BigTV English

Cyanide-Hamas : రసాయన ఆయుధాలపై హమాస్ కన్ను? ఇజ్రాయెల్ కు కీలక సమాచారం లభ్యం..

Cyanide-Hamas : రసాయన ఆయుధాలపై హమాస్ కన్ను? ఇజ్రాయెల్ కు కీలక సమాచారం లభ్యం..
Cyanide-Hamas

Cyanide-Hamas : రసాయన ఆయుధాల తయారీపై హమాస్ దృష్టి సారించిందా? అక్టోబర్ 7 నాటి దాడుల్లో ఇజ్రాయెలీలపై ప్రయోగించాలని వ్యూహం పన్నిందా? అంటే అవుననే అంటున్నాయి ఇజ్రాయెల్ రహస్య కేబుళ్లు. ఆ దేశ విదేశాంగ శాఖ రహస్య కేబుల్ ప్రకారం.. సైనేడ్‌తో ఆయుధాలను ఎలా తయారు చేయాలో వివరిస్తూ ఓ మాన్యువల్‌ను హమాస్ రూపొందించింది. తయారీకి అనుసరించాల్సిన సూచనలు ఆ మాన్యువల్‌లో పొందుపర్చి ఉన్నాయి.


దాడుల్లో మరణించిన ఓ మిలిటెంట్ వద్ద లభించిన యూఎస్‌బీ డివైజ్ ద్వారా ఆ మాన్యువల్ గురించిన సమాచారం ఇజ్రాయెల్‌ చేతులకు చిక్కింది. అయితే రసాయన ఆయుధాలను తయారు చేయాలన్న ఆదేశాలను హమాస్ అగ్రనేతలు ఇచ్చారా? లేదా? అన్న విషయం మాత్రం నిర్థారణ కాలేదు. సైనేడ్ ను వెదజల్లే ఆయుధాల తయారీపై హమాస్ రూపొందించిన మాన్యువల్.. 2003 నాటి అల్ కాయిదా మాన్యువల్‌నే పోలి ఉంది.

దీంతో రసాయన ఆయుధాల తయారీలో హమాస్ ఆసక్తి చూపుతున్న విషయాన్ని ఇజ్రాయెల్ అమెరికా సహా అన్ని దేశాల ఎంబసీలకు వర్తమానం పంపింది. పౌరులపై ఉగ్రదాడుల సందర్భంగా రసాయన ఆయుధాలను ప్రయోగించాలన్నది హమాస్ వ్యూహంగా కనిపిస్తోందని ఆ కేబుల్ సందేశంలో అనుమానం వ్యక్తం చేసింది.


శరీరవ్యవస్థపై దాడి చేసేందుకు రసాయన పదార్థాలు, విష పదార్థాలతో ఆయుధాలు తయారు చేస్తారు. సైనేడ్ సహా ఎన్నో విషపదార్థాలను రసాయన ఆయుధాల కోసం వినియోగిస్తారు. ఊపిరి ఆడకుండా చేసే ఫాస్జీన్ లాంటి పదార్థాలు ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేస్తాయి. మస్టర్డ్ గ్యాస్ అయితే శరీరంపై పొక్కులు వచ్చేలా చేస్తుంది. ఫలితంగా చర్మం కాలడం, కంటిచూపు కోల్పోవడం జరగొచ్చు.

వీటన్నింటికంటే ప్రాణాంతకమైనవి నెర్వ్ ఏజెంట్స్. అవి శరీరంలోని కండరాలకు మెదడు పంపే సందేశాలను అడ్డుకుంటాయి. 0.5 మిల్లీ గ్రాము వీఎక్స్ నెర్వ్ ఏజెంట్ ఏకంగా ఒక వ్యక్తి ప్రాణాన్నే తీయగలదు. యుద్ధ సమయాల్లో ఫిరంగి గుండ్లు, బాంబులు, క్షిపణుల్లో ఈ రసాయన పదార్థాలను నింపి ప్రయోగించే ప్రమాదం ఉంది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×