్యాటిన్ అమెరికా దేశమైన కొలంబియా.. తన పౌరుల ఆరోగ్య పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు ఓ కఠిన చట్టం తీసుకువచ్చింది. ప్రజల ఆహార అలవాట్లు, జీవనశైలిని మెరుగుపరిచేందుకు జంక్ ఫుడ్ చట్టం పేరిట ఒక విధమైన ఆరోగ్య పన్ను విధించింది. ఇలాంటి చట్టం అమలుపరుస్తున్న దేశం కొలంబియా.


ఈ చట్టంలో భాగంగా అల్ట్రా ప్రాసెస్ట్ ఫుడ్స్(బర్గర్స్, పిజ్జా), సుగరీ సాఫ్ట్ డ్రింక్స్ పై కొలంబియా ప్రభుత్వం ఆరోగ్య పన్ను విధించింది. దేశంలో ఈ ఆహారం వల్ల ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు ప్రజలలో అధిక స్థాయిలో ఉండడంతో ఈ చట్టం తీసుకొచ్చామిన ప్రభుత్వాధికారులు తెలిపారు. ఈ పన్ను ప్రస్తుతం జంక్ ఫుడ్ ఐటెమ్స్‌, షుగర్ డ్రింక్స్‌పై 10 శాతం ఉంది. ఆ తరువాత క్రమంగా 15 శాతం, 20 శాతం వరకు పెంచుతామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఈ పన్ను ముఖ్యంగా.. రెడీ టు ఈట్(ఫాస్ట్ ఫుడ్స్, బర్గర్స్, పిజ్జా,), ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం, శాచురేటెడ్ ఫ్యాట్ కోల్డ్ కట్స్, చాక్లెట్లు, సోడా కలిపిన డ్రింక్స్, వంటి ఫుడ్ ఐటిమ్స్‌పై అధికంగా ఉంటుంది. అలాగే మాల్ట్ బెవెరేజెస్, ఫ్రూట్ జ్యూస్, టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, ఫ్లేవర్డ్ వాటర్ వంటి ఐటెమ్స్ పై షుగర్(చక్కెర) స్థాయిని బట్టి పన్ను ఉంటుంది. షుగర్ తక్కువ ఉంటే పన్ను కూడా తక్కువ ఉంటుంది.


ఒక సర్వే ప్రకారం కొలంబియా జనాభాలో 56.4 శాతం ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఈ దేశ పౌరులు అధిక మోతాదులో ఉప్పు తినడం వల్ల వారికి పక్షవాతం, గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే షుగర్ డ్రింక్స్ తాగడం వల్ల డయాబెటీస్ బారిన పడుతున్నారు.

ఒత్తిడి, నిద్రలేమి లాంటి సమస్యలున్నవారే ఎక్కువగా జంక్ ఫుడ్ తింటున్నారని సర్వేలో తేలింది. అయితే జంక్ ఫుడ్ అనేదా వారానికి ఓసారి తీసుకోవచ్చిన ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related News

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

Big Stories

×