Iran Vs America: పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? ఇరాన్ యుద్ధానికి ఫుల్‌స్టాప్ పడినట్టేనా? ఈ నేపథ్యంలో ఇరాన్-అమెరికా మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చుతోందా? ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక తర్వాత ఆ దేశం ఎలా రియాక్ట్ అయ్యింది? తమపై దాడి చేస్తే.. తాము సిద్ధమేనని ఇరాన్ ఎందుకు అంటోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
పశ్చిమాసియాలో యుద్ధం మేఘాలు.. ఇరాన్ -అమెరికా మధ్య మాటలయుద్ధం
ఇరాన్-అమెరికాలు మరోసారి శాంతి చర్చలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం క్రమంగా పెరుగుతోంది. అమెరికా దిగ్బంధనంతో హార్ముజ్ జలసంధి తెరిచి ఉండచం సాధ్యంకాదని, అందుకు ఈ రూట్‌ని మూసి వేసే అవకాశముందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బాఘర్ గాలిబాఫ్ తేల్చిచెప్పారు.
ఇరాన్ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యారు. జలసంధి విషయంలో మాట మార్చడం, బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించొద్దని ఆదేశాన్ని హెచ్చరించారు. వైట్‌హౌస్‌లో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్‌తో సంప్రదింపులు కొనసాగుతున్నట్లు చెప్పారు. అనేక ఏళ్లుగా ఇదే వ్యవహారం జరుగుతోందన్నారు. ఈ విషయంలో తమను బ్లాక్‌మెయిల్ చేయలేరన్నారు.
ట్రంప్ వార్నింగ్‌పై ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యింది. అమెరికా వద్ద ధనం, సైనిక శక్తి, అధునాతన ఆయుధాలు ఉండవచ్చని, వనరులు ఉన్నంత మాత్రాన యుద్ధంలో గెలవలేరన్నారు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బాఘర్ గాలిబాఫ్. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తమపై దాడికి ప్రయత్నిస్తే అది శత్రువుల జీవితంలో పెద్ద తప్పు అవుతుందన్నారు.
తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఎవరిపైనా దాడి చేయబోమని కానీ తమ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే మాత్రం ప్రతిస్పందన తప్పదని తేల్చిచెప్పారు. కీలక ప్రాంతాల్లో క్షిపణి వ్యవస్థలను మోహరించినట్టు తెలిపారు. యుద్ధంలో ఇరాన్ పైచేయి చూసి అమెరికా భయపడి ఒప్పందానికి వచ్చింద్నారు.
ALSO READ: హర్మూజ్ జలసంధిలో ఉద్రికత్త.. భారత నౌకలపై ఇరాన్ దాడి
ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో మధ్యవర్తుల ద్వారా విజ్ఞప్తులు పంపుతున్నారంటూ కామెంట్స్ చేశారు. తమ దేశాన్ని బలహీనపరచాలని పన్నిన వ్యూహాలు బెడిసికొట్టాయని, అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు తమ దేశ ప్రజల దేశభక్తిని, సైనిక వ్యూహాలను అంచనా వేయడంలో విఫలమయ్యాయని అన్నారు. ఇరాన్‌లో పాలన మార్పు తీసుకురావాలని ట్రంప్ కలలు కంటున్నారని, ఇరాన్ గడ్డపై ట్రంప్ ఆటలు సాగవన్నారు.
ఇరాన్ అంటే వెనిజులా కాదని శత్రువుల బెదిరింపులకు లొంగిపోయేది లేదన్నారు. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధిస్తున్న దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు హార్మూజ్ జలసంధిని మూసే ఉంటుందన్నారు. తాజాగా ఇరాన్ వార్నింగ్‌తో ప్రపంచ దేశాల్లో చిన్నపాటి అలజడి మొదలైంది. ఈ విషయం జఠిలమైతే యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు.
Mohammad Bagher Ghalibaf:
“We are fully prepared, if they make even the slightest mistake, we will respond with force.”
The message is clear: escalation won’t go unanswered. The stakes just got higher. pic.twitter.com/SuOEkhH2wj
— Irfan Ahmad (@Irfuu_) April 18, 2026