Space Nuclear: మన మొబైల్ పనిచేయాలన్నా.. ఇంటర్నెట్ పని చేయాలన్నా GPS, వెదర్ రిపోర్ట్.. ఇలా మన డెయిలీ లైఫ్‌కి కావాల్సిన చాలా గ్యాడ్జెట్స్ పని చేయాలంటే స్పేస్‌లో నాన్‌స్టాప్‌గా తిరుగుతున్న వేలాది సాటిలైట్స్ కావాలి. అలాంటి స్పేస్‌లో న్యూక్లియర్ బాంబు పేలితే పరిస్థితి ఏంటి? భూమిపై అణుబాంబు పడితే ఎంత విధ్వంసం జరుగుతుందో మనకు తెలుసు. కానీ అంతరిక్షంలో అణుబాంబు పేలితే జరిగే నష్టం అంతకంటే భిన్నంగా, ఎక్కువగా ఉండొచ్చు. అలాంటి ప్రయోగానికి ఇప్పుడు రష్యా రెడీ అవుతుందనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అసలు రష్యా ప్లాన్ ఏంటి? స్పేస్‌లో న్యూక్లియర్ బాంబు పేలితే మన జీవితాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
రష్యా ఇప్పుడు స్పేస్‌లో న్యూక్లియర్ బాంబును పేల్చబోతుంది. ఇది నేను చెబుతున్న మాట కాదు. ఈ విషయాన్ని జర్మనీకి చెందిన కొన్ని మీడియా ఏజెన్సీలు తెగ ప్రచారం చేస్తున్నాయి. ఈ ఏజెన్సీలు చెబుతున్న దాని ప్రకారం రష్యా కొన్ని సంవత్సరాల క్రితమే స్పుత్నిక్-S పేరుతో అణ్వాయుధ సామర్థ్యం కలిగిన సాటిలైట్‌ను రెడీ చేసిందని అది మాస్కో ప్రాంతంలో ఉంది అని చెబుతున్నాయి. ఈ సాటిలైట్‌ను ఈ ఏడాదిలోనే లేదా వచ్చే జనవరిలో స్పేస్‌లోకి పంపే అవకాశం ఉందని అంటున్నాయి. జర్మనీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ విషయాన్ని తెలుసుకున్నాయని ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు చెబుతున్నాయి.
ఇది జర్మనీ న్యూస్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మాములుగా న్యూక్లియర్ బాంబ్ పేలితే పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిల పరిస్థితి ఎలా మారింది? అవి కోలుకోవడానికి ఎన్ని ఏళ్లు పట్టింది? ఇలా అన్నింటి గురించి చూశాం.. విన్నాం. మరి అదే న్యూక్లియర్ బాంబ్ స్పేస్‌లో పేలితే..? నిజానికి అంతరిక్షంలో వాతావరణం ఉండదు. అందుకే భూమిపై కనిపించే మష్రూమ్ క్లౌడ్ అక్కడ ఏర్పడదు. మరి అక్కడ ఏం జరుగుతుంది? న్యూక్లియర్ బాంబ్ పేలిన తర్వాత ఆ బాంబు నుంచి వెలువడే ఎక్స్‌రేలు, ఇతర రేడియేషన్ ఎఫెక్ట్ చుట్టుపక్కల ఉన్న సాటిలైట్లను దెబ్బతీస్తుంది. కొన్ని సాటిలైట్స్ వెంటనే పనిచేయడం ఆపేయవచ్చు. మరికొన్ని సాటిలైట్స్ లైఫ్ టైమ్ తగ్గిపోతుంది. అంతేకాదు.. ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా ఉంది.
Also Read: అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఏడుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు
ఈ పేలుడు కారణంగా వెలువడే అధిక శక్తి కలిగిన రేడియేషన్ కణాలు భూమి చుట్టూ తిరుగుతూ ఒక ఆర్టిఫిషియల్ రేడియేషన్ బెల్ట్‌ను క్రియేట్ చేస్తాయి. దీంతో ఆ ఏరియాలో తిరుగుతున్న సాటిలైట్లు నెలలు, సంవత్సరాల పాటు రేడియేషన్ ఇంపాక్ట్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే ఒక్కసారి జరిగే పేలుడు ఇంపాక్ట్ స్పేస్‌లో చాలా కాలం కొనసాగవచ్చు. ఇది కేవలం ఇమాజినేషన్ చేసి చెబుతున్న మాటలు కావు. గతంలో ఇలాంటి ప్రయోగం జరిగింది. 1962లో అమెరికా స్టార్‌ఫిష్ ప్రైమ్ పేరుతో భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో థర్మోన్యూక్లియర్ బాంబును పేల్చింది. అప్పుడు స్పేస్‌లో ఇప్పటిలా వేలాది శాటిలైట్లు లేవు. అయినప్పటికీ ఆ పేలుడు ప్రభావంతో టెల్‌స్టార్-1, ఏరియల్-1 వంటి సాటిలైట్స్ లైఫ్‌టైమ్ తగ్గిపోయింది. ఫోన్ కాల్స్‌కు డిస్ట్రబ్ అయ్యాయి. అంతేకాదు. ఆకాశంలో రంగురంగుల కాంతులు కూడా కనిపించాయి. అంటే 1962లోనే ఇలాంటి ప్రభావాలు కనిపిస్తే ఇప్పుడు వేలాది సాటిలైట్లు ఉన్న ఈ టైమ్‌లో ఇంపాక్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహిస్తేనే భయమేస్తుంది.
ప్రస్తుతం భూమికి దగ్గరగా ఉండే లో ఎర్త్ ఆర్బిట్‌లో దాదాపు 17 వేల సాటిలైట్లు ఉన్నాయి. వీటిలో వెదర్‌ను స్టడీ చేసేవి మారుతున్న వాతావరణాన్ని స్టడీ చేసేవి డిఫెన్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సాటిలైట్స్‌తో పాటు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్లు కూడా ఉన్నాయి. వీటిలో చాలా కొన్ని సాటిలైట్స్ దెబ్బతిన్నా ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కొన్ని రక్షణ సంబంధిత సేవలకు తీవ్ర అంతరాయం కలగవచ్చు. అయితే అన్ని సాటిలైట్స్ ఒకేసారి పనిచేయడం ఆగిపోతాయని కాదు. ఈ ప్రభావం పేలుడు జరిగిన ప్రదేశం, ఎత్తు, రేడియేషన్ తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే టీవీ ప్రసారాలు, GPS, ఇతర కమ్యూనికేషన్ సేవలకు ఉపయోగించే కొన్ని ఉపగ్రహాలు ఇంకా ఎత్తైన కక్ష్యల్లో ఉంటాయి. కాబట్టి వాటిపై ప్రభావం ఒకేలా ఉండకపోవచ్చు.
అయితే రష్యా నిజంగానే అంతరిక్షంలో అణుబాంబు పేల్చే సాహసం చేస్తుందా? అనేది అసలు డౌట్. ఎందుకీ డౌట్ అంటే.. అసలు వెస్ట్రన్ కంట్రీస్ చెబుతున్నట్టు రష్యా నిజంగానే న్యూక్లియర్ సాటిలైట్‌ను రెడీ చేసిందా? లేదా? అనేది ఫస్ట్ డౌట్. ఎందుకంటే చాలా ఏళ్లుగా వెస్ట్రన్ కంట్రీస్.. మీడియాను ఉపయోగించుకొని తమకు నచ్చని దేశాలపై ఒక పద్ధతి ప్రకారం విష ప్రచారం చేస్తూ వస్తున్నాయి. ఇది చరిత్ర చెబుతున్న నిజం. ఈసారి కూడా అలానే మిస్ లీడ్ చేసే పని చేశాయా? అనే చర్చ అయితే ఉంది.
Also Read: 37 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి!
నిజంగా స్పేస్‌లో న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగితే అమెరికా, యూరప్ సాటిలైట్స్ మాత్రమే కాదు. రష్యా సొంత సాటిలైట్స్, చైనా, ఇండియా సాటిలైట్స్ కూడా దెబ్బతీనవచ్చు. సో అలాంటి పిచ్చి పని చేసే అవకాశాలు లేవు. ఇక అత్యంత ముఖ్యమైన డౌట్ ఏంటంటే.. ఇలా చేస్తే ప్రపంచ దేశాలు యుద్ధ చర్యగా పరిగణించే ప్రమాదం ఉంది. అది మూడో ప్రపంచ యుద్ధానికి ముహూర్తం పెట్టినట్టే అవుతుంది. అందుకే ఇక్కడ కొందరు ప్రపంచాన్ని మిస్ లీడ్ అయినా చేస్తుండాలి..? లేదా రష్యా వ్యూహాత్మకంగా ఇలాంటి లీక్‌లను ఇస్తూ భయపెడుతూ అయినా ఉండాలి.
ఏదేమైనా అంతరిక్షంలో న్యూక్లియర్ బాంబ్ ప్రయోగం అనేది ఒక్క దేశానికి సంబంధించిన సమస్య కాదు. ప్రపంచం మొత్తం ఎదుర్కోవాల్సిన ముప్పు. భూమిపై యుద్ధం జరిగితే కొన్ని ప్రాంతాలు నష్టపోవచ్చు. కానీ అంతరిక్షంలో జరిగే ఇలాంటి పేలుడు ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిపై పడే అవకాశం ఉంది. మరి రష్యా నిజంగానే ఈ ప్రయోగం చేస్తుందా? లేక ఇదంతా మరో వ్యూహాత్మక హెచ్చరిక మాత్రమేనా?
ఒక్క అణుబాంబు పేలుడు దెబ్బకు వేలాది సాటిలైట్లు పనిచేయడం ఆగిపోతే? ఇంటర్నెట్, GPS, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతింటే? వినడానికి సినిమా కథలా ఉంది కదా. కానీ ఇప్పుడు రష్యా విషయంలో ఇలాంటి ఆందోళనలే వ్యక్తమవుతున్నాయి. జర్మనీ మీడియాలో ఇప్పుడు ఈ ప్రచారం జరుగుతోంది. రష్యా స్పుత్నిక్-S పేరుతో అణ్వాయుధ సామర్థ్యం ఉన్న సాటిలైట్‌ను రెడీ చేసినట్లు వెస్ట్రన్ దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయట. ఈ సాటిలైట్‌ను ఈ ఏడాది చివరలో లేదా జనవరీలో అంతరిక్షంలోకి పంపే అవకాశం ఉందంటున్నాయి. మరి వారు చెప్పినట్టు అంతరిక్షంలో అణుబాంబు పేలితే ఏం జరుగుతుంది? భూమిపై అణుబాంబు పేలినప్పుడు కనిపించే భారీ పొగ మేఘం అక్కడ ఉండదు. కానీ విడుదలయ్యే రేడియేషన్ చుట్టుపక్కల ఉన్న ఉపగ్రహాలను దెబ్బతీస్తుంది. దీని ప్రభావంతో స్టార్‌లింక్ వంటి ఇంటర్నెట్ శాటిలైట్లు, వెదర్ రీసెర్చ్ సాటిలైట్స్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
1962లో అమెరికా అంతరిక్షంలో అణు పరీక్ష నిర్వహించినప్పుడు కూడా ఉపగ్రహాలు దెబ్బతిన్నాయి. ఆ ప్రభావం కొన్నేళ్లపాటు కొనసాగింది. అయితే రష్యా నిజంగానే ఈ ప్రయోగం చేస్తుందా? లేదా? అనేది ఇప్పటికైతే డౌటే. ఒకవేళ జరిగితే మాత్రం.. అది ఒక్క దేశానికి కాదు, ప్రపంచానికే ముప్పుగా మారవచ్చు.
Also Read: అండమాన్ కాలాపాని జైలును తలపించే మరో జైలు.. తెలంగాణలో ఎక్కడుందో తెలుసా?